రైల్వే మంత్రిత్వ శాఖ
2020 డిసెంబర్ 15 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు.
కంప్యూటర్ ఆధారిత తొలివిడత పరీక్ష (సిబిటి) ఐసొలేటెడ్, మినిస్టీరియల్ కేటగిరీలకు (సిఇఎన్ 03,2019)
2020 డిసెంబర్15 నుంచి 2020 డిసెంబర్ 18 వరకు జరగనుంది.
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సిబిటి రెండో దశకు సంబంధించి (ఎన్‌టిపిసి -సిఇఎన్ 01/2019) 2020 డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి వరకు జరగనుంది.
లెవల్ -1 పోస్టులకు సిబిటి మూడవ విడత (సిఇఎన్ ఆర్ ఆర్ సి01/2019) ఏప్రిల్ 2020నుంచి 2021 జూన్ చివరి వరకు నిర్వహించనున్నారు.
కోవిడ్ ప్రొటోకాల్ కు అనుగుణంగా ఆర్ ఆర్ బిలు జారీ చేసే సూచనలను పాటించాల్సిందిగా విద్యార్ధులకు సూచించారు.
Posted On:
11 DEC 2020 5:25PM by PIB Hyderabad
భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా తనకు గల 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల(ఆర్ ఆర్‌బి) ల ద్వారా డిసెంబర్ 15 2020 నుంచి 1.4 లక్షల ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా రిక్రూట్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో సుమారు ర ఎండు కోట్ల మంది అభ్యర్ధులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
తొలిదశ పరీక్షలు 2020 డిసెంబర్ 15 నుంచి 18 డిసెంబర్ 2020 వరకు జరుగుతాయి. ఇవి సిఇఎన్ 03/2019 ( ఐసొలేటెడ్, మినిస్టీరియల్ విభాగాలు). ఆ తర్వాత సిఇఎన్ 01/2019(ఎన్‌టిపిసి కేటగిరీలకు) డిసెంబర్ 28 నుంచి మార్చి 2021 వరకు ప్రాధమికంగా నిర్వహించనున్నారు. మూడవ దశ రిక్రూట్‌మెంట్ సిఇఎన్ నెం ఆర్ ఆర్‌సి 01/2019 (లెవల్ -1)ను తాత్కాలికంగా ఏప్రిల్ 2020 నుంచి 2021 జూన్ చివరి వరకు నిర్వహించనున్నారు.
సిఇఎన్ -03/2019 (ఐసొలేటెడ్, మినిస్టీరియల్ కేటగిరీలకు)2020 డిసెంబర్ 15 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్ధులకు వారికి పరీక్షలు నిర్వహించే నగరం, పరీక్ష తేదీ, వంటి విషయాలను ఈమెయిల్, ఎస్.ఎం.ఎస్ ద్వారా తెలియజేస్తారు.పరీక్ష షిఫ్టుకు సంబంధించిన సమాచారాన్ని ఆర్ ఆర్‌బి అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తెలియజేయనున్నారు.ఈ కాల్ లెటర్ ను పరీక్షకు నాలుగు రోజుల ముందు అన్ని ఆర్ ఆర్‌బి ల అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచుతారు. తదుపరి దశ రిక్రూట్‌మెంట్‌ను తగిన సమయంలో విడుదల చేస్తారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్లను పాటించేందుకు ఆర్ ఆర్‌బి విస్తృత ఏర్పాట్లు చేశాయి. భౌతిక దూరం పాటించడం, విధిగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం, రోజుకు రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు వంటివి ఇందులో ఉన్నాయి.
వీలైనంతవరకు అభ్యర్థులను వారి స్వరాష్ట్రంలోనే పరీక్ష రాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనివల్ల అభ్యర్ధులు త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి వీలు కలుగుతుంది.మహిళలు, దివ్యాంగులకు పరీక్షా కేంద్రాలు వారి స్వరాష్ట్రంలోనే ఉండేట్టు చూస్తారు. అయితే అభ్యర్దులను ఆయా ప్రాంతాల వారీగా కేటాయించడంలో కొందరిని వివిధ రాష్ట్రాలకు కేటాయించక తప్పని పరిస్థితులు ఏర్పడవచ్చు. అబ్యర్ధుల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు రైల్వే శాఖ అవసరమైన చోట, సాధ్యమైన మేరకు ప్రత్యేక పరీక్షా స్పెషల్ రైళ్లను నడుపుతోంది.సంబంధిత రాష్ట్రప్రభుత్వాల ఛీఫ్ సెక్రటరీలు, స్థానిక పాలనా యంత్రాంగాలు సిబిటిని సురక్షితంగా భద్రంగా భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించేందుకు ఆర్.ఆర్.బి సిబ్బందికి మద్దతు నివ్వాల్సిందిగా కోరడం జరిగింది.
పరీక్షా కేంద్రాల వద్ద థర్మోగన్‌లతో అభ్యర్ధుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. నిర్దేశిత శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కు వ ఉ న్న వారిని పరీక్షా కేంద్రాలలోకి అనుమతించరు. ఇలాంటి అభ్యర్ధులకు పరీక్షలు తిరిగి నిర్వహించే అంశాన్ని వారి ఈమెయిల్, మొబైల్ నెంబర్ కు తెలియజేస్తారు. అభ్యర్ధులు ముఖానికి మాస్కు ధరించడం, నిర్దేశిత నమూనాలో కోవిడ్ -19 కు సంబంధించి స్వీయ ధృవీకరణను ప్రవేశ ద్వారం వద్ద అందజేయాలి. ఇవి లేని వారిని పరీక్ష హాలులోకి అనుమతించరు.కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం జనం పెద్ద సంఖ్యలో మెయిన్ గేట్ వద్ద గుమికూడ కుండా చూస్తారు.ప్రతి పరీక్ష అనంతరం , తదుపరి షిఫ్ట్ మొదలయ్యే ముందు పరీక్షా కేంద్రాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తారు.
అభ్యర్ధుల ఆరోగ్యపరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అలాగే పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రోటోకాల్స్, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించనున్నారు.కోవిడ్ -19 కు సంబంధించి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తాజాగా జారీ చేసే ఆదేశాలను పరీక్షల సందర్భంగా పాటించనున్నారు.
***
(Release ID: 1680108)
Visitor Counter : 322