గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

శ్రీ అర్జున్ ముండా పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి గిరిజన సాధికారతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

Posted On: 11 DEC 2020 5:15PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా నిన్న కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశమై గిరిజన సాధికారతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ట్రైఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీర్ కృష్ణ కూడా పాల్గొన్నారు.  గిరిజనుల జీవితాలను, జీవనోపాధిని మెరుగుపర్చడానికి మరియు గిరిజన సాధికారత కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ట్రైఫెడ్‌ నిరంతరం కృషి చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు సారూప్యత ఉన్న సంస్థలతో కలిసిన నిరంతరం చర్చలు, సమావేశాలు నిర్వహిస్తుంది.

ఈ సమావేశంలో ఉమ్మడి బలాలు మరియు నైపుణ్యాలను గరిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ గిరిజనుల జీవనోపాధిని పెంపొందించడానికి, వారిని అభివృద్ధి వైపు నడిపించడానికి అవసరమైన సహకారానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించారు. ఈ చర్చలో ప్రధానంగా వన్‌ధన్‌ కేంద్రాలవంటి వాటి ద్వారా గిరిజన ఉత్పత్తులు అంటే స్థానికంగా లభించే రతన్‌జోట్, (వెరికోస్ వెయిన్స్, బెడ్‌సొర్స్‌, పుండ్లు, పూతల మరియు డయెరియా వంటి అనారోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే సహజ మూలం) టమోటా , సెరికల్చర్ వంటి వాటిని ప్రోత్సహించడం అలాగే పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ పరిధిలోని పిఎస్‌యుల్లో కార్పొరేషన్ ఓన్డ్‌ కార్పొరేషన్‌ ఆపరేటడ్‌(కోకో) విధానంలో ట్రైబ్స్‌ ఇండియా విక్రయకేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలపై చర్చించారు.

ఈ సమావేశంలో  శ్రీ అర్జున్ ముండా అందమైన హస్తకళలతో పాటు ట్రైబ్స్‌ ఇండియా మాస్క్‌లను ధర్మేంద్ర ప్రధాన్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతిని అందుకోవడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని  "బి వోకల్ ఫర్‌ లోకల్‌ క్యాంపెన్‌"లో భాగంగా ప్రతి ఒక్క భారతీయుడికి ఈ మాస్క్‌లు చేరాలని ధర్మేంద్ర ప్రధాన్‌ ఆకాంక్షించారు.

గిరిజన సంక్షేమం మరియు అభివృద్ధిని తదుపరి దశకు తీసుకువెళ్లడం భాగంగా గిరిజనులకు స్థిరమైన జీవనోపాధి మరియు ఆదాయ అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే ట్రైఫెడ్‌ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్డీ), చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఈ), ఫుడ్‌ ప్రొసెసింగ్ మంత్రిత్వశాఖ,డిఎంఎఫ్‌, ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఐకార్‌ వంటి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలతో సమావేశాలకు ఏర్పాట్లు చేస్తోంది. గిరిజన జీవనోపాధి కార్యక్రమంతో పాటు నైపుణ్యాల అభివృద్ధి మరియు మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌ను విస్తరించాలని ట్రిఫెడ్ యోచిస్తోంది. ఇది జాతీయ స్థాయి కార్యక్రమాలైన “ఆత్మనిర్భార్ అబియాన్”, “గో వోకల్ ఫర్ లోకల్ ” మరియు ఇతర మంత్రిత్వశాఖల ప్రణాళికల ఆధారంగా రూపకల్పన చేయబడింది.  ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేయడం ద్వారా దేశవ్యాప్తంగా గిరిజనుల ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి వారియొక్క జీవనోపాధిని మెరుగుపర్చడానికి ఉపయోగపడాలని ట్రైఫెడ్‌ ఆకాంక్షిస్తోంది.

***(Release ID: 1680113) Visitor Counter : 143