రక్షణ మంత్రిత్వ శాఖ
కొత్త 'బరోడా మిలిటరీ శాలరీ ప్యాకేజీ' కోసం 'బ్యాంక్ ఆఫ్ బరోడా'తో సైన్యం ఎంవోయూ
Posted On:
22 DEC 2020 1:37PM by PIB Hyderabad
కొత్త 'బరోడా మిలిటరీ శాలరీ ప్యాకేజీ' కోసం; 'బ్యాంక్ ఆఫ్ బరోడా', సైన్యం కలిసి ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. సైన్యం తరపున లెఫ్టినెంట్ జనరల్ రవిన్ ఖోస్లా, బ్యాంక్ ఆఫ్ బరోడా తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ విక్రమాదిత్య సింగ్ సంతకాలు చేశారు. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన, ప్రస్తుతం పనిచేస్తున్నవారికి ఏ విధమైన బ్యాంక్ సేవలు అందించాలన్నదానిపై ఈ ఒప్పందం కుదిరింది.
సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన, ప్రస్తుతం పనిచేస్తున్నవారికి, ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా ఉన్న 8,200 పైచిలుకు శాఖలు, 20,000 సంప్రదింపుల కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుతాయి.
ఉచిత ప్రమాద బీమా, శాశ్వత పూర్తి అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యాని పరిహారం, విమాన ప్రమాద బీమాతోపాటు; సర్వీసులో ఉన్న సైనికుడు చనిపోతే సంతానానికి ఉన్నత విద్యకు సాయం, కుమార్తె వివాహానికి సాయం వంటి రక్షణలు ఈ ప్యాకేజీ ద్వారా అందుతాయి. అన్ని ఏటీఎంల్లో అపరిమిత ఉచిత లావాదేవీలు, చిన్నపాటి రుణాలపై సేవా రుసుముల మాఫీ, ఆర్‌టీజీఎస్/నెఫ్ట్ ద్వారా ఉచిత నగదు బదిలీలు, ఉచిత డీడీ/చెక్కులు, లాకర్ల అద్దెల్లో భారీ రాయితీ, కార్డు వినియోగంపై అదనపు ప్రయోజనాల వంటివి కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.
***
(Release ID: 1682686)
Visitor Counter : 157