ఆర్థిక మంత్రిత్వ శాఖ
రానున్న కేంద్ర బడ్జెట్ 2021-22కు సంబంధించి ప్రీ-బడ్జెట్ సమావేశాలను ముగించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- 15 వర్చువల్ సమావేశాలలో 9 మంది వాటాదారుల సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 170 మందికి పైగా ఆహ్వానితులు పాల్గొన్నారు
Posted On:
23 DEC 2020 5:19PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
రానున్న కేంద్ర బడ్జెట్ 2021-22కు సంబంధించిన ప్రీ-బడ్జెట్ సమావేశాలను ముగించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వర్చువల్ విధానంలో
ఈ సమావేశాలను నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పనలో సలహాల కోసం ఈ ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశాల్ని నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. షెడ్యూల్ చేసిన 15 సమావేశాలలో 9 మంది వాటాదారుల సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 170 మందికి పైగా ఆహ్వానితులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఆర్థిక మరియు క్యాపిటల్ మార్కెట్లు; ఆరోగ్యం, విద్య మరియు గ్రామీణాభివృద్ధి; నీరు మరియు పారిశుధ్యం; ట్రేడ్ యూనియన్, కార్మిక సంస్థ; పరిశ్రమ, సేవలు మరియు వాణిజ్యం; మౌలిక రంగ సదుపాయాలు, ఇంధన, వాతావరణ మార్పు విభాగం; వ్యవసాయం, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ; పారిశ్రామికవేత్తలు మరియు ఆర్థికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఎ.బి. పాండే; దీపామ్ విభాగం కార్యదర్శి శ్రీ తుహిన్ కాంతా పాండే; వ‌్యయశాఖ కార్యదర్శి శ్రీ టి.వి.శోమనాథన్; డీఈఓ కార్యదర్శి శ్రీ తరుణ్ బజాజ్; ముఖ్య ఆర్థిక సలహాదారు శ్రీకృష్ణమూర్తి సుబ్రమణియన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో భాగంగా పన్ను చెల్లింపుతో సహా వివిధ ఆర్తిక విధానాలు కలిగి ఉన్న పలు విషయాలపై వాటాదారుల సమూహం అనేక సూచనలు చేశాయి; బాండ్ మార్కెట్లు; బీమా; మౌలిక సదుపాయాల వ్యయం; ఆరోగ్యం మరియు విద్య బడ్జెట్; సామాజిక రక్షణ; నైపుణ్యం; నీటి హార్వెస్టింగ్ మరియు పరిరక్షణ; పారిశుధ్యం; ఎంజీఎన్ఆర్ఈజీఏ; ప్రజా పంపిణీ వ్యవస్థ; వ్యాపారం నిర్వహణ సులభతరం; ఉత్పత్తి లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్, ఎగుమతులు; ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల బ్రాండింగ్, పబ్లిక్ సెక్టార్ డెలివరీ వ్యవస్థ; ఇన్నోవేషన్, గ్రీన్ గ్రోత్; ఇంధన మరియు వాహనాల కాలుష్య రహిత వనరులు తదితరమైన అంశాలపై సూచనలు చేశారు. 2020-21 రెండవ త్రైమాసికంలో కోవిడ్-19 వల్ల ఏర్పడిన ప్రతికూలతను అధిగమించేందుకు ఆర్థిక వృద్ధిలో బలమైన రికవరీకి గాను సర్కారుచర్యలను ఈ సమాశంలో పాల్గొన్న వారు ప్రశంసించారు. కోవిడ్-19 మహమ్మారి ప్రేరిత మరణాలు ప్రతికూల ప్రభావం కనబరుస్తున్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలలో వృద్ధిని కనబరిచిన చాలా కొద్ది దేశాలలో భారతదేశం ఉందని వారు పేర్కొన్నారు. 2021-22 బడ్జెట్‌ను సిద్ధం చేసేటప్పుడు ఈ సమావేశాలలో పాల్గొన్న భాగస్వామ్య పక్షాల వారి సలహాలను జాగ్రత్తగా పరిశీలిస్తామని హామీ ఇచ్చిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంలో పాల్గొని తమ విలువైన సలహాలను పంచుకున్నందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.
****
(Release ID: 1683198)
Visitor Counter : 184