సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఎన్‌బీసీఎఫ్‌డీసీ సహ నిధులను ఉపయోగించి; ఓబీసీ కేటగిరీ నర్సులు, ఫార్మాసిస్టులు, ఈబీసీ వ్యక్తులకు టీకా నిర్వహణ శిక్షణ ఇవ్వడానికి ఎన్‌బీసీఎఫ్‌డీసీ, అపోలో మెడ్‌స్కిల్స్‌ మధ్య ఎంవోయూ

Posted On: 24 DEC 2020 4:36PM by PIB Hyderabad

    కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని    'జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక, అభివృద్ధి సంఘం' (ఎన్‌బీసీఎఫ్‌డీసీ‌) అపోలో మెడ్‌స్కిల్స్‌ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఎన్‌బీసీఎఫ్‌డీసీ సహ నిధులను ఉపయోగించి; వెనుకబడిన వర్గాలకు చెందిన నర్సులు, ఫార్మాసిస్టులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వ్యక్తులకు టీకా నిర్వహణ శిక్షణ ఇవ్వడానికి ఈ ఎంవోయూ కుదిరింది. ఈ-లెర్నింగ్‌, భౌతిక కార్యశాలల ద్వారా తొమ్మిది రోజులపాటు శిక్షణ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన కార్యాచరణ మార్గదర్శకాలను నుంచి తీసుకున్న పాఠ్యాంశాలపై ఈ శిక్షణ ఇస్తారు.

    వచ్చే కొన్ని నెలల్లో టీకా శిక్షణ తీసుకోనున్న వేలాది మంది, కేంద్ర ప్రభుత్వం కోట్లాది భారతీయులకు కొవిడ్‌-19 టీకా వేయించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్‌బీసీఎఫ్‌డీసీ డీజీఎం శ్రీ సురేష్‌ కుమార్‌ శర్మ, అపోలో మెడ్‌స్కిల్స్‌ వ్యాపారాభివృద్ధి&కార్పొరేట్‌ సంబంధాల విభాగాధిపతి శ్రీ విశాల్‌ సిన్హా  అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్‌బీసీఎఫ్‌డీసీ ఎండీ శ్రీ కె.నారాయణ్‌, అపోలో మెడ్‌స్కిల్స్‌ సీఈవో డా.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
 

 

*****



(Release ID: 1683441) Visitor Counter : 75