గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోలకతా, గ్వాలియర్లలో రెండు ట్రైబ్స్ ఇండియా అవుట్ లెట్ లను ప్రారంభించిన - శ్రీ అర్జున్ ముండా
దేశవ్యాప్తంగా ఇప్పుడు 125 కి పైగా ఉన్న - ట్రైబ్స్ ఇండియా అవుట్ లెట్ లు
Posted On:
19 DEC 2020 7:36PM by PIB Hyderabad
ఈ రోజు కోల్‌కతాలో బ్రహ్మాండంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా రెండు ట్రైబ్స్ ఇండియా షోరూమ్‌లను (వ్యక్తిగతంగా కోల్‌కతాలోనూ, దృశ్య మాధ్యమం ద్వారా గ్వాలియర్ లోనూ) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో - కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, శ్రీమతి రేణుకా సింగ్; ట్రైఫెడ్, చైర్ పర్సన్, శ్రీ రమేష్ చంద్ మీనా; కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి, శ్రీ దీపక్ ఖండేకర్ లు, గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ సిటీ ప్రాంతంలోని కొత్త షోరూమ్ వద్ద జరిగిన కార్యక్రమానికి - ట్రైఫెడ్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ ప్రవీర్ కృష్ణ తో పాటు, ఇతర ట్రైఫెడ్ అధికారులు హాజరయ్యారు.
సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన అనంతరం, శ్రీ అర్జున్ ముండా, దుకాణంలో కలియతిరుగుతూ, గిరిజన చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులను ఆశక్తిగా తిలకించి, మెచ్చుకున్నారు. ఆ తర్వాత, అక్కడ సిబ్బందితోనూ, సహజమైన, సేంద్రీయ రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులు, హస్త కళా వస్తువులతో పాటు ఇతర కళా ఖండాలను ప్రదర్శిస్తున్న గిరిజన ఉత్పత్తుల అమ్మకందారులతోనూ అయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా శ్రీ ముండా మాట్లాడుతూ, "కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద ట్రైఫెడ్, గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించడంలో మరియు విక్రయించడంలో, కృషి చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. గిరిజన హస్తకళలు, చేనేత వస్త్రాలు, వన్ ధన్ నేచురల్స్ తో పాటు రోగనిరోధక శక్తి బూస్టర్ల మార్కెటింగ్ కోసం దేశవ్యాప్తంగా 124 వ మరియు 125 వ ట్రైబ్స్ ఇండియా షోరూమ్‌లను ప్రారంభించడం కూడా నాకు ఆనందాన్ని కలిగించింది.” అని అన్నారు.
జనాభాలో సుమారు 8 శాతం మంది ఉన్న గిరిజన జనాభా యొక్క కళలు, సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన విస్తృతంగా మాట్లాడారు. అణగారిన ఈ ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ట్రైఫెడ్ మరియు మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుకా సింగ్ మాట్లాడుతూ, మహమ్మారి కాలంలో చేసిన కృషికి గాను మొత్తం ట్రైఫెడ్ బృందాన్ని అభినందించారు. అదేవిధంగా "ఓకల్ ఫర్ లోకల్" పై మంత్రిత్వ శాఖ దృష్టిని, ఆమె, పునరుద్ఘాటించారు. ట్రైఫెడ్ చైర్మన్ శ్రీ రమేష్ చంద్ మీనా కూడా సిబ్బంది కృషిని అభినందిస్తూ, గిరిజన ప్రజల అభివృద్ధికి అవసరమైన కృషిని కొనసాగించాలని కోరారు.
అత్యంత ప్రతిష్టాత్మక ప్రాంతాలలో ఉన్న ఈ రెండు అవుట్ లెట్ లు, ఆయా నగరాల్లో రెండవ ట్రైబ్స్ ఇండియా షోరూమ్ లుగా ఉన్నాయి. 1999 లో న్యూఢిల్లీ లోని 9, మహదేవ్ రోడ్డు లోని ఒకే ఒక ప్రధాన షోరూంతో ప్రారంభమైన ట్రైబ్స్ ఇండియా ఇప్పుడు మరో రెండు అవుట్ లెట్ లు చేరడంతో, భారతదేశవ్యాప్తంగా 125 రిటైల్ అవుట్ లెట్ల స్థాయికి చేరింది. భారతదేశం లోని మొత్తం 27 రాష్ట్రాల నుండి ఉత్పత్తులు, కళలు, హస్త కళా వస్తువుల నిల్వతో పాటు, కోల్‌కతా మరియు గ్వాలియర్ అవుట్ లెట్‌లు కూడా ఈ మహమ్మారి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే, అవసరమైన ఉత్పత్తులను తమ షో రూంలలో ప్రదర్శిస్తున్నారు.
ట్రైఫెడ్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ ప్రవీర్ కృష్ణ స్వాగతోపన్యాసం చేస్తూ, గిరిజన ఉత్పత్తులను పెద్ద మరియు కొత్త మార్కెట్లలోకి చేరుకోవడానికి, ప్రోత్సహించడానికి మరియు సహాయం చేయడానికి ట్రైఫెడ్ తన ప్రయత్నాలను ఎలా పెంపొందించుకుంటోందో వివరించారు. "గిరిజన ప్రజల సాధికారతే ప్రధాన లక్ష్యంగా, ట్రైఫెడ్ కృషి చేస్తోంది. "బి ఓకల్ ఫర్ లోకల్" అనే ప్రధానమంత్రి సందేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారా, గిరిజన ప్రజల జీవితాలను, జీవనోపాధిని ప్రోత్సహించడానికి, కేంద్ర మంత్రి మరియు మంత్రిత్వ శాఖల సహకారంతో, ట్రైఫెడ్ అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది." 5 లక్షలకు పైగా గిరిజన ఉత్పత్తిదారులను జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించడానికి వీలుగా అక్టోబర్ లో గిరిజన ఉత్పత్తిదారుల కోసం ట్రైఫెడ్ యొక్క ప్రత్యేకమైన ఇ-మార్కెట్ స్థలం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా, ట్రైబ్స్ ఇండియా ఇ-మార్ట్ ప్లాట్‌ఫాం ఓమ్ని-ఛానల్ సదుపాయంగా ఉంటుంది.
మార్కెటింగ్ ద్వారా గిరిజన చేతివృత్తులవారి జీవనోపాధిని ప్రోత్సహించడానికి మరియు గిరిజన ఉత్పత్తులు మరియు ఉత్పత్తులకు సహాయాన్ని అందించే తన కార్యక్రమాలలో భాగంగా, ట్రైఫెడ్, దేశవ్యాప్తంగా తన రిటైల్ కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంది. భారతదేశం అంతటా వారి వర్గాల ఆర్థిక సంక్షేమాన్ని ప్రోత్సహించడం ద్వారా, అణగారిన గిరిజన ప్రజలను శక్తివంతం చేయాలనే లక్ష్యంతో, (మార్కెటింగ్ అభివృద్ధి మరియు వారి నైపుణ్యాల నిరంతర నవీకరణ ద్వారా), ట్రైఫెడ్, గిరిజన సంక్షేమం కోసం జాతీయ నోడల్ ఏజెన్సీగా, ట్రైబ్స్ ఇండియా బ్రాండ్ క్రింద రిటైల్ అవుట్ లెట్ ల నెట్‌వర్క్ ద్వారా గిరిజన కళ మరియు చేతిపనుల వస్తువులను సేకరించడం మరియు మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా గిరిజన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడానికి మరియు పెంచడానికి ఇది కట్టుబడి ఉంది. గిరిజనులకు అధికారం ఇవ్వడం మరియు వారి జీవనోపాధిని పెంచడంలో సహాయపడటం, దీని ప్రధాన లక్ష్యం.
*****
(Release ID: 1682088)
Visitor Counter : 164