యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

జనవరిలో జ‌రిగే టోర్నమెంట్లకు పి.వి.సింధుతో పాటు ఫిజియో, ఫిట్నెస్ ట్రైనర్లూ వెళ్లేందుకు అనుమ‌తిచ్చిన ప్ర‌భుత్వం


Posted On: 18 DEC 2020 7:22PM by PIB Hyderabad

2019 ప్రపంచ ఛాంపియన్, 2016 ఒలింపిక్ రజత పతక విజేత పి.వి. సింధు వ‌చ్చే ఏడాది జనవరిలో మూడు టోర్నమెంట్లలో పాల్గొన‌నున్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్) కోర్ గ్రూపులో భాగమైన పి.వి. సింధు ఈ టోర్న‌మెంట్ల‌తో పోటీల‌లోకి తిరిగి రంగ‌ప్ర‌వేశం చేయ‌నున్నారు. యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ (జనవరి 12-17), టయోటా థాయిలాండ్ ఓపెన్ (జనవరి 19-24), బ్యాంకాక్‌లో జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు (అర్హ‌త సాధించ‌డాన్నిబ‌ట్టి)

జ‌నవరి 27-31) ఫిజియో, ఫిట్‌నెస్ ట్రైనర్ల‌ను త‌న‌తో పాటు తీసుకువెళ్లేందుకు సింధు చేసిన‌ అభ్యర్థనకు ప్ర‌భుత్వం స‌మ్మ‌తి తెలిపింది. మూడు టోర్నమెంట్లకు సింధు ఫిజియో మరియు ట్రైనర్ సేవలకు సుమారు రూ.8.25 లక్షల చొప్పున మంజూరు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కార‌ణంగా క్రీడను నిలిపివేసేందుకు ముందు గ‌త‌ మార్చి 2020లో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు చివరి సారిగా పోటీపడ్డారు.

******


(Release ID: 1681865) Visitor Counter : 170