ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

గుజరాత్, రాజ్ కోట్ ‌లోని ఎయిమ్స్ ‌లో మొదటి బ్యాచ్ ఎం.బి.బి.ఎస్. విద్యార్థుల 2020-21 విద్యా సంవత్సరాన్ని, డిజిటల్ గా ప్రారంభించిన - డాక్టర్ హర్ష వర్ధన్

"ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో దేశ పోరాటంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ముందంజలో ఉన్నారు"



“వైద్యం ఒక అపూర్వమైన మరియు ఒత్తిడితో కూడిన వృత్తి. డాక్టర్ వృత్తిని ఎంచుకున్న యువ, ప్రతిభావంతులైన విద్యార్థులు అభినందనీయులు”

Posted On: 21 DEC 2020 3:46PM by PIB Hyderabad

గుజరాత్, రాజ్ కోట్ ‌లోని ఎయిమ్స్ లో మొదటి బ్యాచ్ ఎం.బి.బి.ఎస్. విద్యార్థుల 2020-21 విద్యా సంవత్సరాన్ని,  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే; గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాన్నీ; గుజరాత్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ నితిన్ భాయ్ పటేల్ సమక్షంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. 

ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (పి.ఎమ్.ఎస్.ఎస్.వై) ఆరవ దశ కింద, రాజ్ కోట్ లోని ఎయిమ్స్  ను అభివృద్ధి చేస్తున్నారు.  అనేక ప్రత్యేక వైద్య సదుపాయాలతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగాలతో కూడిన 750 పడకల ఆసుపత్రి ఇది.  అత్యాధునిక వైద్య పరికరాల కోసం 185 కోట్ల రూపాయలతో సహా, ఈ ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయం దాదాపు 1195 కోట్ల రూపాయలు. 

ఎయిమ్స్ రాజ్ ‌కోట్ ‌లోని ఎం.బి.బి.ఎస్. మొదటి బ్యాచ్ విద్యార్థులను డాక్టర్ హర్ష వర్ధన్ అభినందిస్తూ, “గుజరాత్, రాజ్ కోట్ లోని  ఎయిమ్స్, గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి దూరదృష్టి నాయకత్వంలో ఉద్భవించిన అనేక కొత్త ఎయిమ్స్ లో ఒకటి. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కొత్త ఎయిమ్స్ ఏర్పాటు యొక్క స్వల్పకాలిక లక్ష్యం సరసమైన తృతీయ ఆరోగ్య సంరక్షణలో అంతరాలను తగ్గించడమే, దీర్ఘకాలిక దృష్టి భారతదేశంలోని సాధారణ జనాభాలో ఆరోగ్యాన్ని సృష్టించడం.” అని పేర్కొన్నారు.

ఆరోగ్య సంరక్షణ సేవల్లో ప్రాంతీయ అసమతుల్యతను తగ్గించడానికి, వైద్య విద్యకు సౌకర్యాలను విస్తరించడానికి,  ప్రభుత్వ ప్రాధాన్యతను డాక్టర్ హర్ష వర్ధన్, పునరుద్ఘాటిస్తూ,  "ప్రాంతీయ సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య పరిరక్షణ వ్యాప్తిని మరియు దాని ప్రాప్యతను ప్రోత్సహించడానికి వివిధ రాష్ట్రాల్లో కొత్త ఎయిమ్స్ ఏర్పాటులో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో ఇది ఒక భాగం . అదే సమయంలో 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలు ఏకకాలంలో, ప్రణాళిక వ్యవధిలో, ఒక సమగ్ర దశ వైద్యుల డిమాండ్, సరఫరా మరియు ఆసుపత్రి పడకల మధ్య అంతరాలను తగ్గించడంలో ప్రభుత్వం మరింతగా కృషి చేస్తోంది.” అని చెప్పారు.

హర్ష వర్ధన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "రాజ్ కోట్ లోని ఎయిమ్స్ లో ఈ.డబ్ల్యూ.ఎస్. విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లతో సహా మొత్తం 125 ఎం.బి.బి.ఎస్. సీట్లు ఉన్నాయి. దీనికి అదనంగా, 60 మంది నర్సింగ్ విద్యార్థులకు నిర్ణీత సమయంలో అవకాశం కల్పిస్తారు. 2021 నాటికి వైద్యుడు - రోగి నిష్పత్తి “ప్రతి 1000 కి 1” అనే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. వైద్యుల అవసరాలలో అంతరాన్ని తగ్గించే అత్యవసర లక్ష్యంతో ఎం.బి.బి.ఎస్. సీట్ల మొత్తం లభ్యతను 80,000 కు పెంచడానికి మా ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తోంది.” అని తెలియజేశారు.  "2013-14 విద్య సంవత్సరం నుండి, ఆరు కొత్త  ఎయిమ్స్ లో మొత్తం ఎం.బి.బి.ఎస్. సంఖ్య 600 వరకు పెరుగుతుంది.  దీంతో, అదనంగా 300 ఎం.బి.బి.ఎస్. ఆశావాదులకు అవకాశం కలుగుతుంది.  2020 లో ఎయిమ్స్ రాజ్‌కోట్ మాదిరిగా కొత్త ఎయిమ్స్‌ ను చేర్చడంతో, దేశంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో, మొత్తం అందుబాటులో ఉన్న ఎం.బి.బి.ఎస్. సీట్ల సంఖ్య 42,495 కు పెరిగింది, ” అని ఆయన చెప్పారు. 

శ్రీ చౌబే మాట్లాడుతూ, "గుజరాత్ లోని ఎయిమ్స్ లో ఎం.బి.బి.ఎస్. విద్యార్థుల మొదటి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో వైద్య విద్యారంగంలో ఇది ఒక మైలురాయి అవుతుంది. కోవిడ్ కాలంలో, మహమ్మారిని నియంత్రించడంలో మన ఆరోగ్య సంరక్షణ కార్మికుల సహకారం గణనీయంగా ఉంది.” అని అన్నారు.

చివరగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ,  "ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో దేశ పోరాటంలో,  వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలు ముందంజలో ఉన్నారు. వైద్య వృత్తిని ఎంచుకున్న యువ ప్రతిభావంతులైన విద్యార్థులు అభినందనీయులు. నేను మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను.  మీరు ఈ వృత్తిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అని అన్నారు.

ఈ కార్యక్రమంలో - పార్లమెంటు సభ్యుడు శ్రీ మోహన్ భాయ్ కుందరియా; పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పూనమ్ మదాం; పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అమీ యాజ్ఞిక్; కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి  శ్రీ రాజేష్ భూషణ్; ఎయిమ్స్ అధ్యక్షుడు డాక్టర్ పి.కె. దవే ;  ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ మిశ్రా తో పాటు ఇతర సీనియర్ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

*****



(Release ID: 1682557) Visitor Counter : 116