నీతి ఆయోగ్

ఆన్‌లైన్ ద్వారా వివాద ప‌రిష్కారం‌ (ఓడీఆర్‌) ఉపయోగించడం ద్వారా మ‌రింత మెరుగ్గా న్యాయ స‌హాయం అందించేలా ప్ర‌త్యేక‌ డ్రైవ్‌ను ప్రారంభించిన నీతి ఆయోగ్, పాట్నా హైకోర్టు

Posted On: 08 DEC 2020 6:42PM by PIB Hyderabad

క‌రోనా మ‌హమ్మారి అనంత‌రం అందరికీ సమర్థవంతంగా మరియు సరసమైన విధానంలో న్యాయ ప్రాప్యతకు గాను నీతి ఆయోగ్ సంస్థ పాట్నా హైకోర్టు వారి సహకారంతో.. ఆన్‌లైన్ వివాద ప‌రిష్కార(ఓడీఆర్‌) డ్రైవ్‌ను ప్రారంభించింది.
సాంకేతిక‌త అధారంగా చట్టం మరియు ఆవిష్కరణల పరస్పర చర్యల‌ ద్వారా
అంద‌రికీ న్యాయం అందించేలా ఏర్పాటు చేసిన ఈ డ్రైవ్‌ ప్రారంభ ‌వేదిక‌ను
నీతి ఆయోగ్, పాట్నా హైకోర్టు వారి స‌హ‌కారంతో ఏర్పాటు చేసింది. కార్య‌క్రమం ఓడీఆర్‌పై ప్ర‌ధానంగా దృష్టి కేంద్రీక‌రిస్తూ ఏర్పాటు చేశారు‌. ఈ కార్య‌క్ర‌మంలో
గౌరవనీయ న్యాయమూర్తి శ్రీ నవీన్ సిన్హా, గౌరవనీయ  భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు గౌరవనీయులైన‌  న్యాయమూర్తి శ్రీ హేమంత్ శ్రీవాస్తవ, పాట్నా హైకోర్టు బీహార్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ గౌరవ న్యాయమూర్తి శ్రీ అశ్వని కుమార్ సింగ్, నీతి ఆయోగ్ చైర్మ‌న్ శ్రీ అమితాబ్ కాంత్‌తో పాటుగా ఆయోగ్‌లోని న్యాయ సేవ‌ల విభాగం నిపుణులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ ఆన్‌లైన్ సమావేశంలో మొత్తం 1000 మందికి పైగా బీహార్ న్యాయవ్యవస్థకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వారు అందరికీ సమానమైన మరియు సమర్థవంతమైన న్యాయం అందించేందుకు గాను ముందుకు వెళ్ళే మార్గాల‌పై ప్ర‌సంగించారు. ముఖ్యంగా చిన్న, మధ్యస్థ విలువ కేసుల‌ను డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ ర‌కాల చ‌ర్చ‌లు, మ‌ధ్య‌వ‌ర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం(ఏడీఆర్‌) యొక్క సాంకేతికతలను ఉపయోగించి కేసుల‌ ప‌రిష్కరం చూడ‌ట‌మే ఓడీఆర్ వివాద ప‌రిష్కార విధానం. న్యాయ వ్యవస్థ ప్రయత్నాలతో న్యాయస్థానాలు డిజిటలైజ్ అవుతున్నప్పటికీ, నియంత్రణ మరియు తీర్మానం యొక్క మరింత ప్రభావవంతమైన, స్కేలబుల్ మరియు సహకార యంత్రాంగాలు అత్యవసరంగా అవసరం. ఓడీఆర్ వివాదాల్ని సమర్థంగా మరియు సరసంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో నీతి ఆయోగ్ సీఈఓ
అమితాబ్ కాంత్ ప్రారంభోప‌న్యాసం చేస్తూ "కోవిడ్ వైర‌స్ మ‌హ‌మ్మారి అనంత‌రం స‌మ‌యంలో న్యాయం కోసం సమర్థవంతంగా మరియు సరసమైన ప్రాప్యతను అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనే దిశ‌గా.. ఇది ఒక చారిత్రాత్మక సమావేశం. ఈ దిశ‌గా రెండు సంస్థ‌ల స‌హ‌కార చ‌ర్య" అని అన్నారు. "ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడంలో న్యాయ స్థానాలు ఎంత ప్రగతిశీలమైనవిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది ఎంతో అత్యంత ప్రోత్సాహకరమైన పరిణామాలలో ఒకటి మరియు వాస్తవానికి వినూత్నమైనవి" అని ఆయన పేర్కొన్నారు. "వాస్త‌వంగా ఇన్నోవేటివ్ కోర్టులు కూడా వినూత్నమైన న్యాయస్థానాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తున్నాయి" అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కరోల్ మాట్లాడుతూ “పాట్నా హైకోర్టు అధికారులు అందరూ ఈ ఏడాది మార్చి నుండి న్యాయాన్ని అందిచేలా
పార‌ద‌ర్శ‌క‌త దిశ‌గా ప్రతిన‌బూని కృషి చేస్తున్నారు. మ‌నం పెండింగ్‌లో చాలా పాత కేసులు ఉండ‌టంపై వ్య‌వ‌హ‌రిస్తున్నాము. దీనికి తోడు మ‌రిన్ని  కొత్త కేసులు తలెత్తుతున్నాయి. ఈ సవాళ్ల‌ను ఎదుర్కోనేందుకు మనస్తత్వాలలో భారీ పరివర్తన అవసరం. ఈ స‌మ‌స్య‌ల‌కు  ఒక పరిష్కారాన్ని కనుగొనే ప్రణాళికను రూపొందించడానికి, న్యాయ స‌హాయాన్ని సమర్థవంతంగా మరియు వేగవంతం
అందించేందుకు గాను నీతి ఆయోగ్‌తో కలిసి పని చేస్తాము.” అని అన్నారు.
భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గౌరవనీయ న్యాయమూర్తి నవీన్ సిన్హా తన ప్రత్యేక ప్రసంగంలో మాట్లాడుతూ “న్యాయ వ్యవస్థ నేడు ఆవిష్కరణ మరియు సాంకేతికత రెండింటినీ అనుసంధానిస్తోంది. న్యాయ‌ వ్య‌వ‌స్థ‌తో టెక్నాలజీ అనుసంధాన‌త‌లో పాట్నా హైకోర్టు ముందుంది. భారతదేశంలో ఆన్‌లైన్ వివాద పరిష్కారానికి పాట్నా హైకోర్టు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు. “ఈ కొత్త సాధారణత‌ కోసం భాగ‌స్వామ్య ప‌క్షాల వారంద‌రికీ త‌గిన‌ శిక్షణ ఇచ్చి, సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడం చాలా అవసరం.” అని తెలిపారు. “సహకార మార్గంగా ముందుకు సాగడం ద్వారానే  అందరికీ న్యాయం జరిగేలా చూడడంలో మ‌నం విజయవంతం అవుతాము.” అని తెలిపారు. కార్య‌క్ర‌మంలో నీతి ఆయోగ్ ఓఎస్‌డీ, యాక్సెస్ టు జ‌స్టిస్ అధినేత శ్రీ దేశ్ గౌర‌వ్ సిక్రీ మ‌న దేశంలో ఓడీఆర్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సంబంధించి ఒక ప్ర‌జెంటేష‌న్‌ను అందించారు. గౌరవ న్యాయమూర్తి (రిటైర్డ్) ఎ.కె. సిక్రీ అధ్యక్షతన జ‌రిగిన ఈ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. జ‌ల్టీ టీమ్‌లీడ్ శ్రీమతి దీపికా కిన్హాల్ మాట్లాడుతూ భారతదేశంలోని పౌరులకు ఓడీఆర్‌ భావన మ‌రియు దాని వ‌ల్ల‌ క‌లిగే ప్రయోజనాలను గురించి వివరించారు.సెంటర్ ఫర్ ఆన్‌లైన్ రిజల్యూషన్ ఆఫ్ డిస్పూట్స్ ఆర్బిట‌ర్ మ‌రియు సహ వ్యవస్థాపకుడు శ్రీ వికాస్ మహేంద్ర మాట్లాడుతూ ఈ సేవల ప్రకారం భారతదేశంలో విస్తృత శ్రేణి ఓడీఆర్ సర్వీసు ప్రొవైడర్లు ప్రారంభించిన సాంకేతిక సేవలను గురించి వివ‌రించారు. సామా సంస్థ సహ వ్యవస్థాపకుడు ఈ-లోక్ అదాలత్‌లను నిర్వహించడానికి గాను వివిధ రాష్ట్రాలతో సహకర అనుభవాన్ని శ్రీమతి అక్షితా అశోక్ పంచుకున్నారు.ఈ-లోక్ అదాలత్‌లను నిర్వహించడం ద్వారా 65,000ల‌కుపైగా కేసులు ఫైల్ చేయ‌బ‌డినాయ‌ని మరియు 39898 పైగా కేసులు పరిష్కరించబడ్డాయ‌ని ఆమె వివ‌రించారు. ఈ ప్రారంభోత్సవం స‌మావేశం ఓడీఆర్ అందించే అవకాశానికి అద్భుతమైన గుర్తింపును ఇచ్చింది. నీతి ఆయోగ్ సీఈఓ మాట్లాడుతూ గౌర‌వ న్యాయ‌మూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి జస్టిస్ నవీన్ సిన్హాకు ప్రత్యేక ప్రసంగం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు మరియు చివరగా గౌరవ ప్రధాని న్యాయ‌మూర్తి శ్రీ సంజయ్ కరోల్ తన ప్రగతిశీల మరియు దూరదృష్టి దృక్పథాన్ని కూడా ఆయ‌న తన ప్ర‌సంగంలో ప్రశంసించారు. ఈ సిరీస్‌లో తదుపరి సమావేశం త్వరలో జరుగ‌నుంది.

                                 

*****



(Release ID: 1679236) Visitor Counter : 167