ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్ష
అన్ని మంత్రిత్వ శాఖల, విభాగాల కార్యదర్శులతో
సమీక్షించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Posted On: 13 DEC 2020 11:56AM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 వైరస్ మహమ్మారిపై జరిపే పోరాటంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 మే 12న ఒక ప్రత్యేక సమగ్ర ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. స్వావలంబనతో కూడిన భారతదేశం లేదాఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నిర్మాణానికి ఆయన పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థచైతన్యవంతమైన జనాభా విజ్ఞానం, గిరాకీ అనే ఐదు అంశాలను ఆత్మనిర్భర భారత్ మూల స్తంభాలుగా ప్రధానమంత్రి పేర్కొన్నారు.

   ప్రధానమంత్రి పిలుపు అనంతరం, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ 2020 మే 13 నుంచి 17 వరకు వరుసగా జరిగిన విలేకరుల సమావేశాలలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ (ఎ.ఎన్.బి.పి.)  తొలిదశ (1.0) వివరాలను ప్రకటించారు. ఆ తర్వాత, ప్యాకేజీ 2వ దశ (2.0)ను అక్టోబర్ 12ప్యాకేజీ  3వ దశను (3.0) ను నవంబర్ 12న కేంద్ర మంత్రి ప్రకటించారు.

 

 ఎ.ఎన్.బి.పి. కింద ప్రకటించిన 3 దశల అమలు ప్రక్రియను ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు వెంటనే ప్రారంభించాయి.  ప్యాకేజీలు అమలు తీరుపై పర్యవేక్షణకు దాదాపు ప్రతిరోజూ అధికారిక సమీక్ష జరుగుతూ వస్తోంది. సమగ్రమైన ఈ సమీక్షను కేంద్ర ఆర్థిక మంత్రి శుక్రవారం ముగించారు. మూడురోజులకు పైగా జరిగిన ఈ సమీక్షలో  వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు   పాలుపంచుకున్నారు.

 ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఇప్పటివరకూ అమలవుతున్న పథకాల ప్రగతిపై కీలకాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.:

1.       సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలతో (ఎం.ఎస్.ఎం.ఇ.లతో) సహా వివిధ వాణిజ్య కార్యకలాపాలకోసం కొల్లాటరల్ పూచీలేని రూ. 3లక్షల కోట్ల రుణాలు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు, 23 అగ్రశ్రేణి ప్రైవేటు బ్యాంకులు, 31 నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్.బి.ఎఫ్.సి.లు) ఇచ్చిన నివేదిక ప్రకారం, అత్యవసర పరపతి గ్యారంటీ పథకం (ఇ.సి.ఎల్.జి.ఎస్.) కింద 2020 డిసెంబరు 4వరకూ రూ. 2,05,563కోట్ల మేర అదనపు రుణం 80,93,491మంది గ్రహీతలకు మంజూరైంది. ఇందులో రూ. 1,58,626కోట్ల మొత్తం 40,49,489 మందికి పంపిణీ అయింది. 

  ఈ పథకాన్ని 2020 నవంబరు 26న మరింత సవరించారు. పథకం గడువును కూడా 2021, మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు. వాణిజ్యం టర్నోవర్ పరిమితినీ తొలగించారు. ఇ.సి.ఎల్.జి.ఎస్.కు అమలుచేయాల్సిన మార్గదర్శక సూత్రాలు 2020 నవంబరు 26న జారీ అయ్యాయి.

 ఈ పథకం సహాయంతో 45లక్షల సంస్థలు తిరిగి క్రియాశీలంగా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించగలవని, ఉద్యోగాలను పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందని అంచనా.

 

2.       బ్యాంకేతర ఆర్థిక సంస్థల (ఎన్.బి.ఎఫ్.సి.ల) కోసం రూ.  45,000 కోట్ల మేర 2వ దశ పాక్షిక రుణ గ్యారంటీ పథకం:

  ఈ పథకం కింద 2020 డిసెంబరు 4వరకూ రూ. 27,794 కోట్ల మొత్తానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆమోదం తెలిపాయి.   రూ. 1,400కోట్ల మొత్తానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదలదశలోనో, లేదా చర్చల దశలోనో ఉన్నాయి. సంబంధిత బాండ్ల, లేదా వాణిజ్య పత్రాల (సి.పి.ల) కొనుగోలుకు గడువును 2020 డిసెంబరు 31వరకూ పొడిగించారు.

 

3.       జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ద్వారా రైతులకు రూ. 30,000 కోట్ల అదనపు అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ నిధి:

  ఈ ప్రత్యేక సదుపాయం ద్వారా 2020 డిసెంబరు 4 నాటికి, రూ. 25,000కోట్ల మొత్తం  పంపిణీ అయింది. మిగిలిన రూ. 5వేల కోట్ల మొత్తాన్ని ప్రత్యేక లిక్విడిటీ సదుపాయం (ఎల్.ఎల్.ఎఫ్.) కింద రిజర్వ్ బ్యాంకు నాబార్డ్.కు కేటాయించింది.  చిన్నతరహా బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, ఇతర బ్యాంకేతర ఆర్థిక సహాయ సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలకోసం ఈ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకు కేటాయిచింది. 

 ఎస్.ఎల్.ఎఫ్. కింద కేటాయించిన మొత్తాన్ని ఆయా బ్యాంకేతర ఆర్థిక సంస్థలకు, సూక్ష్మ రుణ సంస్థలకు పంపిణీ చేసేందుకు నాబార్డ్ 2020 అక్టోబరు 6న మార్గదర్శక  సూత్రాలను జారీ చేసింది.

  మిగిలిన రూ. 5వేల కోట్ల మొత్తంలో రూ. 690కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఆరు బ్యాంకేతర ఆర్థిక సంస్థలకు, సూక్ష్మ రుణ సంస్థలకు మంజూరయ్యాయి. 2020 డిసెంబరు 4వరకూ అందిన సమాచారం మేరకు రూ. 130కోట్ల పంపిణీ పూర్తయింది.

 

4.       కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రెండున్నర కోట్ల మంది రైతులకు రూ. 2లక్షల కోట్ల మేర రాయితీతో కూడిన రుణ ప్రోత్సాహం:

కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పి.ఎం. కిసాన్ పథకం లబ్ధిదారులకు రాయితీతో కూడిన రుణం అందజేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సేవల విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. తొలిదశలో రూ. 46,532కోట్ల రుణ పరిమితితో కూడిన 58.83లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేశారు. 

 రెండవ దశలో రూ. 1,07,417 కోట్ల రుణ పరిమితితో కూడిన 110.94లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు 2020 డిసెంబరు 4నాటికి మంజూరయ్యాయి.

  రెండవ దశలో మంజూరైన 110.94 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులకుగాను 92.40 లక్షలను పంట రుణంకోసం ఇచ్చారు.  2.73లక్షల కార్డులను పశుసంవర్థక, మత్స్య రంగాల పంట రుణాలకు,  4.75 లక్షల కార్డులను పాడిపరిశ్రమ కోసం, 46,786 కార్డులను పౌల్ట్రీ, పశుపోషణ, గొర్రెల పెంపకం తదితర అవసరాలకోసం, 15,037 కార్డులు చేపల పెంపకం కోసం   కేటాయించారు. ఇక  అప్పటికే ఉన్న10.44లక్షల కార్డులను బ్యాంకు మంజూరు చేసింది.

 

5.       నివాస ప్రాంతాల నిర్మాణానికి సంబంధించి స్థిరాస్తి రంగంలో గిరాకీకి ప్రోత్సాహం, డెవలపర్లకు, ఇళ్ల కొనుగోలుదార్లకు ఆదాయం పన్ను సడలింపు. 

 

  స్థిరాస్తి రంగానికి గిరాకీ పెరిగేలా ప్రోత్సాహం అందించేందుకు, అమ్ముడుపోకుండా నిలిచిపోయిన నిర్మాణ సామగ్రిని స్థిరాస్తి రంగం డెవలపర్లు నగుదుగా మార్చుకునే సదుపాయాన్ని సానుకూలం చేసేందుకు, తద్వారా ఇళ్ల కొనుగోలుదార్లకు ప్రయోజనం కల్పించేందుకు 43సి.ఎ. సెక్షన్ కింద అందించే పన్ను రాయితీని 10శాతంనుంచి 20శాతానికి పెంచాలని నిర్ణయించారు. అయితే, రూ. 2కోట్ల వరకూ విలువైన నివాస యూనిట్ల ప్రథమ విక్రయానికి మాత్రమే ఈ సడలింపును వర్తింపచేస్తారు. అదికూడా 2020 నవంబరు 12నుంచి 2021 జూన్ 30వరకూ మాత్రమే ఈ సడలింపు వర్తింపజేస్తారు.  

 ఈ ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సి.బి.డి.టి.) 2020 నవంబరు 13న ఒక పత్రికా ప్రకట జారీ చేసింది.

 

6.       ఆదాయం పన్ను రీఫండ్స్

2020 ఎప్రిల్ 1నుంచి, 2020 డిసెంబరు 8వరకూ 89.29లక్షలమందికిపైగా పన్ను చెల్లింపుదార్లకు రూ.1,45,619కోట్ల మేర పన్నును కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సి.బి.డి.టి.) రీఫండ్ చేసింది. 87,29,626 కేసులకు సంబంధించి 43,274కోట్లమేర  ఆదాయం పన్నును,  1,99,554 కేసులకు సంబంధించి రూ. 1,02,345కోట్లమేర కార్పొరేట్ పన్నును రీఫండ్ చేశారు.

 

7.       మూలధన వ్యయం: రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం:

 ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద రూ. మూలధన వ్యయం కింద వడ్డీలేని 50ఏళ్ల కాలపరిమితితో కూడిన రుణాలను రాష్ట్రాలకు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

2020, డిసెంబరు 7నాటికి ఈ పథకం కింద ప్రస్తుతం అమలులో ఉన్న తమ పనులు, ప్రాజెక్టులకు రుణాలకోసం 27రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతిపాదనలను సమర్పించాయి.

పథకంలో మొదటి, రెండవ దశల కింద రూ. 8455.61కోట్ల మొత్తానికి సంబంధించిన ప్రాజెక్టులను ఇప్పటివరకూ ఆమోదించారు. తొలివిడత మొత్తంగా రూ. 4,227.80కోట్లను ఆయా రాష్ట్రాలకు విడుదల చేశారు.

 

8.       పట్టణ ప్రాంతపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.ఎ.వై.-యు) కింద  రూ. 18,000కోట్ల అదనపు పెట్టుబడి:

  గృహనిర్మాణం, స్థిరాస్తి రంగం పునరుద్ధరణ లక్ష్యంగా గత కొన్ని నెలలుగా అనేక చర్యలను తీసుకుంటూ వస్తున్నారు. ఈ రంగం తిరిగి కోలుకోవడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. ఉదాహరణకు..మధ్యాదాయ వర్గాల గృహనిర్మాణానికి ప్రత్యేక గవాక్ష పథకం (ఎస్.డబ్ల్యు.ఎం.ఐ.హెచ్.) కింద, రూ. 13,200కోట్ల పెట్టుబడితో కూడిన 135 ప్రాజెక్టులను ఆమోదించారు. దాదాపు 87,000 ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణం పూర్తిచేయడానికి ఇది దోహదపడుతుంది. పి.ఎం.ఎ.వై.-యు పథకం కోసం 2020-21సంవత్సరపు బడ్జెట్ అంచనాలపై  రూ. 18,000కోట్లను అందజేస్తారు. అదనపు కేటాయింపు, అదనపు బడ్జెటరీ వనరుల కింద ఈ మొత్తాన్ని ఇస్తారు.  ఈ సంవత్సరం కేటాయించిన రూ. 8,000కోట్ల మొత్తానికి ఇది అదనం..

 

9.       మౌలిక సదుపాయాలకు రుణ సాయం కింద రూ. 1.10 లక్షల కోట్లు- జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (ఎన్.ఐ.ఐ.ఎఫ్.)కి రూ. 6,000కోట్ల మేర ఈక్విటీ తరలింపు.

 జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి (ఎన్.ఐ.ఐ.ఎఫ్.)కి రూ. 6,000కోట్ల మేర ఈక్విటీ మొత్తం సరఫరా ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2020 నవంబరు 25న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసీమ్ ఇన్.ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎన్.ఐ.ఐ.ఎఫ్. ఇన్.ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలతో కలసి ఎన్.ఐ.ఐ.ఎఫ్. వేదిక ఏర్పాటైంది.

10.     ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే ఎం.ఎస్.ఎం.ఇ.లకోసం రూ. 20,000 కోట్ల సబార్డినేట్ రుణం

 ఈ పథకాన్ని 2020 జూన్ 24న ఖరారు చేసి, ప్రారంభించారు. ఇందుకు సంబంధించి భారతీయ స్టేట్ బ్యాంకు 8,502 ఖాతాలను గుర్తించింది. రుణ పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

11.     నిధుల నిధి (ఫండ్ ఆఫ్ ఫండ్స్) ద్వారా ఎం.ఎస్.ఎం.ఇ.లకు రూ. Rs 50,000కోట్ల ఈక్వీటి నిధుల సరఫరా

 

స్వావలంబనతో కూడిన భారతదేశం (ఎస్.ఆర్.ఐ.) పేరిట నిధికి సంబంధించి ప్రతిపాదనలను కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థల(ఎం.ఎస్.ఎం.ఇ.ల) మంత్రిత్వ శాఖ 2020, ఆగస్టు 5న ఆమోదించింది. ఇందుకు మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేసింది. జాతీయ చిన్న పరిశ్రల కార్పొరేషన్ (ఎన్.ఎస్.ఐ.సి.)కు అనుబంధించిన ఎన్.ఎ.ఐ.సి. వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థను ఈ పథకం కోసం రూపొందించారు. 2013వ సంవత్సరపు కంపెనీల చట్టం ప్రకారం పొందుపరిచిన ఈ సంస్థ,.. మాతృనిధికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్.పి.వి.)గా వ్యవహరిస్తుంది. 

ఈ ప్రక్రియ్ అనంతరం ఎ.బి.ఐ. క్యాపిటల్ వెంచర్ లిమిటెడ్ సంస్థను ఫండ్ నిర్వహణా సంస్థగా, అసెట్ నిర్వహణా కమిటీగా ఎంపిక చేశారు.

ఇప్పటికే ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండమ్ తయారీలో ఎస్.బి.ఐ. క్యాపిటల్ సంస్థ నిమగ్నమైపోయింది. ఈ నిధిని క్రియాశీలకం చేసేందుకు వీలుగా ఎం.ఎస్.ఎం.ఇ. మత్రిత్వ శాఖ తదుపరి చర్యలు తీసుకుంది..

12.     ఎం.ఎస్.ఎం.ఇ.లకు చెల్లింపులకోసం ప్రభుత్వ కృషి కొనసాగింపు

 2020 మే నెలనుంచి గత 7 నెలలుగా రూ. 21,000కోట్లకు పైగా ఎం.ఎస్.ఎం.ఇ.ల బకాయిలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాయి. 2020 మే నుంచి ఎం.ఎస్.ఎం.ఇ.ల మంత్రిత్వ శాఖ క్రమతప్పకుండా తీసుకున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది. అత్యధిక స్థాయి సేకరణకు సంబంధించిన రూ. 5,100కోట్ల రూపాయలమేర ప్రక్రియ అక్టోబరులో జరిగింది. ఇందులో రూ. 4,100కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. 2020  నవంబరు తొలి పది రోజుల్లో అందిన సమాచారం మేరకు ఈ రికార్డును అధిగమించవచ్చని భావిస్తున్నారు. రూ. 4,700కోట్ల సేకరణకు సంబంధించి ఇప్పటికే రూ. 4,000కోట్ల మేర చెల్లింపులు జరిగాయి.

 

13.     రైతులకోసం ఫార్మ్-గేట్ మౌలిక సదుపాయాల కింద లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి.

 వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం 2020 జూలై 8న ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 9న లాంఛనంగా ప్రారంభించారు.

 కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిన 30రోజుల్లోనే మొదటగా 2,280 రైతు సంఘాలకు  రూ. 1,128కోట్ల మేర మొత్తం మంజూరైంది. ఈ పథకం అమలుకోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 9 ప్రైవేటు రంగ బ్యాంకులు, 33 సహకార బ్యాంకులతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారు. కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ ఈ మేరకు ఒప్పందాలను కుదుర్చుకుంది.

 పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎ.హెచ్.ఐ.డి.ఎఫ్.)-రూ. 15,000కోట్లు

 పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఎ.హెచ్.ఐ.డి.ఎఫ్.) పథకాన్ని కేంద్ర మంత్రివర్గం 2020 జూన్ 24న ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ పోర్టల్ రూపకల్పన కోసం భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్.ఐ.డి.బి.ఐ.-సిడ్బి)తో 2020 జూలై 27న ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 

2020 డిసెంబరు 9 నాటికి ఈ పథకానికి మొత్తం 313 దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం ఆ దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నాయి.

 

15.     ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై.) కింద మత్స్య కారులకు రూ.  20,000 కోట్లు

 ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన (పి.ఎం.ఎం.ఎస్.వై.) పథకం,.. రూ. 20,250కోట్ల పెట్టుబడితో 2020 మేలో ప్రభుత్వ ఆమోదం పొందింది. వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పి.ఎం.ఎం.ఎస్.వై. నిర్వహణా మార్గదర్శక సూత్రాలు 2020 జూన్ 24న జారీ అయ్యాయి. ఐదేళ్ల చేపల ఉత్పత్తి లక్ష్యాలతో, తొలి రెండేళ్ల ఆర్థిక సహాయ కేటాయింపులతో ఈ మార్గదర్శక సూత్రాలను వెలవరించారు.

ఈ పథకానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి భారీ స్థాయి స్పందన లభించింది. 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి రూ. 6,445కోట్ల మేర మత్స్య పథకాలు అందాయి..

2020 డిసెంబరు 9 నాటికి రూ. 2,182కోట్ల మేర పథకాలకు మత్స్య శాఖ ఆమోదం తెలిపింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన రూ 322కోట్ల మేర పథకాల ప్రతిపాదనలు, 2వ దశలో 7రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మరిన్ని ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి.  

 

16.     గృహ నిర్మాణ రంగానికి, మధ్య ఆదాయ వర్గాలకు రుణంతో కూడిన సబ్సిడీ పథకం(సి.ఎల్.ఎస్.ఎస్.) పొడిగింపు ద్వారా రూ. 70,000 కోట్లమేర ప్తోత్సాహం

 

వార్షికాదాయం 6నుంచి 18లక్షల రూపాయల లోపు ఉన్న మధ్య ఆదాయ వర్గాలకు అందించే

రుణంతో కూడిన సబ్సిడీ పథకం (సి.ఎల్.ఎస్.ఎస్.) గడువును 2021 మార్చి నెలాఖరు వరకూ ప్రభుత్వం పొడిగించింది. గడువు పొడిగిస్తూ 2020 మే 5న ఉత్తర్వు జారీ అయింది.

ఈ పథకం కింద 2020 డిసెంబరు 8నాటికి కొత్తగా 1,04,35 మధ్య ఆదాయ వర్గాలకు 2020-21లో సబ్సిడీని విడుదల చేశారు. దీనితో సబ్సిడీ విడుదలైన సగటు లబ్ధిదారుల సంఖ్య 4.29లక్షలకు చేరింది.

17.     ఉపాధికి ప్రోత్సాహం...ఆత్మనిర్భర యోజన 

ఈ పథకం ప్రతిపాదనలను కేంద్రమంత్వర్గం 2020 డిసెంబరు 9న ఆమోదించింది. పథకానికి సంబంధించి అమలు చేయాల్సిన విధివిధానాలు, మార్గదర్శక సూత్రాలు ప్రస్తుతం రూపకల్పన దశలో ఉన్నాయి.  

18.     ఉపాధికి ప్రోత్సాహం.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథ పథకం (ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.). కేటాయింపు రూ. 40,000కోట్ల పెరుగుదల

 2020 డిసెంబరు 10నాటికి, 2020-21 సంవత్సరానికి తొలి అనుబంధ పద్దుల కిం రూ. 40,000 కోట్లు అందాయి. ఉపాధి హామీపథకం కింద ఆ రోజుకు మొత్తం 273.84 పనిదినాలను కల్పించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఇది 49శాతం ఎక్కువ.

19.     పంపిణీ కంపెనీలకు (డిస్కమ్.లకు) రూ 90,000 కోట్లకు పైగా లిక్విడిటీ సరఫరా 

లిక్విడిటీ సరఫరా ప్యాకేజీ కింద 2020 డిసెంబరు 10 నాటికి రూ. 1,18,273కోట్ల విలువైన రుణాలను మంజూరు చేశారు. అందులో రూ. 31,136కోట్లు పంపిణీ చేయడమో, విడుదల చేయడమో జరిగింది.  వివిధ రాష్ట్రాలకు మరో 30,000వేల కోట్ల రూపాయల విడుదల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

 

20.     బొగ్గు రంగంలో వాణిజ్యపరంగా గనుల తవ్వకానికి ప్రోత్సాహం

 

దిగుమతికి ప్రత్యామ్నాయం: ఈ విషయంలో తగిన నిర్ణయాలు, చర్యలు తీసుకునేందుకు  నెలవారీ సమీక్షల నిర్వహణకు వివిధ మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యంతో ఒక కమిటీని (ఐ.ఎం.సి.ని) ఏర్పాటు చేశారు.  దిగుమతిపై పర్యవేక్షణకు ఒక పోర్టల్.ను ప్రస్తుతం రూపొందిస్తున్నారు. 2020 డిసెంబరు 10 నాటికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో (31-10-2020 వరకు) థర్మల్ విద్యుత్.కు పనికివచ్చే బొగ్గు దిగుమతులు 33శాతం తగ్గాయి. అంటే మొత్తంగా చూసినపుడు 27శాతం తగ్గాయి. 

21.     బొగ్గు రంగంలో సరళీకృత వ్యవస్థ

 2023-24వ సంవత్సరానికల్లా వందకోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని, ప్రైవేటు బొగ్గు క్షేత్రాలద్వారా బొగ్గు ఉత్పత్తిని చేపట్టాలని కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్.) నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ/సి.ఐ.ఎల్. భారీ ప్రణాళికను రూపొందిస్తున్నాయి.

2020 డిసెంబరు 10 నాటికి, రూ. 7 13,775 కోట్ల వ్యయంతో కొత్త రైలు మార్గాల నిర్మాణం జరుగుతూ  ఉంది. తొలిదశ అనుసంధానంలో భాగంగా  రూ. 12,505కోట్ల వ్యయంతో సంవత్సరానికి 404 మెట్రిక్ టన్నుల బొగ్గును యాంత్రికంగా రవాణా చేసేందుకు 35 ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ఈ 35 ప్రాజెక్టులకూ టెండర్లను కూడా జారీ చేశారు. 2023-24వ సంవత్సరానికి అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి.  

 

కోల్ బెడ్ మీథేన్ (సి.బి.ఎం.)ను వెలికితీసే హక్కుల వేలం: ఇందుకు సంబంధించి కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్.) అధికార పరిధిలో 3 ప్రాజెక్టులకు ప్రణాళిక రూపొందించారు. నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ (బి.ఒ.ఒ.) పద్ధతిలో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. రెండు ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 2020 డిసెంబరు 28నాటికి బిడ్లు సమర్పిస్తారు. వీటిలో ఒక ప్రాజెక్టు (సోహాపూర్)పై సాధ్యాసాధ్యాల నివేదికను ఆగ్నేయ కోల్ ఫీల్డ్స్(ఎస్.ఇ.సి.ఎల్.) బోర్డు ఇప్పటికే ఆమోదించింది.  

 

గనుల తవ్వకం ప్రణాళికపై సవరించిన మార్గదర్శక సూత్తాల ప్రక్రియ 2020 మే 29నాటికి పూర్తయింది. గనుల తవ్వకం ప్రణాళికను ఆమోదించే ప్రక్రియను సరళతరం చేశారు. ఆన్.లైన్ ద్వారా అనుమతి మంజూరీకి సంబంధించిన పోర్టల్ ను కూడా రూపొందిస్తున్నారు.

 2020 డిసెంబరు 10నాటికి అందిన సమాచారం ప్రకారం కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ డిసెంబరు 2వరకూ  వాణిజ్యపరంగా రూ. 6,663.78కోట్ల రాయితీలను అందించింది.

 

****(Release ID: 1680501) Visitor Counter : 132