హోం మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీతో కలసి రైతులతో మాట్లాడిన హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా


"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది"

"గ్రామంలోని రైతులందరూ రైతుల సంక్షేమ విధానాలు మరియు మోడి ప్రభుత్వ వ్యవసాయ సంస్కరణలపై ఉత్సాహంతో మరియు ఉత్సాహంతో తమ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు"

"గత ఆరు సంవత్సరాలుగా, మోడి ప్రభుత్వం పేదలు, రైతులు మరియు నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకుంది. వారికి హక్కులతో పాటూ అధికారం ఇచ్చింది. వారి జీవితాలను ఉజ్వలంగా మార్చింది"

"పిఎమ్ కిసాన్ అపూర్వమైన పథకం, దీని ద్వారా మోడి ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలకు 6000 రూపాయలను జమ చేస్తున్నది."

" రైతుల వ్యవసాయ అవసరాలు తీర్చే విధంగా ఈ రోజు మోడీ పిఎమ్ కిసాన్ పథకం కింద 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18,000 కోట్ల చేశారు"

"రైతుల సాధికారత కోసం కృషి చేస్తున్న మోడీని నేను అభినందిస్తున్నాను."

"యుపిఎ ప్రభుత్వం 10 సంవత్సరాలలో కేవలం 60,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి జి కేవలం రెండున్నర సంవత్సరాలలో 95,000 కోట్ల రూపాయలను 10 కోట్

Posted On: 25 DEC 2020 8:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీతో కలసి హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా రైతుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ అమితాషా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో తాను మాట్లాడిన ఒక గ్రామానికి చెందిన రైతులు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసారని శ్రీ షా తెలిపారు. రైతులు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకున్నదని అన్నారు. రైతులు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా పీఎం కిసాన్ ద్వారా ప్రతి ఏడాది ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో ఆరు వేల రూపాయలను జమ చేస్తున్నామని వివరించారు.

Image

ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలలోకి 18,000 వేల కోట్ల రూపాయలను బదిలీ చేసి వారి వ్యవసాయ అవసరాలకు అవసరమైన నిధులను సమకూర్చారని మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మోడీని ఆయన అభినందించారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సమయంలో ప్రతిపక్ష పార్టీలు దానిని వ్యతిరేకించి రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని శ్రీ షా ప్రస్తావించారు. 10 సంవత్సరాల పాలనలో యూపీఏ ప్రభుత్వం కేవలం 60,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తే రెండున్నర సంవత్సరాలలో శ్రీ మోడీ 95,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి నేరుగా బదిలీ చేసి 10 కోట్ల మంది రైతులకు అండగా నిలిచారని తెలిపారు.

Image

2014కి ముందు ఆ తరువాత వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితిని షా వివరించారు. 2013-14లో 265 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా ఇప్పుడు ఇది 296 మిలియన్ టన్నులకు చేరిందని అన్నారు. 2013-14లో వ్యవసాయ బడ్జెట్ 21,933 కోట్ల రూపాయలుగా ఉండగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేటాయింపులను 1,34,399 కోట్ల రూపాయలకు పెంచిందని వివరించారు. అధికారంలో ఉండగా వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించని వారు తమ నుంచి వివరణ కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. పనిలేని ప్రతిపక్ష నాయకులు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. దేశంలోకనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసే కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో మోడీ ఇదే విషయాన్ని చెప్పారని తానూ కూడా చెబుతున్నానని షా అన్నారు. ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఉండాలని రైతుల డిమాండ్ ను 70 ఏళ్ళ పాటు పరిపాలన సాగించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపిన షా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల డిమాండ్ కు ఆమోదం తెలిపారని అన్నారు.

Image

2009-14ల మధ్య గోధుమ, వరి కోనేగోళ్ల కోసం 3,74,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయగా 2014-19 ల మధ్య ఇది 8,22,000 కోట్లకి చేరిందని అన్నారు. ఇవికాకుండా రైతుల సంక్షేమం కోసం యూరియా సరఫరా, భూసార పరీక్షలు లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తున్నాదని అన్నారు. తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందేలా చూడడానికి దేశంలో 1000 మార్కెట్లను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి పంటల బీమా పథకం వల్ల ఆరున్నర కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగిందని అన్నారు. 10,000 రైతు సంఘాలను నెలకొల్పిన ప్రభుత్వం వీటికి 7,000 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. తేనె ఉత్పత్తి కోసం మరో 500 కోట్ల రూపాయలను కేటాయించామని అన్నారు. ప్రధానమంత్రి నీటిపారుదల పథకం కింద సూక్ష్మ వ్యవసాయం కోసం 55 లక్షల హెక్టార్ల భూమికి నీరు అందిస్తున్నామని అన్నారు.

Image

వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసిన శ్రీ షా ఈ చట్టాలు రైతులకు ఎలాంటి హాని కలిగించవని చెప్పారు. ఈ ఒక్క మార్కెట్ మూతపడదని చెప్పిన మంత్రి రైతుల భూమిలో ఒక్క అంగుళాన్ని కూడా ఎవరూ తీసుకోలేరని ప్రకటించారు. నరేంద్రమోడీ అధికారంలో ఉన్నంత రైతులను కార్పొరేట్ సంస్థలు ఏమి చేయలేవని మంత్రి ప్రకటించారు. అన్ని మార్కెట్లు పనిచేస్తాయని చెప్పిన మంత్రి చట్టంలోని ఏ సంస్కరణ మార్కెట్లను ప్రస్తావించిందని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు ధైర్యం ఉంటే చర్చలకు రావాలని ఆయన సవాల్ చేశారు.

Image

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి ఇప్పుడు తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలను శంకర్లాల్ గురు కమిటీ సిఫారసు చేసిందని హోం మంత్రి చెప్పారు. 2001 లో మాంటెక్ సింగ్ అహ్లువాలియా కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ సిఫార్సులు శరద్ పవార్ వ్యవసాయ మంత్రిగా వున్నప్పుడు ఏర్పడిన స్వామినాథన్ కమిషన్ నివేదికలో కూడా చేర్చబడ్డాయి. రైతులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో ఫోన్ లో మాట్లాడి వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు. ఈ చట్టాల వల్ల తమకు ప్రయోజనం కలుగుతుందని వారు నమ్మకంతో వున్నారని షా తెలిపారు. ప్రతిపక్షాలను పక్కన పెడితే చట్టాల వల్ల తమకు హాని కలుగుతుందని భావిస్తున్న రైతులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన శ్రీ షా రైతుల ఆదాయం పెరిగేలా చూస్తామని అన్నారు.

Image

****



(Release ID: 1683923) Visitor Counter : 199