హోం మంత్రిత్వ శాఖ

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) మరియు భారత్ బయోటెక్ కోవిడ్‌-19 వ్యాక్సిన్లకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఈ రోజు ఆమోదం ఇవ్వ‌డంపై కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంస‌
- "భారతదేశానికి ఇది ఒక గొప్ప విజయం!ః శ్రీ అమిత్ షా,

- "భారతదేశం గర్వించేలా చేసిన మా ప్రతిభావంతులైన మరియు కష్టపడి పనిచేసే శాస్త్రవేత్తలకు నా వందనం"

- "కోవిడ్ లేని భారతదేశం దిశ‌గా కృషి చేసినందుకు ప్రధాని శ్రీ నరేంద్రమోడి

గారికి అభినందనలు విజనరీ నాయకత్వం భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది.”

- "మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు ఆమోదం ప్రధానమంత్రి నరేంద్రమోడి యొక్క ఆత్మనిర్భర్ భారత్ యొక్క దృష్టిని పెంచడంలో గేమ్ ఛేంజర్ అని రుజువు చేస్తుంది"

- "ఈ పరీక్షా సమయాల్లో మానవాళికి అంకితభావంతో సేవ చేసిన శాస్త్రవేత్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బంది మరియు కరోనా యోధులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు"

Posted On: 03 JAN 2021 2:50PM by PIB Hyderabad

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) మరియు భారత్ బయోటెక్ యొక్క కోవిడ్‌-19 వ్యాక్సిన్లకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఈ రోజు ఆమోదం ఇవ్వ‌డంపై కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంస‌లు తెలియ‌జేశారు. డీజీసీఐ ఆమోదాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా  స్వాగ‌తించారు. ఇందుకు సంబంధించి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేస్తూ “ ఇది భారతదేశానికి ఒక గొప్ప విజయం! సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ యొక్క కోవిడ్ వ్యాక్సిన్లకు డీసీజీఐ త‌న అనుమతి ఇచ్చింది. భారతదేశాన్ని గర్వించేలా చేసిన మా ప్రతిభావంతులైన మరియు కష్ట పడి పనిచేసిన‌ శాస్త్రవేత్తలకు నా వందనం. కోవిడ్ లేని భారతదేశం దిశ‌గా కృషి చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడికి నా అభినందనలు. మోడీ విజనరీ నాయకత్వం చాలా పెద్ద మార్పు చేయగలదు. సంక్షోభ సమయంలో మానవాళికి ఆవిష్కరించడానికి, సహాయం చేయడానికి కొత్త భారత దేశం ఆసక్తిగా చూసింది.
మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు ఆమోదం ప్రధానమంత్రి నరేంద్రమోడి యొక్క ఆత్మనిర్భర్ భారత్ యొక్క విజయాన్ని పెంచడంలో గేమ్ ఛేంజర్ అని రుజువు అవుతుంది. ఈ పరీక్షా సమయాల్లో మానవాళికి అంకితభావంతో సేవ చేసిన మ‌న శాస్త్రవేత్తలు, వైద్యులు, వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బంది, కరోనా యోధులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మానవజాతి పట్ల నిస్వార్థంగా చేసిన సేవకు దేశం ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతలు తెలుపుతుంది.”

***(Release ID: 1685910) Visitor Counter : 50