వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మరింత బలమైన, స్థితిస్థాపక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్, స్వీడన్ కలిసి పని చేయాలి- పీయూష్ గోయల్
సిఇఒ ఫోరం, స్వీడన్ - భారత్ వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామ్యం మన స్నేహాన్ని విస్తరింపచేసేందుకు తోడ్పడుతుంది
ఆత్మనిర్భర్ భారత్ కింద భారత్, స్వీడన్‌లు పరస్పరం పరిపూరకంగా ఉంటాయి
Posted On:
11 DEC 2020 4:31PM by PIB Hyderabad
భారత్, స్వీడన్లు మరింత బలమైన, స్థితిస్థాపక భాగస్వామ్యాన్ని నిర్మించాలని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయెల్ శుక్రవారం పేర్కొన్నారు. భారత్- స్వీడన్ వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామ్యం ఫోరం సిఇఒల సమావేశంలో మాట్లాడుతూ, 2020 సవాళ్ళతో కూడిన సంవత్సరమని, ఈ సంక్షోభాన్ని మనం అవకాశంగా మార్చుకోవాలని ఆయన పిలుపిచ్చారు.
వికసింపచేయడంలో, ఉన్నత స్థాయి సంపదను సాధించడంలో, 21వ శతాబ్దపు ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు చేసుకునేందుకు తగిన భారత్‌ను రూపొందించడంలో స్వీడన్ భాగస్వామి కావాలనుకుంటున్నామని, గోయల్ అన్నారు. భారత్- స్వీడన్ వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామ్యం, సిఇఒ ఫోరం ఈ స్నేహాన్ని అన్ని స్థాయిల్లో విస్తరించేందుకు సాయపడతారని, పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో స్వీడన్‌ను ఒక కీలక పాత్రను ఇస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
సుమారు 1.35 బిలియన్ల జనాభాతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మా వద్ద భారీ, పెరుగుతున్న, మెరుగైన, గుణాత్మక జీవితాన్ని ఆశించే మధ్య తరగతి వర్గం ఉంది. స్వీడిష్ కంపెనీలు భారత్‌లో పని చేసేందుకు ఇష్టపడతాయని, మెరుగైన అవకాశాలను అన్వేషిస్తాయని భావిస్తున్నానన్నారు. సాంకేతికపై మా నూతన దృష్టి భారత్ ప్రాధాన్యతలు పునఃసమలేఖనం చేసుకునేందుకు తోడ్పడతాయని, ఇందులో మా సహజ భాగస్వామి అయిన స్వీడన్ ఆవిష్కరణ, పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించే ఆశిస్తున్నానని తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతూ, దాని కింద హైటెక్ ఉత్పత్తుల దిగుమతిని ప్రోత్సహిస్తున్నామని, సాంకేతికతలను, నైపుణ్యాలను, ఆరోగ్య రక్షణలో మెరుగైన సౌకర్యాలను, భారత్‌లో విద్యను తీసుకురావడంలో ప్రజలను ప్రోత్సహిస్తున్నామని గోయల్ చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ ఉత్పత్తి రంగం భారత ప్రజల ఆదాయ స్థాయిలు పెరిగేందుకు, ఆర్థిక వ్యవస్థ వికసింపచేసేందుకు, సడలింపులు, పెట్టుబడి ఆటంకాలను తొలగించడంలో, ఆర్థిక వ్యవస్థ పెరుగుదలలో తోడ్పడతాయని గోయల్ చెప్పారు. న్యాయమైన వాణిజ్యం, తమ తమ దేశాలలో భారత వాణిజ్యాలతో పరస్పర అందుబాటు కలిగిన ఏ ఇతర ప్రజాస్వామిక, ఏక భావన దేశంలాగా స్వీడన్ కూడా ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగం, భాగస్వామని ఆయన తెలిపారు. మిగిలిన ప్రపంచంతో ఒడంబడికలు చేసుకోవడాన్ని విస్తరింపచేయాలన్న మా కోరిక, ఆశయంలో భారతదేశంలోని స్వీడిష్ కంపెనీలకు పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద స్వీడన్, భారత్ ఒకదానికొకటి పరిపూరకంగా ఉంటాయన్నారు. స్వీడన్ ప్రపంచ ఆవిష్కర్త అని, వివిధ రంగాలలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ముందుంటుందన్నారు. ఈ భాగస్వామ్యంతో భారత్‌కు అత్యంత లబ్ధి కలుగుతుందన్నారు.
స్వీడన్, యూరోపియన్ యూనియన్ పన్నేతర ఆటంకాలను లేక ప్రమాణాలను తొలగించి, తన ద్వారాలను మరి కొంచెం తెరుస్తాయని తాము ఆశిస్తున్నామన్నారు. తద్వారా స్వీడన్, ఐరోపాతో వాణిజ్యం పరస్పరంగా ఉంటుందని, ఇరువైపు వాణిజ్యాలను విస్తరిస్తాయని ఆశిస్తున్నామని గోయల్ చెప్పారు.
భారత్‌లో ఎఫ్‌డిఐలను పెంచేందుకు మరింత సరళమైన విధానాలను ప్రవేశపెట్టి, ఉత్పత్తి రంగాన్ని ఆకర్షించడంపై ప్రధాన మంత్రి దృష్టి పెట్టారన్నారు. భారత్‌లో స్వీడిష్ కంపెనీలు విస్తరించేందుకు అద్భుతమైన అవకాశం ఉందని, అదే సమయంలో భారతీయ కంపెనీలు స్వీడన్ అభివృద్ధికి, ఎదుగుదలకి, స్వీడన్ ప్రజల మెరుగైన భవిష్యత్తుకు దోహదం చేసేలా ప్రోత్సహిస్తాం. అలాగే, భారత్ తన ఆర్థిక వ్యవస్థను విస్తరింప చేసుకోవడంలో, స్వీడిష్ కంపెనీలు తమ వ్యాపారంలో విస్తరింప చేసుకోవడంలో తోడ్పడే విధంగా ప్రత్యేక నైపుణ్యాలతో కాలేజీల నుంచి బయిటకు వచ్చే మిలియన్ల కొద్దీ ఆడపిల్లలు, మగ పిల్లలకు పని అవకాశాలు, ఉద్యోగాల కల్పనలో స్వీడన్ తోడ్పడుతుందని తాను ఆశిస్తున్నానని, మంత్రి చెప్పారు.
***
(Release ID: 1680109)
Visitor Counter : 152