ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

బ్రిటన్ ‌లో వెలుగుచూసిన సార్స్ -కోవ్-2 వైరస్ కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఎపిడెమియోలాజికల్ నిఘా మరియు ప్రతిస్పందన కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని జారీ చేసింది.

Posted On: 23 DEC 2020 2:21PM by PIB Hyderabad

సార్స్ -కోవ్-2 వైరస్ కొత్త వేరియంట్ [వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ (వియుఐ) -20212/01] యునైటెడ్ కింగ్‌డమ్ (యుకే) ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కు నివేదించింది.

ఈ వేరియంట్‌ను యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఇసిడిసి) మరింత వ్యాప్తి చెందుతుందని, యువత పై అధిక ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. ఈ వేరియంట్ 17 మార్పులు లేదా ఉత్పరివర్తనాల సమితి (మ్యుటేషన్లు) ద్వారా నిర్వచిస్తున్నారు. మానవ ఏస్2 గ్రాహకంతో బంధించడానికి వైరస్ ఉపయోగించే స్పైక్ ప్రోటీన్‌లోని ఎన్501వై మ్యుటేషన్ చాలా ముఖ్యమైనది. స్పైక్ ప్రోటీన్  ఈ భాగంలో మార్పులు వైరస్ మరింత అంటువ్యాధిగా మారవచ్చు మరియు ప్రజల మధ్య మరింత సులభంగా వ్యాప్తి చెందుతుంది.

ఎపిడెమియోలాజికల్ నిఘా, ప్రతిస్పందన కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎస్ఓపి జారీ చేసింది. గత 4 వారాలలో (2020 నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు) యుకే నుండి ప్రయాణించిన  అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ ఇక్కడ ప్రవేశించే సమయంలో చేపట్టాల్సిన కార్యకలాపాలను ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపి) వివరిస్తుంది. ఈ ఎస్ఓపి లో పరీక్షకు సంబంధించిన ఆర్టి-పీసీఆర్ పరీక్ష ద్వారా మాత్రమే నిర్ధారిస్తారు. 

బ్రిటన్ నుండి విమానాలు 2020 డిసెంబర్ 23 నుండి 31 వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. 2020 డిసెంబర్ 21 నుండి 23 వరకు ఈ మధ్య కాలంలో యుకే లోని విమానాశ్రయాల నుండి ప్రయాణించి వచ్చి భారతదేశంలో ప్రవేశించే ప్రయాణీకులందరూ   ఆర్టి-పీసీఆర్ పరీక్షకు లోబడి కదలికలు ఉంటాయి. ఆ వ్యక్తి నమూనా కరోనా పాజిటివ్ అయి ఉంటే, స్పైక్ జన్యు-ఆధారిత  ఆర్టి-పీసీఆర్ పరీక్ష ను కూడా నిర్వహించాలని సిఫార్సు చేశారు.పాజిటివ్ నిర్ధారణ అయిన ప్రయాణీకులు సంబంధిత రాష్ట్ర ఆరోగ్య అధికారుల సమన్వయంతో ఒక ప్రత్యేక (ఐసోలేషన్) యూనిట్‌లో సంస్థాగత ఐసోలేషన్ సదుపాయంలోకి పంపుతారు. నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) లేదా జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం తగిన ఏదైనా ఇతర ప్రయోగశాలకు పంపడానికి అవసరమైన చర్యలు ప్రారంభించారు. జెనోమిక్ సీక్వెన్సింగ్ సార్స్-కోవ్-2కి సంబంధించిన కొత్త వేరియంట్ ఉనికిని సూచిస్తే, అప్పుడు రోగిని ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్‌లో ఉంచి క్లినికల్ ప్రోటోకాల్ ప్రకారం చికిత్స చేస్తారు.

విమానాశ్రయంలో ఆర్టీ-పిసిఆర్‌ పరీక్షలో నెగటివ్ వస్తే ఇంట్లో క్వారంటైన్ కి వెళ్లాలని సూచిస్తారు. చెక్-ఇన్ చేయడానికి ముందు, ఈ ఎస్ఓపి గురించి ప్రయాణికుడికివివరిస్తారు. విమానంలో కూడా ఈ కొత్త సూచనలను చేస్తారు. గత ఒక నెల నుండి భారతదేశానికి చేరుకున్నయుకే నుండి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులను జిల్లా నిఘా అధికారులు సంప్రదించి పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు / ఇంటిగ్రేటెడ్ డిసీజ్ నిఘా కార్యక్రమ విభాగం కూడా గడచినా నాలుగు నెలలు నుండి యు కే నుండి వచ్చిన ప్రయాణికుల గురించి శోధించి వారి ఆరోగ్య స్థితిగతులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం అవి వారిని కూడా పరీక్షించి పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన వారి పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి పర్యవేక్షిస్తారు.

Link for the SOP:

https://www.mohfw.gov.in/pdf/SOPforSurveillanceandresponseforthenewSARSCov2variant.pdf

 

***



(Release ID: 1683088) Visitor Counter : 138