సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
గుడ్ గవర్నెన్స్ దినోత్సవం సందర్భంగా ఇ-హెచ్ ఆర్ ఎంఎస్ బ్రోచర్‌ను విడుదల చేసిన హోం కార్యదర్శి, డిఒపిటి కార్యదర్శి ఎ.కె. భల్లా
Posted On:
25 DEC 2020 1:52PM by PIB Hyderabad
కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 25 డిసెంబర్, 2017న ప్రారంభించిన ఇ-హెచ్ ఆర్ ఎంఎస్‌కు సంబందించిన పురోగతి నివేదికను కేంద్ర హోం కార్యదర్శి , డిఒపిటి కార్యదర్శి ఎ.కె. భల్లా శుక్రవారం విడుదల చేశారు. డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించిన ఎలక్ర్టానిక్ -హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఇ-హెచ్ ఆర్ ఎంఎస్)లో 5 మాడ్యూళ్ళకు సంబంధించి 25 అప్లికేషన్లు ఉన్నాయి.
ఇ-బ్రోచర్‌ను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, రానున్న రోజుల్లో అన్ని మంత్రిత్వ శాఖలకు ఇది మంచి, ప్రభావవంతమైన పరికరం అవుతుందని భల్లా అన్నారు. విధాన తయారీలోనూ, సిబ్బందికి సంబంధించిన వ్యవహారాలను నిర్వహించడంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అప్లికేషన్‌లోని పరికరాలు ఎంతో తోడ్పడతాయన్నారు. సమగ్ర రీతిలో దానిని వినియోగించేందుకు ఇ-హెచ్ ఆర్ ఎంఎస్‌కు అన్ని మంత్రిత్వ శాఖలలోనూ ప్రచారాన్ని కల్పించవలసిన అవసరం ఉందన్నారు.
తమ సర్వీసుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వోద్యోగులు ఇ-హెచ్ ఆర్ ఎంఎస్ ద్వారా అందుబాటులోకి తెచ్చుకోగలుగుతున్నారని, భారత ప్రభుత్వంలో దీనికి డిజిటల్ రూపంలో హెచ్ ఆర్ ప్రక్రియలు ఉన్నందున, ఇది సిబ్బందికి పలు విధాలుగా లబ్ధి చేకూర్చేందుకే కాక సామర్ధ్యాన్ని పెంచేందుకు దారి తీస్తోందని డిఒపిటి అదనపు కార్యదర్శి రష్మి చౌదరి చెప్పారు.
ఇ-హెచ్ ఆర్ ఎంఎస్ ఆధునిక వర్షన్ ద్వారా సిబ్బంది తమ డబ్ల్యు.ఆర్.టి. సర్వీసు బుక్‌ను, శలువలు, జిపిఎఫ్, జీతం తదితర వివరాలను చూసుకోగలగడమే కాకుండా వారు ఒకే వేదిక ద్వారా వివిధ రకాలైన క్లెయిములు, రీఇంబర్స్‌మెంట్లు, రుణాలు/ అడ్వాన్సులు, శలువు, లీవ్ ఎన్‌కాష్‌మెంట్, ఎల్‌టిసి అడ్వాన్సులు, టూర్లు తదితరాలకు దరఖాస్తు చేసుకోగలుగుతారు.
ఈ వ్యవస్థ ఉద్యోగికి, యజమానికి డాష్ బోర్డును కల్పించడమే కాకుండా, సర్వీసు రికార్డులు అప్‌డేట్ చేయడం, కార్యాలయ విధివిధానాల్లో ఇ-గవర్నెన్స్, ఫైళ్ళ కదలికను తగ్గించి, వేగంగా సేవలు అందించడం, నిర్ణయాలు చేయడంలో తోడ్పాటు, ఉద్యోగుల పత్రాల సామాన్య నిక్షేపం, మాస్టర్ డాటా ప్రామాణీకరణ, వ్యక్తులు డాటా ఎంట్రీ చేయడాన్ని తగ్గించడం, భాగస్వాముల మధ్య సమాచారాన్ని పంచుకోవడాన్ని సరళతరం చేయడం, జవాబుదారీ తనం/ విశ్వసనీయత కోసం ఇ- సంతకం, పిఎఫ్ ఎంఎస్, జిపిఎఫ్, అడ్వాన్సులు, లోన్లు, రీఇంబర్స్‌మెంట్ల త్వరితగతి చెల్లింపుల కోసం ఇ-హెచ్ ఆర్ ఎంఎస్ సమగ్ర పరచడం వంటి పలు లాభాలాను ఈ వ్యవస్థ సమకూరుస్తుంది.
ఈ కార్యక్రమంలోఎ.కె. భల్లాతో పాటుగా, డిఒపిటి సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
***
(Release ID: 1683735)
Visitor Counter : 243