జల శక్తి మంత్రిత్వ శాఖ

రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ప్రభత్వ లక్ష్యం

ఈ దిశలో పార్లమెంటులో మూడు బిల్లులను ఆమోదించాం

' శ్రీ అటల్ బిహారీ వాజపేయి జన్మదితోత్సవం రోజున రైతుల ఖాతాలలోకి నేరుగా 18,000 కోట్ల రూపాయల జమ చేస్తాం'

'వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చలకు సిద్ధం. అన్నదాతల అనుమానాలు నివృత్తి చేస్తాం'

.. కేంద్రమంత్రి శ్రీ రట్టన్ లాల్ కటారియా

Posted On: 24 DEC 2020 5:25PM by PIB Hyderabad

రైతుల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర జల్ శక్తి, సామాజిక న్యాయం, సాధికార శాఖ మంత్రి శ్రీ రట్టన్ లాల్ కటారియా స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దీనిలో భాగంగానే పార్లమెంటులో మూడు బిల్లులను ఆమోదించామని ఆయన తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ఇతర ఆంక్షలనుతొలగించడమే కాకుండా రైతులకు నూతన హక్కులను కలిగించి వారికి మరిన్ని అవకాశాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఈ బిల్లులను రూపొందించామని ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో శ్రీ రట్టన్ లాల్ కటారియా పేర్కొన్నారు. రైతుల అంశంలో ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న వైఖిరిని తప్ప్పుపట్టిన శ్రీ రట్టన్ లాల్ కటారియా రైతుల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ అవకాశవాద వైఖిరిని అవలంభిస్తున్నాయని మంత్రి విమర్శించారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఈనెల 25వ తేదీన 9 కోట్లమంది రైతుల ఖాతాలలోకి 18,000 కోట్ల రూపాయలను బదిలీ చేస్తారని మంత్రి ప్రకటించారు. స్వర్గీయ ప్రధాని భారత రత్నఅటల్ బిహారీ వాజపేయి జన్మదినోత్సవాన్ని ఉత్తమ పరిపాలనా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపిన మంత్రి ఈ సందర్భంగా 25వ తేదీన 12 గంటలకు రైతులను ఉద్దెశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. వాజపేయి కలసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్న శ్రీ రట్టన్ లాల్ కటారియా వాజపేయిని దూరదృష్టి గల నాయకునిగా, భారత రాజకీయాలలో ఉత్తమునిగా వర్ణించారు.

కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలుకుతుందంటూ రైతుల్లో నెలకొన్న ఆందోళనలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. మద్దతు ధరలను ప్రభుత్వం పెంచుతూ వస్తున్నదని గుర్తు చేసిన మంత్రి 2013-14 తో పోల్చిచూస్తే 2019-20లో కనీస మద్దతు ధరలను ప్రభుత్వం రెండున్నరరెట్లు పెంచిందని అన్నారు. సాగుకు అయ్యే ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చూడడానికి 2018-19లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని మంత్రితెలిపారు. దీనిలో భాగంగా 2013-14లో బడ్జెట్ లో వ్యవసాయరంగానికి చేసిన 21,933 కోట్ల రూపాయలుగా ఉన్నకేటాయింపులను2020-21లో ఆరు రెట్లు 1,34,399 కోట్ల రూపాయలకు పెంచామని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇంతవరకు 10. 59 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ 95,779 కోట్ల రూపాయలను బదిలీ చేశామని వివరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద 6. 6 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారని అన్నారు. ఈ పథకం కింద రైతులకు 87,000 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. వీటితో పాటు రైతులకు ప్రయోజనం కలిగించే అనేక నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకున్నదని వివరించిన మంత్రి యూరియా సరఫరా, కిసాన్రైళ్లు, భూసార ఆరోగ్య కార్డులు తదితర అంశాలను ప్రస్తావించారు. రైతుల సంక్షేమం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి ప్రతిపక్ష పార్టీల వైఖిరి తో అప్రమత్తంగా ఉండాలని రైతులను కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మూడు బిల్లులను తెచ్చామని అన్నారు. రైతుల భవిషత్తు ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్న మంత్రి అన్నదాతల తలరాతలు మారడం ఖాయమని స్పష్టం చేశారు.

 

***

 

 

 

 

 

 


(Release ID: 1683509) Visitor Counter : 103