వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జాతీయ స్టార్ట‌ప్ అవార్డులు 2021కి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న డిపిఐఐటి

Posted On: 22 DEC 2020 2:48PM by PIB Hyderabad

ప‌రిశ్ర‌మ‌లు, అంత‌ర్గ‌త వాణిజ్య ప్రోత్సాహ శాఖ (డిపిఐఐటి) జాతీయ స్టార్ట‌ప్ అవార్డుల (ఎన్ ఎస్ ఎ),2021 రెండ‌వ ఎడిష‌న్‌ను ప్రారంభిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో ఎదురైన ముందెన్న‌డూ లేని స‌వాళ్ళ‌ను ఎదుర్కోవ‌డంలో స్టార్ట‌ప్ లు చూపిన ప‌ట్టుద‌ల‌, చొర‌వ‌లు, కృషిని గుర్తిస్తూ, ఎన్ ఎస్ ఎ 2021లో అద‌న‌పు కేట‌గిరీల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను సాధించేందుకు అత్యంత కీల‌క ఉత్ప‌త్తుల‌ను దేశీయంగా ఉత్ప‌త్తి చేసే దిశ‌గా దృష్టి పెట్టిన ఆవిష్క‌ర‌ణ‌ల‌ను గుర్తించాల‌ని కూడా అది భావిస్తోంది. ఈ అవార్డుకు 31 జ‌న‌వ‌రి,2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
స్టార్ట‌ప్‌ల‌కు ఈ అవార్డుల‌ను 15 విస్త్ర‌త రంగాలుగా వ‌ర్గీక‌రించిన 49 ఏరియాల్లో ఇస్తారు. ఈ 15 రంగాల‌లో వ్య‌వ‌సాయం, ప‌శు సంవృద్ధి, మంచినీరు, విద్య‌, నైపుణ్యాల అభివృద్ధి, ఇంధ‌నం, సంస్థ‌ల‌కు చెందిన వ్య‌వ‌స్థ‌లు, ప‌ర్యావ‌ర‌ణం, ఫిన్ టెక్‌, ఆహార శుద్ధి, ఆరోగ్యం, సంక్షేమ ప‌రిశ్ర‌మం 4.0, భ‌ద్ర‌త‌, అంత‌రిక్షం, ర‌వాణా, ప‌ర్యాట‌కం ఉన్నాయి. ఇందుకు అద‌నంగా, గ్రామీణ ప్రాంతాల‌పై ప్ర‌భావం చూపుతున్న విద్యా సంస్థ‌లు, మ‌హిళా ఔత్సాహిక వ్యాపార‌వేత్త‌లు, దిగుమ‌తి ప్ర‌త్యామ్నాయానికి సంభావ్య‌త‌లు, కోవిడ్‌-19పై పోరాడేందుకు ఆవిష్క‌ర‌ణ‌లు, ఇండిక్ భాష‌ల‌లో విష‌యాంశాన్ని అందించ‌డానికి ప్ర‌య‌త్నించే స్టార్ట‌ప్‌ల‌కు ఆరు ప్ర‌త్యేక అవార్డులు ఇవ్వ‌నున్నారు. బ‌ల‌మైన స్టార్ట‌ప్ వాతావ‌ర‌ణానికి కీల‌క‌మైన పునాదిరాళ్ళుగా ఉన్నఅసాధార‌ణ‌మైన‌, స్థిరోష్ణ పేటిక‌లా వ్య‌వ‌హ‌రిస్తూ, వేగ‌వంత‌మైన ఎదుగుద‌ల‌ను కూడా అది గుర్తించి బ‌హుక‌రిస్తుంది. 
ప్ర‌తి అంశంలోనూ గెలుపొందిన స్టార్ట‌ప్‌కు రూ. 5 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తారు. అంతేకాకుండా, విజేత‌కు, ఇద్ద‌రు ర‌న్న‌ర‌ప్‌ల‌కు కూడా త‌గిన ప్ర‌జాధికారుల వ‌ద్ద‌, కార్పొరేట్‌ల వ‌ద్ద నుంచి సంభావ్య పైలెట్ ప్రాజెక్టుల‌ను, వ‌ర్క్ ఆర్డ‌ర్ల‌ను పొందేందుకు త‌మ ప‌రిష్కారాల‌ను అందించేందుకు అవ‌కాశాల‌ను క‌ల్పిస్తారు. అలాగే, వివిధ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్టార్ట‌ప్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనేందుకు వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. 
ఎదుగుద‌ల‌కు సిద్ధంగా ఉన్న‌ దానికి, వేగ‌వంతంగా ఎదుగుతున్న వారికి రూ. 15 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇవ్వ‌నున్నారు. 
ఉపాధి క‌ల్ప‌న‌కు లేక సంప‌ద‌ను పెంచుకోవ‌డానికి అధిక సంభావ్య‌త ఉండి, కొల‌వ‌ద‌గిన సామాజిక ప్ర‌భావాన్ని చూపుతూ ఒక స్థాయిలో ఉన్న‌ వ్యాపార సంస్థ‌లుగా ఉండే స్టార్ట‌ప్‌ల‌కు, నూత‌న ఉత్ప‌త్తుల‌ను, ప‌రిష్కారాల‌ను అందించే వాతావ‌ర‌ణం క‌లిగిన కొత్త సంస్థ‌ల‌ను గుర్తించి, అభినందించాల‌నే ఉద్దేశంతో డిపిఐఐటి తొలి జాతీయ స్టార్ట‌ప్ అవార్డుల‌ను 2019లో ప్రారంభించింది. ఎన్ ఎస్ ఎ తొలి ఎడిష‌న్ భారీగా విజ‌య‌వంతం కావ‌డంతో ఆ చొర‌వ‌ను ముందుకు తీసుకువెడుతూ, డిపిఐఐటి ఇప్పుడు రెండ‌వ జాతీయ స్టార్ట‌ప్ అవార్డులు, 2021ని ప్ర‌క‌టించింది. 

అవార్డుకు న‌మోదు చేసుకునే వారు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం www.startupindia.gov.in. వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు. 

***



(Release ID: 1682687) Visitor Counter : 199