ఆర్థిక మంత్రిత్వ శాఖ

"పార్టిసిపేషన్‌ ఒప్పందాల" ద్వారా ఆస్తుల బదిలీకి బ్యాంకింగ్ యూనిట్లకు ఐఎఫ్‌ఎస్‌సీఏ అనుమతి

Posted On: 30 DEC 2020 12:18PM by PIB Hyderabad

భారతదేశం లోపలగానీ, వెలుపలగానీ నివశిస్తున్న వ్యక్తుల నుంచి లేదా ఆర్థిక సంస్థల నుంచి ఆస్తులు స్వీకరించడానికి లేదా బదిలీ చేయడానికి బ్యాంకింగ్‌ యూనిట్లకు "అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ" (ఐఎఫ్‌ఎస్‌సీఏ) అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన "ప్రామాణిక రిస్క్‌ పార్టిసిపేషన్‌ ఒప్పందం" ద్వారా ఆస్తుల బదిలీకి అంగీకరించింది.

    రిస్క్‌ పార్టిసిపేషన్‌ ఒప్పందం మార్గంలో ఆస్తులను బదిలీ చేయడం చాలా రంగాల్లో, ముఖ్యంగా వ్యాపార ఆర్థిక రంగంలో ఒక సాధారణ పద్ధతి. ఉభయ పక్షాల (కొనేవారు, అమ్మేవారు) పరస్పర సమ్మతితో ఒక ప్రామాణిక పత్రం ద్వారా కుదుర్చుకునే ఒప్పందాన్ని రిస్క్‌ పార్టిసిపేషన్‌ ఒప్పందంగా పిలుస్తారు. "బ్యాంకర్స్ అసోసియేషన్ ఫర్ ఫైనాన్స్ అండ్ ట్రేడ్" (బాఫ్ట్) రూపొందించిన "మాస్టర్‌ రిస్క్‌ పార్టిసిపేషన్‌ అగ్రిమెంట్‌" (ఎంఆర్‌పీఏ), సాధారణ ప్రామాణిక రిస్క్ పార్టిసిపేషన్ ఒప్పందాల్లో ఒకటి.

    విదేశాల్లో ఉన్న బ్యాంకులకు బదులుగా, ఐఎఫ్ఎస్‌లోని బ్యాంకింగ్‌ యూనిట్ల ద్వారా "విదేశీ నగదు ఆస్తుల రిస్క్ పార్టిసిపేషన్‌"ను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.

 

***



(Release ID: 1684962) Visitor Counter : 153