రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వం మన సైనికులకు మేటి ఆయుధాలు, రక్షణ కవచాలు అందేలా చూస్తుంది: రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ యెస్సో నాయక్
Posted On:
06 JAN 2021 6:48PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు (6వ తేదీ జనవరి) జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ యెస్సో నాయక్ వంద వేలవ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ (బీపీజే) ను భారత ప్రధాన సేనాధిపతి అయిన మనోజ్ ముకుంద్ నరావణేకు అందజేశారు. ఈ సందర్భంగా రక్షణశాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ శత్రువులతో పోరాడుతున్న వేళ మన సైనికుల విలువైన ప్రాణాలను రక్షించాలనే నిబద్ధతను ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మన సైనికుల కార్యాచరణ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్ మాట్లాడుతూ.. "మన సైనికులకు మేటి ఆయుధాలు మరియు రక్షణ కవచాలు అందేలా ప్రభుత్వం నిర్ధారిస్తుందని, అలాంటి అవసరాలు ఎల్లప్పుడూ ప్రాధాన్యతలో అగ్రస్థానంలో ఉంటాయని" హామీ ఇచ్చారు. సరుకు సరఫరా గడువు కంటే నాలుగు నెలల ముందుగానే తొలి లక్ష జాకెట్లను సరఫరా చేసినందుకు గాను తయారీదారులైన మెస్సర్స్ ఎస్ఎంపీపీ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆయన ప్రశంసించారు. సంస్థ అందించిన ఈ బీపీజేలు మేక్ ఇన్ ఇండియా కింద సరఫరా చేసే పూర్తి స్వదేశీ ఉత్పత్తి అని అన్నారు. సంస్థ తన ఉత్పత్తిని
దేశీయ అవసరాలకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోందని తెలిపారు.
ఆత్మనిర్భార్ భారత్ చొరవకు అనుగుణంగా ఇటువంటి రక్షణ సామగ్రిని సరఫరా చేయడానికి భారతదేశం ప్రపంచ కేంద్రంగా మారుతోందని అన్నారు. మన దేశ
సరిహద్దుల్లో తిరుగుబాటులను ఎదుర్కోవడంలో జాకెట్ చాలా మెరుగ్గా ఉపయోగ
పడుతోందని మన సైనికులు అభినందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో
రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్, ఇన్‌ఫ్యాంట్రీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఎ.కె.సమంతరా, డీజీక్యూఏ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్.కె. మల్హోత్రా, సీడీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్.ఎస్ . కహ్లాన్ తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1686677)
Visitor Counter : 278