ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో క్రియాశీల కేసుల తగ్గుదల కొనసాగుతోంది, నేడు వాటి సంఖ్య 2.77 లక్షల దగ్గర ఉంది

మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య కన్నా కోలుకున్న కేసులు 95 లక్షలు దాటాయి

మిలియన్ మందిలో కేసులు సంక్రమిస్తున్నవారి సంఖ్య, మిలియన్ లో మరణాల సంఖ్యా ప్రపంచంలోనే అత్యల్పంగా భారత్ లోనే నమోదయ్యాయి

Posted On: 28 DEC 2020 10:50AM by PIB Hyderabad

భారతదేశం మొత్తం క్రియాశీల కేసుల తగ్గుదల  ధోరణి కొనసాగుతోంది. దేశం క్రియాశీల కేసులోడ్ నేడు 2,77,301 వద్ద ఉంది. మొత్తం పాజిటివ్ కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య 2.72 శాతానికి తగ్గిపోయింది . 

మొత్తం యాక్టివ్ కేసులోడ్ నుండి 1,389 కేసుల నికర క్షీణత గత 24 గంటల్లో నమోదైంది.

నెల నుండీ, రోజువారీ కోలుకునే వారి సంఖ్య  రోజువారీ కొత్త కేసులను మించిపోయాయి. గత 24 గంటల్లో దేశంలో 20,021 మంది వ్యక్తులు కోవిడ్ పాజిటివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో, యాక్టివ్ కేసులోడ్ పడిపోయాయి అని చెప్పడానికి 21,131 కొత్త రికవరీలు నమోదు కావడమే తార్కాణం. మొత్తం రికవరీలు 98 లక్షలకు (97,82,669) దగ్గర పడుతున్నాయి. రికవరీ రేటు కూడా 95.83% కి పెరిగింది. రికవరీలు మరియు క్రియాశీల కేసుల మధ్య అంతరం స్థిరంగా విస్తరిస్తోంది, ఈ రోజు 95 లక్షలు (95,05,368) దాటింది.

 

ప్రపంచవ్యాప్తంగా పోల్చినప్పుడు, మిలియన్ జనాభాకు భారతదేశ కేసులు అన్ని దేశాల కన్నా అత్యల్పంగా ఉన్నాయి (7,397). గ్లోబల్ సగటు 10,149. రష్యా, యుకె, ఇటలీ, బ్రెజిల్, ఫ్రాన్స్ మరియు యుఎస్ఎ వంటి దేశాలు మిలియన్ జనాభాకు కేసుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదయ్యాయి.

కొత్తగా కోలుకున్న కేసులలో 72.99% 10 రాష్ట్రాలు / యుటిలలో కేంద్రీకృతమై ఉన్నట్లు గమనించారు. కొత్తగా కోలుకున్న 3,463 కేసులతో కేరళ గరిష్టంగా ఒకే రోజు రికవరీలను నివేదించింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2,124 మంది కోలుకున్నారు, పశ్చిమ బెంగాల్‌లో 1,740 మంది ఉన్నారు.

 

 

కొత్త కేసులలో 79.61% 10 రాష్ట్రాలు మరియు యుటిల నుండి వచ్చినవి. 

కేరళ రోజువారీ అత్యధికంగా 4,905 కేసులను నివేదిస్తూనే ఉంది. మహారాష్ట్ర  3,314, పశ్చిమ బెంగాల్ 1,435 కొత్త కేసులతో ఉన్నాయి.

 

గత 24 గంటల్లో 279 మరణాలు సంభవించాయి. 

రోజువారీ మరణాలలో 80.29% పది రాష్ట్రాలు / యుటిలలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో గరిష్ట ప్రాణనష్టం జరిగింది (66). పశ్చిమ బెంగాల్ మరియు కేరళ వరుసగా 29 మరియు 25 మరణాలతో ఉన్నాయి.

.

 

భారతదేశంలో రోజువారీ మరణాలు నిరంతరం తగ్గుతున్నాయి. భారతదేశంలో మిలియన్ జనాభాకు మరణాలు (107) ప్రపంచంలోనే అతి తక్కువ నమోదవుతున్నాయి. ప్రపంచ సగటు 224గా ఉంది.

 

                                                                                                                                                                                               

 

****



(Release ID: 1684087) Visitor Counter : 132