రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

తెలంగాణలో 14 జాతీయ రహదారుల ప్రాజెక్టులు

రూ. 13,00కోట్లతో 765కిలోమీటర్ల పనులకు ప్రారంభోత్సవం,
శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

తెలంగాణలోని అన్ని జిల్లాలు త్వరలో జాతీయ రహదారులతో
అనుసంధానం అవుతాయని ప్రకటన.

గత ఆరేళ్లలో రాష్ట్రంలో 1,918కిలోమీటర్ల పొడవైన 59రోడ్ల పనులకు
రూ. 17,617 కోట్లతో అనుమతి.

సి.ఆర్.ఐ.ఎఫ్. కింద రాష్ట్రానికి రూ. 2,436కోట్లు మంజూరు,.
.రూ. 1,483కోట్ల ఇప్పటికే విడుదల

Posted On: 21 DEC 2020 3:00PM by PIB Hyderabad

  తెలంగాణలో 14 జాతీయ రహదారుల ప్రాజెక్టుల పనలను కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి, శంకుస్థాపన చేశారు.  ఈ ప్రాజెక్టుల పరిధిలో రూ .13,169 కోట్ల విలువైన 765.663 కిలోమీటర్ల నిడివిగల రహదారులు  ఉన్నాయి. కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, జనరల్ డాక్టర్ వి.కె. సింగ్, తెలంగాణ రహదారులు, భవనాలు, శాసనస వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

https://ci5.googleusercontent.com/proxy/sDZMz5wyCRumhuVeSAy8wpJnjsuO41vBBd6K3S-m-sBvnSYrRzbPlKDsPVPbYmkYQtJDoS7Ao0A03KOANYyVwv0r9E4YhhATBqqrKepYYecc_pcwq8o-mcItVg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0019CT3.jpg

తెలంగాణలో 14 జాతీయ రహదారి ప్రాజెక్టులకు 2020, డిసెంబరు 21న జరిగిన ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల వీడియో చిత్రాలు

   ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, గత ఆరేళ్లలో తెలంగాణలో రూ .17,617 కోట్ల వ్యయంతో 1918 కిలోమీటర్ల పొడవైన, మొత్తం 59 రహదారి ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, ఇందులో 15,689 కోట్ల వ్యయంతో 1,782 కిలోమీటర్ల పొడవైన రోడ్ల పనులు ఇప్పటికే మంజూరయ్యాయని తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు దాదాపు అన్ని జాతీయ రహదారులతో అనుసంధానం ఏర్పడిందన్నారు. మిగిలిన పెద్దపల్లి జిల్లాకు కూడా జాతీయ రహదారుల వ్యవస్థతో త్వరలో అనుసంధానం ఏర్పడుతుందన్నారు. గత ఆరేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 55.71 శాతం పెరిగిందని కేంద్రమంత్రి చెప్పారు. ఆరేళ్లలోనే రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిడివి దాదాపు 1400 కిలోమీటర్లు పెరిగిందన్నారు. కేంద్ర రహదారి, మౌలిక సదుపాయాల నిధి (సి.ఆర్.ఐ.ఎఫ్.) పథకం కింద రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ .2,436 కోట్లు మంజూరుకాగా,  ఇప్పటికే  రూ.1,483 కోట్లు విడుదలయ్యాయని అన్నారు.


 

https://ci5.googleusercontent.com/proxy/BGP8xkpgZ997sWCUYlYgbL5pdmv8QREo_eI7YhfSQEn9vKjxfKkPQxVKY05yvV4wR4hVjK4GafL9ZkFlruomUSoVPK0jY0xXCGUriN_LXBq564JXaj6LhPZ5zA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002U6GM.jpg

తెలంగాణలో 14 జాతీయ రహదారి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్న కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

 

 తెంగాణలో 2014-15నుంచి  రూ. 4,793కోట్ల విలువైన 8,411కిలో మీటర్ల రహదారుల నిర్మాణం పూర్తయిందని, మరో 13,012 కోట్ల విలువైన 809 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కొనసాగుతోందని గడ్కరీ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 8,957కోట్లతో 328 కిలోమీటర్ల నిడివితో 13 ప్రధాన ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఇంకా ఆమోదం లభించవలసి ఉందని,  రూ. 2,339 కోట్లతో 192 కిలో మీటర్ల పొడవుతో కూడిన 3 ప్రధాన ప్రాజెక్టులు ఇంకా బిడ్డింగ్ దశలో ఉన్నాయని గడ్కరీ చెప్పారు. జాతీయ రహదారుల్లో, రూ. 27,116 కోట్లతో 1,422 కిలో మీటర్ల పొడవైన రహదారులకు సంబంధించిన 21 పనులు ప్రాజెక్టు నివేదిక రూపకల్పన దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు.

  నవభారత నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రపంచ స్థాయి రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇందుకోసం, అతిపెద్ద మౌలిక సదుపాయాల పథకమైన భారతమాల పరియోజన వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. కీలకమైన గమ్య స్థానాల మధ్య సరకు రవాణా, ప్రయాణికుల రవాణా లక్ష్యంగా సమర్థవంతమైన వ్యవస్థను శాస్త్రీయమైన అధ్యయనంతో రూపొందించడమే ఈ పరియోజన లక్ష్యం. భారతమాల పరియోజన కింద తెలంగాణలో 1,730 కిలో మీటర్ల పొడవైన రహదారుల అభివృద్ధి పనులను గుర్తించారు. ఈ 14 పనుల్లో 423  కిలో మీటర్ల పొడవైన 9 ప్రాజెక్టులకు అనుమతి లభించింది. ఈ 9 ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. 7,400 కోట్లుగా అంచనా వేశారు.

https://ci6.googleusercontent.com/proxy/CJ8SElJAUwzC6IOF9OazoKK3sfKczX8xMOrcXhD0l7BMWnqFP3Xy91_kJ21RwF_bQa6xS3fz-xkMHXeu-5x1Ug3easRfj7XGW1Mo3RtIzRkvRNomJDdicJDSTA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00370G6.jpg

తెలంగాణలో 14 జాతీయ రహదారి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్న కేంద్ర రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వి.కె. సింగ్.

 

  ప్రస్తుతం అందుబాటులో ఉన్న రవాణా రహదారుల వ్యవస్థలో వాహనాల రద్దీని నియంత్రించి, ప్రయాణ సమయాన్ని, వ్యయాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యంతో సరికొత్త రహదారుల కారిడార్ ను నిర్మించాలని సంకల్పించారు. అవి వరుసగా:

  • సూరత్, అహ్మద్ నగర్, షోలాపూర్, కర్నూలు, చెన్నై (తెలంగాణలో 75కిలోమీటర్ల నిడివి)
  • సూర్యాపేట-ఖమ్మం-దేవరపల్లె( తెలంగాణలో 164 కిలోమీటర్ల నిడివి)
  • ఇండోర్-హైదరాబాద్( తెలంగాణలో 136 కిలోమీటర్ల నిడివి.)

 ఈ  కొత్త రహదారి కారిడార్ల అభివృద్ధితో రహదారులపై ప్రస్తుతం నెలకొన్న వాహన రద్దీ తగ్గడంతోపాటుగా, ప్రయాణ వ్యవధి, ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. అలాగే వాతావరణంలోకి వెలువడే కర్బన ఉద్గారాల పరిమాణం కూడా అదుపులోకి వస్తుంది. ప్రయాణికుల, వాహన చోదకుల బడలికను తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణానికి దోహదపడేలా రహదారుల వెంబడి పలు వసతి సదుపాయాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ప్రయాణికుల, వాహన చోదకుల భద్రతకు తగినట్టుగా ఈ కారిడార్లకు రూపకల్పన చేశారు. ఈ రవాణా కారిడార్ల ఏర్పాటుతో పలు రకాల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుంది. దీనితో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి వీలుంటుంది.

  ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, వ్యవసాయాన్ని ఆర్థిక ఉత్పాదనా కార్యక్రమంగా బహువిధాలుగా రూపొందించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. దేశంలో చక్కెర, బియ్యం ఉత్పత్తి ఇప్పటికే మన అవసరాలకు మించిపోయిందని, వాటి నిల్వకు తగిన సదుపాయాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి అన్నారు.  అదనపు ఉత్పత్తులను ఇథనాల్గా మార్చి వాహనాలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించుకోవచ్చని అన్నారు. ఇది రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమేకాక, దేశ ఇంధన అవసరాలకు స్వదేశీ  వనరుగా ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/xPR9mEl0O-CoFpVyxzG19ymO9gds8wX5bvt2BKig-vO8Hb9PoyKkvCdHeDbCGv50NaaQkVnWEXSvgLgd9FXIfBDbMieETukcRw0dQAw87SoJez3Lis7TXEjOtg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004G9QO.jpg

తెలంగాణలో 14 జాతీయ రహదారి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్న తెలంగాణ రహదారులు, భవనాలు, శాసనస వ్యవహారాలు,

 గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

 

*****


(Release ID: 1682456) Visitor Counter : 174