కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

స్పెక్ట్రమ్ ను వేలం వేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 16 DEC 2020 3:31PM by PIB Hyderabad

స్పెక్ట్రమ్ ను వేలం వేయాలంటూ టెలిక‌మ్యూనికేశన్స్ విభాగం తెచ్చిన ప్రతిపాదన కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న బుధ‌వారం జ‌రిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  ఈ వేలం లో సఫలమైన వేలందారు (బిడ్డర్) లకు, స్పెక్ట్ర‌మ్‌ ను వాణిజ్య పరమైన మొబైల్ సేవ‌ల‌ను అందించడానికిగాను, కేటాయించడం జరుగుతుంది.
 
ఈ వేలంపాట 700 మెగాహర్ట్ జ్ (ఎమ్ హెచ్ జడ్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్, 800 ఎమ్ హెచ్ జడ్, 900 ఎమ్ హెచ్ జడ్, 1800 ఎమ్ హెచ్ జడ్, 2100 ఎమ్ హెచ్ జడ్, 2300 ఎమ్ హెచ్ జడ్ లతో పాటు 2500 ఎమ్ హెచ్ జడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్ర మ్ కోసం కూడా నిర్వహించడం జరుగుతుంది.  ఈ స్పెక్ట్రమ్ ను 20 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యేటట్లుగా అప్పగించనున్నారు.  మొత్తం 2251.25 ఎమ్ హెచ్ జడ్ ను మొత్తం విలువ అయినటువంటి 3,92,332.70 కోట్ల రూపాయల  (రిజ‌ర్వు ధర) కు ఇవ్వజూపుతున్నారు.

వేలంపాట మాధ్యమం ద్వారా స్పెక్ట్రమ్ ను ఉపయోగించుకొనే అధికారాలను దక్కించుకొనే టెలికమ్యూనికేశన్ సేవలను అందించే సంస్థ లు వాటి నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతాయి, ఇక ఇటువంటి సేవలను కొత్తగా అందజేయాలనుకొంటున్న సంస్థలు వాటి సేవలను మొదలుపెట్టగలుగుతాయి.

ఈ వేలంపాట లోని పాల్గొనే బిడ్డ‌ర్ లు పరామితులకు/షరతుల‌కు కట్టుబడవలసి ఉంటుంది; ఉదాహ‌ర‌ణ‌ కు, బిడ్డ‌ర్ లు వారి బిడ్ లను దాఖలు చేయగలిగే బ్లాకు ప‌రిమాణం,స్పెక్ట్రమ్ కేప్.. అంటే వేలంపాట పూర్తి అయిన త‌ర్వాత ప్రతి ఒక్క బిడ్డర్ కు ప్రాప్తించే స్పెక్ట్రమ్ తాలూకు అధికతమ రాశి, సేవలను మొదలుపెట్టడానికి సంబంధించిన బాధ్యతలు, చెల్లింపు షరతులు మొదలైన వాటిని అంగీకరించవలసి ఉంటుంది.

సఫలమైన బిడ్డ‌ర్ లు పూర్తి వేలం సొమ్ము ను ఏక‌మొత్తం లో చెల్లించ‌వ‌చ్చును; లేదా నిర్దిష్ట మొత్తాన్ని (దక్కించుకొన్న 700 ఎమ్ హెచ్ జడ్, 800 ఎమ్ హెచ్ జడ్, 900 ఎమ్ హెచ్ జడ్ బ్యాండ్ లకు అయితే 25 శాతం, 1800 ఎమ్ హెచ్ జడ్, 2100 ఎమ్ హెచ్ జడ్, 2300 ఎమ్ హెచ్ జడ్, 2500 ఎమ్ హెచ్ జడ్ బ్యాండ్ లలో దక్కించుకొన్న స్పెక్ట్రమ్ కు అయితే 50 శాతం) ఏక‌మొత్తంగా చెల్లించే ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చును; మిగిలిన మొత్తాన్ని రెండు సంవత్సరాల పాటు అప్పు నిలుపుదల కాలం ముగిసిన అనంతరం గరిష్ఠం గా 16 ఏకసమాన వార్షిక కిస్తీలలో చెల్లింపు చేయవలసి ఉంటుంది.

వేలంపాటలో పాడిన సొమ్ము కు అదనం గా, సఫల బిడ్డ‌ర్ లు ఈ వేలం ద్వారా వారు దక్కించుకొన్న స్పెక్ట్రమ్ కు వినియోగ చార్జీల రూపం లో- వైర్ లైన్ సర్వీసులు మినహాయించి- అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఎజిఆర్) లో 3 శాతం సొమ్ము ను కూడా చెల్లించవలసి ఉంటుంది.

స్పెక్ట్రమ్ వేలం అనేది సఫల బిడ్డ‌ర్ లకు స్పెక్ట్రమ్ ను అప్ప‌గించే ఒక పార‌ద‌ర్శ‌కమైనటువంటి ప్ర‌క్రియ గా ఉంది.  స్పెక్ట్రమ్ త‌గినంతగా అందుబాటు లో ఉండ‌డ‌మనేది వినియోగ‌దారుల‌కు అందించే టెలికమ్ సేవ‌ల లో నాణ్య‌త‌ ను పెంచుతుంది.

వర్తమానంలో, టెలికమ్ రంగం అనేది ఆర్ధిక వృద్ధి తో, ప్ర‌త్య‌క్ష‌ ఉపాధి కల్పనతో, ప‌రోక్ష ఉపాధి క‌ల్ప‌న‌తో, డిజిట‌ల్ ఇండియా విస్త‌ర‌ణ‌ తో బలంగా ముడిపడి ఉన్న కారణంగా ఒక ప్రముఖమైనటువంటి మౌలిక స‌దుపాయాల‌ రంగం గా మారింది అన్నది సందర్భశుద్ధి కలిగిన అంశమే.  కాబట్టి, మంత్రిమండలి తీసుకొన్న పైన ప్రస్తావించినటువంటి నిర్ణ‌యం అన్ని దశల లో ప్రయోజనకారి ప్ర‌భావాన్ని ప్రసరింపచేయగలుగుతుందన్న ఆశ వ్యక్తం అవుతోంది.



 

***




(Release ID: 1681123) Visitor Counter : 215