ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో వయోవృద్ధి పరిణామాలపై అధ్యయనం నిర్వహణ

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చేతుల మీదుగా సర్వే నివేదిక ఆవిష్కరణ

వయోవృద్ధులపై విధానాలకు తగిన ప్రాతిపదికగా

ఉపయోగపడనున్న అధ్యయనం

Posted On: 06 JAN 2021 4:36PM by PIB Hyderabad

   కాలానుగుణమైన వయోవృద్ధి పరిణామాలపై జరిగిన వేవ్-వన్ అధ్యయనానికి (లాసీ-ఎల్.ఎ.ఎస్.ఐ.) సంబంధించి ఇండియా సర్వే నివేదికను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వర్చువల్ వర్చువల్ వేదిక ద్వారా ఆవిష్కరించారు. నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో ముంబైకి చెందిన అంతర్జాతీయ జనాభా శాస్త్రాల అధ్యయన సంస్థ (ఐ.ఐ.పి.ఎస్.) డైరెక్టర్ డాక్టర్ కె.ఎస్. జేమ్స్, జాతీయ ఆరోగ్య పథకం మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ గర్గ్, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్, జాతీయ వయోవృద్ధుల ఆరోగ్య రక్షణ పథకం (ఎన్.పి.హెచ్.సి.ఇ.) అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గౌరీ ఎన్. సేన్ గుప్తా తదితరులు  పాల్గొన్నారు. 

  దేశంలో జనాభా వయోవృద్ధుల సమస్యలు, వృద్ధ్యాప్యానికి సంబంధించిన ఆరోగ్య, ఆర్థిక, సామాజికపరమైన నిర్ణాయకాలను, పర్యవసానాలను శాస్త్రీయ పద్ధతిలో పూర్తిస్థాయి జాతీయ అధ్యయనం జరపడమే లక్ష్యంగా ఈ లాసీ సర్వేని చేపట్టారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ వయోవృద్ధుల ఆరోగ్య రక్షణ పథకం కింద సర్వే జరిగింది. ముంబైకి ఐ.ఐ.పి.ఎస్. సంస్థ ద్వారా ఈ సర్వేకి సహాయం అందించింది. ఇందుకు అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్,  ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సంస్థ, జాతీయ వయోవృద్ధత్వ అధ్యయన సంస్థ కలసి తగిన సహాయ సహకారాలు అందించాయి.

https://ci6.googleusercontent.com/proxy/GmwAEGwT_ASGw2GU5Zfs63xtCSpDykC76V7QS8-zRh7UwzzpezOAaadiPDLPVxb-pFJf_KUDOTJ2sbrAXlMfpz9FVpSMp3hEHudb_xWX7FLryUCQCLci4zey8A=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001L71O.jpg

 

 లాసీ, వేవ్-వన్ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో 45ఏళ్లు అంతకు మించి వయస్సు కలిగిన 72,250మంది వ్యక్తులను, వారి జీవిత భాగస్వాములను, నమూనాగా తీసుకున్నారు. వారిలో 60ఏళ్లు అంతకు మించిన వయస్సు కలిగిన వయోవృద్ధులు 31,464 మంది, 75 సంవత్సరాలు అంతకు మించి వయోవృద్ధులు 6,749 మంది ఉన్నారు. సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి వారిని ఎంపిక చేశారు.

  లాసీ, వేవ్-వన్ సర్వే నివేదిక ఆవిష్కరించడం సంతోషదాయకమని కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఈ సందర్భంగా అన్నారు. “ఇది భారతదేశంపు తొలి సర్వే. ప్రపంచంలోనే ఇదివరకెన్నడూ జరగని అతిపెద్ద సర్వే. దేశంలోని వృద్ధుల జనాభాపై కాలానుగుణ ప్రాతిపదికతో కూడిన సమాచారాన్ని ఇది అందిస్తుంది. వయో వృద్ధులకోసం సామాజిక, ఆరోగ్య, ఆర్థికపరమైన సంక్షేమాల ప్రాతిపదికపై తగిన విధానాల రూపకల్పనకు ఇది ఎంతో దోహదపడుతుంది. జాతీయ వయోవృద్ధుల ఆరోగ్య రక్షణ కార్యక్రమాన్ని బలోపేతం చేసి, కార్యక్రమ పరిధిని విస్తరింపచేడయానికి  ఈ అధ్యయన అంశాలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, వయోవృద్ధుల జనాభా ఆరోగ్య రక్షణ లక్ష్యంగా పలు వ్యాధి నిరోధక చర్యలు తీసుకునేందుకు, ఆరోగ్యం దెబ్బతినే ఆస్కారం వృద్ధులకు తగిన ఆరోగ్య రక్షణ కల్పించడానికి సర్వే ఉపయుక్తంగా ఉంటుంది.” అని అన్నారు.

   లాసీ సర్వే, శాస్త్రీయ అధ్యయనం ప్రాముఖ్యతను గురించి మంత్రి వివరించారు. 2011వ సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం 60ఏళ్లకు పైబడిన వృద్ధులు, దేశ జనాభాలో 8.6శాతంగా  ఉన్నారని, అంటే అప్పటికి వారి సంఖ్య 10.3కోట్లని అన్నారు. సంవత్సరానికి 3శాతం చొప్పున వారి జనాభా పెరుగుతూ వస్తోందని, 2050 నాటికల్లా, 31.9కోట్లకు చేరుతుందని అన్నారు. వయోవృద్ధుల్లో 75శాతం మంది ఏదో ఒక దీర్ఘకాల రుగ్మతతో బాధపడుతున్నారని, 40శాతం మందికి ఏదో ఒక అంగవైకల్యం ఉందని, 20శాతం మందికి  వివిధ రకాల మానసిక ఆనారోగ్యం ఉందని మంత్రి చెప్పారు. వయోవృద్ధుల జనాభాకోసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పలు కార్యక్రమాలను చేపట్టేందుకు ఈ సర్వే తగిన ప్రాతిపదికను అందిస్తుందని అన్నారు.

https://ci3.googleusercontent.com/proxy/oPATxzT7xiSzflFo6ilMXN3I_gkqwnKdmsjqkhzV6InKnJJbKxTzMlQpbQkffVvOjt8kETYOwf_ElW-wFJRL6aL9MdcK6sbkeasCvoDXmkjTtRSv1M0g0-8eAw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0027V8O.jpg

 

   “అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో  భారీ స్థాయిలో లాసీ సర్వే జరిగిందని, ఆర్థిక సామాజిక రంగం, వివిధ ప్రాంతాలకు అనువుగా కేంద్రీకరించవలసిన అంశాలు, రేఖాంశపరమైన నమూనాలు తదితరాల ఆధారంగా సర్వే నిర్వహించినట్టు చెప్పారు. ఇందో  సమాచార సేకరణకు, నాణ్యతా నియంత్రకు, భూగోళ సంబంధమైన సమాచార సమీకరణకు కంప్యూటర్ పరిజ్ఞానంతో వ్యక్తిగత అభిప్రాయ సేకరణలు నిర్వహించారన్నారు. దేశంలో ఏ ఇతర సర్వే కూడా జరగని రీతిలో ఎంతో పకడ్బందీగా ఈ సర్వే నిర్వహించినట్టు మంత్రి చెప్పారు. కుటుంబం, సామాజిక వ్యవస్థ, ఆదాయం, ఆస్తులు, వినియోగ పద్ధతులు తదితర అంశాలతో ఎంతో సమగ్రంగా, సంపూర్ణంగా సర్వే నిర్వహించినట్టు చెప్పారు.

   దేశంలో ఆరోగ్యవంతులైన వయోవృద్ధ జనాభా ఉండాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వయోవృద్ధులకు తప్పనిసరిగా ఉత్తమమైన వైద్య రక్షణ కల్పించవలసి ఉందని కేంద్రమంత్రి అన్నారు. ఆరోగ్య సదుపాయాల విస్తరణ లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ పేరిట ప్రపంచంలోనే అతి పథకాన్ని భారతదేశం చేపట్టిందన్నారు.

  ఆరోగ్యవంతులైన వృద్ధ జనాభా అన్న లక్ష్యానికి లాసీ సర్వే సమాచారం ఎంతో దోహదపడుతుందని, వివిధ రకాల జాతీయ ఆరోగ్యకార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలోని ఇతర శాఖలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని ఈ కార్యక్రమం మరింత పెంచుతుందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

 

******(Release ID: 1686669) Visitor Counter : 207