ఆర్థిక మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్‌లో జలమార్గాలను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ $ 105 మిలియన్ల ప్రాజెక్టుకు సంతకం చేసింది

Posted On: 05 JAN 2021 5:18PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో లోతట్టు నీటి రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు ఈ రోజు 105 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుపై సంతకం చేశాయి.

పశ్చిమ బెంగాల్ లోతట్టు నీటి రవాణా, లాజిస్టిక్స్ మరియు ప్రాదేశిక అభివృద్ధి ప్రాజెక్ట్ హూగ్లీ నది మీదుగా ప్రయాణీకుల మరియు సరుకు రవాణాకు ఉపయోగపడుతుంది; కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో రాకపోకలు మెరుగుపరచడానికి ప్రాదేశిక ప్రణాళికను చేపట్టండానికి; ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాల్లో నాణ్యతను పెంచడం; మరియు రాష్ట్ర లాజిస్టిక్స్ రంగం వృద్ధికి దోహదం చేస్తుంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సి ఎస్ మోహపాత్రా మాట్లాడుతూ"లోతట్టు జలమార్గాలు ఇప్పుడు తక్కువ ఖర్చుతో పాటు ప్రయాణీకులను, సరుకు రవాణాకు పర్యావరణ అనుకూల ఎంపికగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పశ్చిమ బెంగాల్‌లో నదీ రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే కోల్‌కతా మెట్రోపాలిటన్ ఏరియాలోని మార్కెట్లు మరియు ఉద్యోగ కేంద్రాలతో అనుసంధానించడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది"అని చెప్పారు.

ఈ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సి ఎస్ మోహపాత్రా సంతకం చేశారు; పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున డిప్యూటీ రెసిడెంట్ కమిషనర్ శ్రీ రాజ్‌దీప్ దత్తా; ప్రపంచ బ్యాంక్ తరపున భారతదేశానికి చెందిన కంట్రీ డైరెక్టర్ మిస్టర్ జునైద్ అహ్మద్ సంతకాలు చేశారు.

ఈ ప్రాజెక్ట్ దక్షిణ పశ్చిమ బెంగాల్‌లోని అత్యధిక జనాభా కలిగిన ఐదు జిల్లాలను వాటి దాని పట్టణ సముదాయంతో పాటు కవర్ చేస్తుంది.ఇందులో కోల్‌కతా మెట్రోపాలిటన్ ఏరియా (కేఎంఏ)లోనే 30 మిలియన్ల మంది లేదా పశ్చిమ బెంగాల్ జనాభాలో మూడింట ఒక వంతు మంది నివసిస్తున్నారు.

"ఈ కార్యక్రమం రాష్ట్రానికి జలమార్గాలు మరియు ఫెర్రీ సేవలను సమర్థవంతమైన మరియు సురక్షితమైన పట్టణ రవాణా కల్పన వ్యూహంలో భాగంగా చేయడం ద్వారా కోల్‌కతా ఆర్ధిక ఉత్పాదకతలో పెట్టుబడులు పెట్టడానికి వీలు కల్పిస్తుంది" అని భారతదేశంలో ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ మిస్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. కోల్‌కతా యొక్క వ్యూహాత్మక స్థానాన్ని బట్టి చూస్తే మెట్రోపాలిటన్ ప్రాంతం ఉప ప్రాంతానికి రవాణా మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా ఉద్భవించిందని, ఈశాన్య రాష్ట్రాలతో పాటు నేపాల్ మరియు భూటాన్ యొక్క భూభాగాలను అనుసంధానిస్తుంది." అని చెప్పారు.

కోల్‌కతాలోని గంగా నది ఉపనది అయిన హూగ్లీ నది కోల్‌కతా నౌకాశ్రయాన్ని దాని  వినియోగ కేంద్రాల నుండి వేరు చేస్తుంది. హోల్‌సేల్ మార్కెట్‌తో పాటు నగరంలోని విస్తారమైన ప్రాంతం, ఈశాన్య భారతదేశం మరియు రెండు పొరుగు దేశాలైన నేపాల్ మరియు భూటాన్ భూబాగాలున్నాయి. ప్రస్తుతం 80 శాతం సరుకు మరియు ప్రయాణీకుల రద్దీ కోల్‌కతాలోని  మూడు వంతెనల ద్వారా నదిని దాటుతుంది. నగరంలోని ఓడరేవుకు ట్రక్కుల కదలికను కొన్ని వంతెనలకు పరిమితం చేసింది. అలాగే పరిమిత గంటలలో మాత్రమే కదలికలకు అవకాశం ఉండడం వల్ల సరుకు రవాణా ఖర్చును పెంచుతుంది.

పశ్చిమ బెంగాల్‌లోని పడవలు ప్రయాణీకులకు మరియు సరుకు రవాణాకు సమర్థవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణాను అందించగలవు, రహదారి ప్రయాణాలతో పోల్చినప్పుడు నిర్వహణ ఖర్చులు మరియు ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ఫెర్రీ వ్యవస్థ, దశాబ్దాలుగా పనిచేస్తున్నది. ప్రయాణీకుల రద్దీలో 2 శాతం కన్నా తక్కువ మరియు సరుకు రవాణాలో కొంత భాగాన్ని అందిస్తుంది. నది రవాణాను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పెద్ద జనాభా దాని జలమార్గాలను ఉపయోగించుకోవటానికి, సరుకు మరియు ప్రయాణీకులకు రవాణా కొరకు ప్రత్యామ్నాయ, బహుళ వ్యవస్థలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇది కోల్‌కతా మెట్రోపాలిటన్ ఏరియా మార్కెట్లు మరియు ఉద్యోగ కేంద్రాలతో అనుసంధానిస్తుంది మరియు లాజిస్టిక్స్ హబ్‌గా ఉద్భవిస్తుంది.

మొదటి దశలో ఈ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే లోతట్టు నీటి రవాణా వ్యవస్థ యొక్క భద్రతను మెరుగుపరుస్తుంది; ఇప్పటికే ఉన్న జెట్టీలను ఆధునీకరించడం, మెరుగైన  కొత్త ఫెర్రీలను కొనుగోలు చేయడం; 40 ప్రదేశాలలో ఎలక్ట్రానిక్ గేట్లను నెలకొల్పడం జరుగుతుంది. రెండవ దశలో టెర్మినల్స్ మరియు జెట్టీలతో సహా ప్రయాణీకుల కదలికల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశం కల్పిస్తుంది; లోతట్టు నీటి రవాణా రూపకల్పనను మెరుగుపర్చడం; ప్రమాదకరమైన మరియు అక్రమ రవాణా మార్గాలు మరియు క్రాసింగ్ పాయింట్లలో రాత్రి నావిగేషన్ ఉండేలా చూసుకోవడం; హూగ్లీ నది మీదుగా ట్రక్కులను సులభంగా తరలించడానికి అనుమతించే రో-రో నాళాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది.

వరదలను ఎదుర్కోవడంతో పాటు ప్రయాణీకుల టెర్మినల్స్ వద్ద ఫెర్రీ యాక్సెస్ పాయింట్లలో మాడ్యులర్ ఫ్లోటింగ్ డిజైన్లతో సహా క్లైమేట్ స్మార్ట్ ఇంజనీరింగ్‌కు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.దీంతో పాటు ఈ ప్రాజెక్ట్  స్నేహపూర్వక సంబంధాలను సులభతరం చేస్తుంది. మహిళల భద్రతకు భరోసా ఇస్తుంది. అలాగే జలరవాణా విభాగంలో మరియు ఫెర్రీ ఆపరేటర్లతో మహిళల ఉపాధిని ప్రోత్సహిస్తుంది.

ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్(ఐబిఆర్‌డి) నుండి తీసుకుంటున్న ఈ 105 మిలియన్ డాలర్ల రుణం 17 సంవత్సరాల కాలవ్యవధిని కలిగి ఉంది. ఇందులో 7 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉంది.

***(Release ID: 1686394) Visitor Counter : 122