హోం మంత్రిత్వ శాఖ
2001 లో పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి సమయంలో అమరులైనవారికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుపై పిరికితనంతో దాడికి పాల్పడినవారిని ఎదుర్కొంటూ అత్యున్నత త్యాగం చేసి అమరులైన భరతమాత ముద్దుబిడ్డలైన వీర కిశోరాలకు నా నివాళులు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
దేశం మీ త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. వారి అసమాన ధైర్యసాహసాలు, త్యాగానికి శిరసువంచి నమస్కరిస్తున్నాను : అమిత్ షా
प्रविष्टि तिथि:
13 DEC 2020 2:42PM by PIB Hyderabad
2001లో పార్లమెంటు భవనంపైముష్కరులు పిరికితనంతో దాడి చేసిన ఘటనకు 19 సంవత్సరాలు అయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్విట్టర్ ద్వారా ఒక సందేశ మిస్తూ,
పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి సందర్భంగా అమరులైన భరతమాత ముద్దుబిడ్డలకు నా నివాళి, దేశంకోసం వారు అత్యున్నత త్యాగం చేశారు. ఈ గొప్ప దేశం వారి త్యాగాలను నిరంతరం గుర్తుంచుకుంటుంది. వారి అసమాన ధైర్యసాహసాలు, త్యాగానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. అని అమిత్‌షా తమ సందేశంలో పేర్కొన్నారు.
2001 డిసెంబర్ 13న లష్కరే తోయిబా, జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు పార్లమెంటు భవన సముదాయాన్నిచుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హోరా హోరీ కాల్పుల మధ్య వారిని కాల్చివేశారు.ఈ కాల్పులలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, ఒకమహిళా సి.ఆర్.పి.ఎఫ్ జవాను,ఇద్దరు పార్లమెంటు హౌస్ వాచ్, వార్డ్ సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. ఈ దాడిలోజర్నలిస్టు గాయపడగా ఆ తర్వాత అతను మరణించాడు.
****
(रिलीज़ आईडी: 1680503)
आगंतुक पटल : 158