వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతు సంఘాలతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి - నరేంద్ర సింగ్ తోమర్
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, రైతు సంఘాల ఆందోళనలను తగ్గించేందుకు ప్రతిపాదనలు
ఎంఎస్‌పి, ఎపిఎంసిలు ఉనికిలో ఉంటాయి - పీయూష్ గోయల్
Posted On:
10 DEC 2020 7:00PM by PIB Hyderabad
వ్యవసాయ చట్టాల గురించి రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు వారికందించిన ప్రతిపాదనలలోని వివిధ సూచనలను రేఖామాత్రంగా వివరిస్తూ, పరస్పర సమ్మతమైన పరిష్కారం కోసం చర్చలు కొనసాగించాలని కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, రైల్వేలు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సంయుక్తంగా రైతు సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. వారు న్యూఢిల్లీలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రైతు ఉత్పత్తి, లావాదేవీలు, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయాలు) చట్టం 2020, రైతాంగ (సాధికారత, పరిరక్షణ) ధర హామీ ఒప్పందం, రైతు సేవల చట్టం 2020, నిత్యావసర వస్తువుల సవరణ చట్టం 2020 అన్నవి దేశంలో అతి పెద్ద వ్యవసాయ సంస్కరణలుగా ఉన్నాయి. ఈ సంస్కరణలు రైతులకు మార్కెట్ల స్వేచ్ఛ, వాణిజ్యానికి ప్రోత్సాహం, సాంకేతికతను అందుబాటులోకి తేనున్నాయి, అవి వ్యవసాయాన్ని పరివర్తనకు లోను చేస్తాయి.
కనీస మద్దతు ధర, సేకరణ విషయంలో హామీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతమున్న ఎపిఎంసి మండీల లోపల, బయిట కూడా లావాదేవీలలో సమాన అవకాశాలను కల్పించేందుకు ప్రభ/త‌్వం సిద్ధంగా ఉంది. రైతులు వివాదాలు వచ్చినప్పుడు సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చని ప్రభ/త‌్వం చెప్పింది. ఎండుగడ్డిని తగులబెట్టడం పై జరిమానా విషయంలో , ప్రతిపాదిత విద్యుత సవరణ బిల్లులో ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నూతన వ్యవసాయ చట్టాల కింద రైతుల భూములను పరిరక్షిస్తామని హామీ ఇచ్చింది.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల జీవితాలను మెరుగుపరచడానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల గురించి కేంద్ర మంత్రులు తోమర్, గోయల్ ఇద్దరు వివరించారు.తాజా చట్టాలు భాగస్వాములతో పలు విడతలుగా చర్చించిన అనంతరం చేపట్టిన సంస్కరణలని చెప్పారు. నూతన చట్టాల కింద సమస్యను విజయవంతంగా పరిష్కరించగానే మహారాష్ట్రకు చెందిన ఒక రైతుకు వ్యాపారవేత్త నుంచి తక్షణ చెల్లింపు వచ్చిన ఉదాహరణను వ్యవసాయ మంత్రి ఇచ్చారు. కేంద్రం ఒక చట్టాన్ని చేస్తే అది దేశానికంతా వర్తిస్తుందన్నారు. వ్యవసాయ వాణిజ్యంపై చట్టాలు చసే సమయంలో కేంద్ర ప్రభుత‌్వం తన రాజ్యాంగ హక్కులకు లోబడే ఉందన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపు 2014- 2020 మధ్యలో చెప్పుకోదగినంతగా పెరిగాయని, ఇది రైతుల పట్ల, గ్రామీణ రంగం పట్ల ప్రభుత్వానికి గల నిబద్ధతను పట్టి చూపుతుందన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ చొరవ కింద రూ. 75,000 కోట్లను కేటాయించారని, అందులో భాగంగా రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతు కింద ఏడాది రూ.6000 వస్తుందన్నారు. రూ. 1 లక్ష కోట్ల తో వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేశారన్నారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించేందుకు, భూసారాన్ని పెంచేందుకు వేప పూతతో యూరియా పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వామినాథన్ కమిషన్ సూచనల ఆధారంగా, ఉత్పత్తి ధరకన్నా కనీసం 1.5 రెట్లు ఎక్కువ ధర రైతుకు అందాలన్న ఫార్ములా ఆధారంగా మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ప్రకటించింది. అంతేకాకుండా, అధిక సేకరణను, రైతులకు అధిక చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన కింద రైతులకు ఫించను మద్దతును కల్పిస్తున్నారు. రైతు ఉత్పాదక సంస్థలు (ఎఫ్‌పిఒ)లు రైతులను సమైక్యం చేసి, తమ భవిష్యత్తులో వారి వాణి వినిపించే అవకాశం కల్పిస్తాయి. అటువంటి 10,000 ఎఫ్‌పిఒలను సృష్టిస్తున్నారు.
ఈ చొరవలన్నీ కూడా రైతుల సంక్షేమాన్ని, ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని, ఇవి వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం రూపొందించే పథకాలలో కేంద్ర స్థానాన్ని ఆక్రమిస్తాయి.
***
(Release ID: 1679875)
Visitor Counter : 257