ప్రధాన మంత్రి కార్యాలయం
130 కోట్లకు పైగా ప్రజల వ్యూహాత్మక శక్తితో పాటు, ఒక పెద్ద ఆర్థిక శక్తి కి రాజధానిగా ఉన్న ఢిల్లీ వైభవం సుస్పష్టంగా ఉండి తీరాలి: ప‌్రధాన మంత్రి
ఢిల్లీ లో 21వ శతాబ్ద ఆకర్షణలను తీర్చిదిద్దడం కోసం కృషి జరుగుతోంది: ప్రధాన మంత్రి
Posted On:
28 DEC 2020 2:06PM by PIB Hyderabad
దేశంలో ప్రతి ఒక్క నగరం అది చిన్న నగరమైనా లేదా పెద్ద నగరం అయినా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక కేంద్రం గా మారనుందని, అయితే దేశ రాజధానిగా ఢిల్లీ ప్రపంచం లో తనదైన ఉనికిని నిలబెట్టుకొంటున్న 21వ శతాబ్ద భారతదేశం తాలూకు శోభ ఉట్టిపడాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వ్యాఖ్యానించారు. ఈ పాత నగరాన్ని ఆధునికీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మొట్టమొదటి డ్రైవర్ లెస్ మెట్రో కార్యకలాపాలతో పాటు, నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు ను ఢిల్లీ మెట్రో ఎయర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ కు విస్తరించడాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మొదలుపెట్టిన తరువాత ప్రధాన మంత్రి ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.
ప్రభుత్వం పన్ను రిబేటులను ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీకి ప్రోత్సాహకాన్ని అందించిందని శ్రీ మోదీ అన్నారు. రాజధాని లో పాత మౌలిక సదుపాయాలను ఆధునిక సాంకేతిక విజ్ఞానం పై ఆధారపడ్డ మౌలిక సదుపాయాల వలే మార్పు చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. ఈ ఆలోచనా విధానం వందల కొద్దీ కాలనీల సువ్యవస్థీకరణ ద్వారా మురికివాడ నివాసుల జీవన స్థితిగతులను మెరుగుపరచే ఏర్పాటులోను, పాతవైపోయిన ప్రభుత్వ భవనాలను పర్యావరణ మిత్రపూర్వకమైన ఆధునిక భవనాలుగా మార్చడంలోను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
ఒక పాత పర్యటక కేంద్రమైన ఢిల్లీని, అలాగే 21వ శతాబ్ది ఆకర్షణలను ఈ నగరంలో ఆవిష్కరించేందుకు కృషి సాగుతోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీ అంతర్జాతీయ సమావేశాలకు, అంతర్జాతీయ ప్రదర్శనలకు, అంతర్జాతీయ వ్యాపార ప్రధాన పర్యటనలకు ఒక అభిమానపూర్వక గమ్యస్థానంగా మారుతున్న కారణంగా రాజధానిలోని ద్వారక ప్రాంతంలో దేశం లోనే అతిపెద్దదైన కేంద్రాన్ని నిర్మించడం జరుగుతోందని ఆయన వివరించారు. అదే విధంగా ఒక అతిపెద్ద భారత వందన ఉద్యానవనం తో పాటు, పార్లమెంటు నూతన భవన సముదాయం తాలూకు పని మొదలైనట్లు ఆయన వివరించారు. ఇది ఢిల్లీ లో వేల కొద్దీ ప్రజలకు ఉపాధిని ప్రసాదించడమే కాకుండా, నగర రూపురేఖలను కూడా మార్చివేస్తుందని ఆయన అన్నారు.
తొలి డ్రైవర్ లెస్ మెట్రో కార్యకలాపాలు, ఢిల్లీ మెట్రో ఎయర్‌పోర్ట్ ఎక్స్ ప్రెస్ కు నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు విస్తరణ ప్రారంభం సందర్భంలోను రాజధాని నగర పౌరులకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘‘ఢిల్లీ ఒక పెద్ద ఆర్థిక, వ్యూహాత్మక శక్తి కి రాజధానిగా ఉన్నందువల్ల ఇక్కడ ఈ నగరం వైభవం కళ్ళకు కట్టాలని’’ పేర్కొన్నారు.
***
(Release ID: 1684115)
Visitor Counter : 199
Read this release in:
Marathi
,
Odia
,
Tamil
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam