ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం-వియత్నాం వర్చువల్ శిఖరాగ్ర సదస్సు : ఫలితాల పట్టిక (డిసెంబర్ 21, 2020)
Posted On:
21 DEC 2020 7:50PM by PIB Hyderabad
వరుస సంఖ్య
|
పత్రాలు
|
భారత ప్రతినిధులు
|
వియత్నాం ప్రతినిధులు
|
1.
|
శాంతి, సుసంపన్నత, ప్రజల కోసం భారతదేశం, వియత్నాం ల సంయుక్త దృష్టికోణం
భారతదేశం, వియత్నాం ల మధ్య నెలకొన్న చారిత్రక, సాంస్కృతిక బంధం; ఉమ్మడి విలువలు, ప్రయోజనాలు; పరస్పర వ్యూహాత్మక విశ్వాసం, అవగాహన పునాదిగా ఉభయ దేశాల భవిష్యత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది..
|
ప్రధాన మంత్రులు ఆమోదం తెలిపినవి
|
2.
|
2021-2023 మధ్య కాలం లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రాబోయే కాలం లో అమలుపరచేందుకు తగిన కార్యాచరణ ను రూపొందించడం
2021-2023 సంవత్సరాల మధ్య శాంతి, సుసంపన్నత, ప్రజల కోసం రూపొందించిన సంయుక్త దృష్టికోణం అమలు కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికల ప్రతిపాదన.
|
డాక్టర్ ఎస్. జయశంకర్ , విదేశీ వ్యవహారాల మంత్రి
|
శ్రీ ఫామ్ బింహ్ మిన్హ్, ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల మంత్రి
|
3.
|
భారతదేశం రక్షణ శాఖ కు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగనికి, వియత్నాం జాతీయ రక్షణ శాఖ కు చెందిన రక్షణ పరిశ్రమల జనరల్ డిపార్ట్ మెంట్ కు మధ్య రక్షణ పరిశ్రమల సహకారానికి రంగాన్ని సిద్ధం చేయడం
ఉభయ దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకార వృద్ధికి ఒక యంత్రాంగం ఏర్పాటును ప్రోత్సహించడం.
|
శ్రీ సురేంద్ర ప్రసాద్ యాదవ్, జాయింట్ సెక్రటరీ (నావల్ సిస్టమ్స్)
|
మేజర్ జనరల్ ల్యోంగ్ థాన్ చుంగ్, వైస్ చైర్ మన్
|
4.
|
వియత్నాం లోని న్హా ట్రాంగ్ లో గల జాతీయ టెలీకమ్యూనికేషన్ విశ్వవిద్యాలయం లో ఆర్మీ సాఫ్ట్ వేర్ పార్క్ ను ఏర్పాటు చేయడం కోసం హనోయి లోని భారతదేశ దౌత్యాధికార కార్యాలయానికి, వియత్నాం జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖకు మధ్య 5 మిలియన్ యుఎస్ డాలర్ల భారత గ్రాంట్ రూప సహాయానికి గాను ఒప్పందం.
సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ల రంగం లో శిక్షణ కు, సేవల ఏర్పాట్ల తో పాటు న్హా ట్రాంగ్ లో గల జాతీయ టెలీకమ్యూనికేషన్ విశ్వవిద్యాలయం లో ఆర్మీ సాఫ్ట్ వేర్ పార్క్ ఏర్పాటు కు మార్గాన్ని సుగమం చేయడం.
|
శ్రీ ప్రణయ్ వర్మ
వియత్నాం రాయబారి
|
కల్నల్ లీ జువాన్ హంగ్,
రెక్టార్
|
5.
|
ఐక్య రాజ్య సమితి శాంతి స్థాపన కార్యకలాపాల కోసం భారతదేశానికి చెందిన ఐ.రా.స. శాంతి స్థాపన కేంద్రం, వియత్నాం కు చెందిన స్థాపన కార్యకలాపాల విభాగానికి మధ్య సహకార పూర్వక వ్యవస్థ ను అమలుపరచడం
ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ రంగం లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యకలాపాల ను గుర్తించడం.
|
మేజర్ జనరల్ అనిల్ కుమార్ కాశిద్
అదనపు డైరెక్టర్ జనరల్ (ఐసి)
|
మేజర్ జనరల్ హో అంగ్ కిమ్ ఫంగ్
డైరెక్టర్
|
6.
|
భారతదేశ అణు శక్తి నియంత్రణ మండలి (ఎఇఆర్ బి) కి, వియత్నాంకు చెందిన వియత్నాం ఏజెన్సీ ఫార్ రేడియేషన్ ఎండ్ న్యూక్లియర్ సేఫ్ టీ (విఎఆర్ఎఎన్ఎస్) ల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం.
రేడియేషన్ నుంచి రక్షణ కల్పించడం, పరమాణు భద్రత లపై ఉభయ దేశాల నియంత్రణ సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం.
|
శ్రీ జి. నాగేశ్వర రావు
చైర్మన్
|
ప్రొఫెసర్ గుయెన్ తువాన్ ఖయీ
డైరెక్టర్ జనరల్
|
7.
|
సిఎస్ఐఆర్- ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్ కు, వియత్నాం పెట్టోలియమ్ ఇన్స్ టిట్యూట్ కు మధ్య ఎమ్ఒయు.
పెట్రోలియం పరిశోధన, శిక్షణలలో సహకారాన్ని పెంపొందించడం
|
డాక్టర్ అంజాన్ రే
డైరెక్టర్
|
శ్రీ గుయెన్ అనహ దువో
డైరెక్టర్
|
8.
|
టాటా మెమోరియల్ సెంటర్ ఆఫ్ ఇండియా కు, వియత్నాం నేశనల్ కేన్సర్ హాస్పిటల్ కు మధ్య ఎమ్ఒయు.
కేన్సర్ రోగులకు రోగనిర్ధారణ , చికిత్స ల కోసం విజ్ఞాన శాస్ర్త సంబంధ పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవల లో సహకారానికి సంబంధించిన రంగాలలో ఆదాన ప్రదానాలను పెంపొందించడం.
|
డాక్టర్ రాజేంద్ర ఎ బడ్ వే
డైరెక్టర్
|
శ్రీ లే వాన్ క్వాంగ్
డైరెక్టర్
|
9.
|
నేశనల్ సోలర్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా కు, వియత్నాం క్లీన్ ఎనర్జి ఎసోసియేశన్ కు మధ్య ఎమ్ఒయు
భారతదేశం, వియత్నాం లోని సౌర శక్తి పరిశ్రమల మధ్య నైపుణ్యం, సర్వోత్తమ కార్యప్రణాళికలు, సమాచార ఆదాన ప్రదానాలను ప్రోత్సాహించడానికి ; భారతదేశం, వియత్నాంలలో సౌర శక్తి కి ప్రోత్సహించడం కోసం కొత్త వ్యాపారావకాశాల ను గుర్తించడం.
|
శ్రీ ప్రణవ్ ఆర్.మెహతా
చైర్మన్
|
శ్రీ డావూ డూ డూంగ్
ప్రెసిడెంట్
|
వెలువరించిన ప్రకటనలు :
1. వియత్నాం బార్డర్ గార్డ్ కమాండ్ కోసం హైస్పీడ్ గార్డ్ బోట్ (హెజ్ఎస్ జిబి) తయారీ ప్రాజెక్టు కోసం వియత్నాం కు భారత ప్రభుత్వం 100 మిలియన్ డాలర్ల డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ మంజూరు; ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన ఒక హెచ్ఎస్ జిబి ని వియత్నాం కు అప్పగించడం; భారత్ లో నిర్మించిన రెండు హెచ్ఎస్ బిజి లను ప్రారంభించడం; వియత్నాం లో నిర్మాణం జరిగే ఏడు హెచ్ఎస్ జిబి ల ఓడ వెన్ను పలక ను తయారు చేయడం.
2. వియత్నాం లోని నిన్హ్ థువాన్ ప్రాంతం లో స్థానిక సముదాయానికి ప్రయోజనం కలిగించేందుకు 1.5 మిలియన్ యుఎస్ డాలర్ల భారతదేశ ‘గ్రాంట్- ఇన్- ఎయిడ్’ తో ఏడు అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేసి, అప్పగించడం.
3. ప్రస్తుతం అమలులో ఉన్న వార్షిక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు (క్యుఐపి) లను 2021-2022 వ వర్తమాన ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5 నుంచి 10 కి పెంచడం.
4. వియత్నాం లో వారసత్వ సంరక్షణ కు ఉద్దేశించిన మూడు కొత్త అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్టులు (అవి.. మై సన్ లో ఎఫ్ బ్లాక్ దేవాలయం ; క్వాంగ్ నామ్ ప్రాంతం లో డోంగ్ డువోంగ్ బౌద్ధారామం ; ఫు యెన్ ప్రాంతం లో నన్ చామ్ టవర్).
5. భారతదేశం- వియత్నాం నాగరికత, సాంస్కృతిక సంబంధాల పై ఒక విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేయడం కోసం ద్వైపాక్షిక ప్రాజెక్టు ను ప్రారంభించడం.
***
(Release ID: 1682672)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam