వ్యవసాయ మంత్రిత్వ శాఖ

మార్కెట్లో అధిక ధరల నివారణ చర్యల్లో భాగంగా దేశంలో ఉల్లిపాయల దిగుమతి నిబంధనల సడలింపు

కొన్నిప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వినియోగానికి ఉపయోగించే ఉల్లిపాయలపై మాత్రమే నిబంధనల సడలింపు

Posted On: 17 DEC 2020 3:17PM by PIB Hyderabad


ప్రస్తుతం మారెట్లో ఉల్లిపాయల ధరలు అధికంగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని  ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్, 2003 ప్రకారం పొగచూరింపు మరియు  ఫైటోసానిటరీ సర్టిఫికేట్ పై అదనపు డిక్లరేషను  తీసుకుని  ఉల్లిపాయల దిగుమతులకు  కొన్ని సడలిపులు చేస్తూ 31 జనవరి, 2021 వరకు వర్తించే విధంగా కేంద్ర  వ్యవసాయం  మరియు రైతు సంక్షేమ విభాగంవారు  అనుమతినిచ్చారు, కాగా  ఈ దిగుమతుల సడలింపులు  కొన్ని ప్రత్యేక నిబంధనలకు మరియు పరిస్థితులకు లోబడి ఉంటాయి.

దిగుమతైన పొగచూరింపు చేయని ఉల్లిపాయలు భారత పోర్టు వద్దే పిఎస్సి వారి అనుమతితో  దిగుతిదారుచే అధికృత విధానాన్ని ఉపయోగించి ఉల్లిపాయలకు పొగచూరింపును చేపడతారు. దిగుమతి చేయబడిన ఉల్లిపాయలు క్వారంటైన్ అధికారులచే విధిగా తనిఖీ చేయబడి ఎటువంటి చీడపీడలు, వ్యాధులు లేవని ధ్రువీకరించవలసి ఉంటుంది. తనిఖీల సమయంలో బూజు లేదా ఎండు కుళ్ళు వంటివి గమనించినట్లైతే వారిని తిరస్కరించి తిరిగి పంపించివేస్తారు. వేరు పొంగు క్రిమి లేదా ఉల్లిపాయ వ్రణక్రిమి వంటివి కనుగొన్నట్లైతే
వాటిని పొగచూరించడం ద్వారా నశింపజేసి  ఎటువంటి అదనపు రుసుము లేకుండానే విడుదల చేస్తారు. ఈ దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలు వినియోగానికి మాత్రమే కానీ ఇతరాల కొరకు కాదని దిమతిదారు నుండి ఒక ప్రమాణ పత్రాన్ని తీసుకుంటారు. ఈ ఉల్లిపాయలపై పిక్యూ ఆర్డర్ 2003 ప్రకారం విధించే నాలుగు రెట్ల అదనపు తనీఖీ రుసుము ఉండదు.

***



(Release ID: 1681594) Visitor Counter : 147