రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

17వ నౌక రెండవ ప్రాజెక్టు హిమగిరి’ ప్రారంభం

Posted On: 14 DEC 2020 4:43PM by PIB Hyderabad

కోల్కత్తాకు  చెందిన M/S గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జిఆర్ఎస్ఇ) వారు తయారు చేసిన 17ఏ నౌకల్లో మొదటి మూడింటిలోని ప్రాజెక్టు ’హిమగిరి’ని ఈరోజు అనగా 14 డిసెంబరు 2020న ప్రారంభించబడింది.  భారత నౌకాదళాధిపతి జనరల్ 

బిపిన్ రావత్ ముఖ్య అతిథిగా పాల్గొన్న  ఈ కార్యక్రమంలో మధ్యాహ్నాం 13.35 గంటలకు హుగ్లీ నదిలో హిమగిరి ప్రవేశం జరిగింది. నౌకాదళ సాంప్రదాయం ప్రకారం  అధర్వణ వేదం నుండి మంత్రాలను పటిస్తుండగా నౌకాదళాధిపతి భార్య శ్రీమతి మధులిక రావత్ 

హిమగిరిని ప్రారంభించారు. 50 సంవత్సరాల క్రితం అనగా 1970లో ప్రారంభించిన యుద్ధ నౌకల తరగతికి చెందిన యుద్ధ నౌక నుండి ఈ నౌక యొక్క పేరు మరియు పింఛం కాకతాళీయంగా గ్రహించబడింది.

17ఏ ప్రాజెక్టు క్రింద మొత్తంగా 7 నౌకలను తయారుచేయ సంకల్సించగా అందులో నాలుగింటిని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండిఎల్) మరియు మిగతా మూడింటిని జిఆర్ఎస్ఇ వారి వద్ద తయారుచేయబడతాయి. ఇవి మరింత మెరుగైన సౌకర్యాలతోను 

మరియు అభివృద్ధిచెందిన దేశీయ ఆయుధ సంపత్తితో మరియు మరికొన్ని ఇతర సౌకర్యాలతో తయారుచేయబడుతున్నాయి. భారత నౌకా దళం కోసం తయారు చేసిన మూడు అంచెల పి17ఏ యుద్ధ నౌక  హిమగిరి ప్రారంభోత్సవం జిఆర్ఎస్ఇ వారి నిబద్ధతను 

తెలుపుతుంది.కాగా ఇప్పటి వరకు జిఆర్ఎస్ 100కు పైగా నౌకలను నిర్మించి దేశంలోనే ప్రధాన షిప్ యార్డుగా పేరుగాంచింది. పి17ఎ నౌకల తయారీ లక్ష్యాన్ని చేరుటకు తన మౌళిక సదుపాయాలను మరియు నైపుణ్యాలను మరింత  మెరుగుపరుచుకుంది. గ్యాస్ 

టర్బైన్ ప్రొపల్షన్తో మరియు భారీ యుద్దవేదికలు కలిగిన నౌకలను జిఆర్ఎస్ఇలో తయారు చేయడం ఇదే మొదటిసారి. 

17ఏ ప్రాజెక్టు ప్రారంభం భారత ప్రభుత్వపు ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని కొసాగిస్తున్నది. ఈ పి17ఏ నౌకలు దేశీయంగా నౌకా రూప కల్పన సంచాలకులు(సర్ఫేస్ షిప్ డిజైన్ గ్రూప్)-డిఎన్డి(ఎస్ఎస్జి) వారిచే ఆకృతీకరించబడి దేశీయ తయారీదారులైన ఎండిఎల్ 

మరియు జిఆర్ఎస్ఇ వారి వద్ద నిర్మించబడుతున్నాయి.  కొవిడ్-19 వలన కుదేలైన మన ఆర్థిక వ్యవస్థకు నౌకా నిర్మాణం మంచి ఊతమిస్తుంది. ఈ నౌకల నిర్మాణానికి అవసరమైన 80% నిర్మాణ సామాగ్రి దేశీయ అమ్మకందారుల నుండి కొనుగోలు చేయడం మరియు దేశంలోని సుమారు 2000 భారత వ్యాపార సంస్థలకు ఉపాధి కల్పన మరియు ఎంఎస్ఎంఇ సంస్థలకు పని కల్పించబడుతుంది. ఔట్ సోర్సింగ్ పద్దతిన నౌకా నిర్మాణం , సమగ్ర నిర్మాణ పద్దతి వంటివి జిఆర్ఎస్ఇ ఉత్పత్తిని మెరుగుపరచి అగస్టు 2023నాటికి  నౌకలను అప్పగించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపకరిస్తాయి.

 

***



(Release ID: 1680664) Visitor Counter : 251