పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

ఢిల్లీలోని పరిశ్రమలను 100 శాతం పిఎన్‌జికి మార్చాలని ఎయిర్ క్వాలిటీ కమిషన్ స్పష్టం చేసింది.

ఆమోదం కాని ఇంధనాలను ఉపయోగిస్తున్న పరిశ్రమలను గుర్తించడంతో పాటు వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఆదేశం

Posted On: 22 DEC 2020 1:56PM by PIB Hyderabad

ఎన్‌సిఆర్‌ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలలోని ఢిల్లీ ప్రభుత్వ ఎన్‌సీటీ, గెయిల్ మరియు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పరిశ్రమలను పైప్డ్ నేచురల్ గ్యాస్‌కు మార్చడం యొక్క పురోగతిని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సమీక్షించింది.

ఢిల్లీలోని 50 పారిశ్రామిక ప్రాంతాలలో విస్తరించి ఉన్న 1644 పారిశ్రామిక యూనిట్లు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) కు మారడానికి గుర్తించబడ్డాయి. గణనీయమైన సంఖ్యలో పరిశ్రమలు పిఎన్‌జిని ఉపయోగిస్తున్నప్పటికీ..ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యానికి పారిశ్రామిక రంగం ప్రధాన కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గుర్తించబడిన అన్ని పరిశ్రమలు పిఎన్‌జికి మారవలసిన అవసరాన్ని కమిషన్ గుర్తించింది. పైప్‌లైన్ నెట్‌వర్క్, మీటరింగ్ మరియు అనుబంధ మౌలిక సదుపాయాలను పూర్తి చేయడానికి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) మరియు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పనిచేస్తున్నాయి.

ఢిల్లీలోని గుర్తించిన అన్ని పారిశ్రామిక యూనిట్ల ద్వారా మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయడం మరియు పిఎన్‌జికి పూర్తిస్థాయిలో మారడం లక్ష్యంగా పారిశ్రామిక విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ మరియు ఐజిఎల్‌ను కోరింది. జనవరి 31, 2021 నాటికి ఆమోదించని ఇంధనాలను ఉపయోగించే పరిశ్రమలను గుర్తించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు సమ్మతించని పరిశ్రమలపై కఠినమైన తీసుకోవాలని డిపిసిసిని ఆదేశించారు.

***


(Release ID: 1682691)