విద్యుత్తు మంత్రిత్వ శాఖ
భారత-నేపాల్ అనుసంధాన కాలువకు చెందిన హెడ్ రెగ్యులేటర్ పనులకు శంకుస్థాపన చేసిన - ఎన్.హెచ్.పి.సి. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
Posted On:
08 DEC 2020 7:11PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్, చంపావత్ జిల్లా, బన్ బాసా లో ఉన్న ఎన్.హెచ్.పి.సి. కి చెందిన, 94.2 మెగావాట్ల తానక్ పూర్ విద్యుత్ కేంద్రం బ్యారేజీ వద్ద, భారత-నేపాల్ అనుసంధాన కాలువకు చెందిన హెడ్ రెగ్యులేటర్ పనులకు, భారతదేశపు ప్రధాన జల విద్యుత్ సంస్థ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ, ఎన్.హెచ్.పి.సి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ ఎ.కె. సింగ్, 2020 డిసెంబర్, 8వ తేదీన శంకుస్థాపన చేశారు. భారత, నేపాల్ దేశాలమధ్య సంతకం చేసిన ‘మహాకాళి ఒప్పందం’ కింద 1.2 కిలోమీటర్ల పొడవైన భారత-నేపాల్ కాలువను నిర్మిస్తున్నారు.
ఉత్తరాఖండ్, చంపావత్ జిల్లా, బన్ బాసా లో ఉన్న ఎన్.హెచ్.పి.సి. కి చెందిన, 94.2 మెగావాట్ల తానక్ పూర్ విద్యుత్ కేంద్రం బ్యారేజీ వద్ద, భారత-నేపాల్ అనుసంధాన కాలువకు చెందిన హెడ్ రెగ్యులేటర్ పనులకు, ఎన్.హెచ్.పి.సి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ ఎ.కె. సింగ్ (ఎడమ), 2020 డిసెంబర్, 8వ తేదీన శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.
ఈ సందర్భంగా, ఎన్.హెచ్.పి.సి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, “ భారతదేశంలో, జల విద్యుత్తు అభివృద్ధికి, ప్రముఖ సంస్థ అయిన ఎన్.హెచ్.పి.సి. కి హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక దశ నుండి ప్రారంభించే దశ వరకు అన్ని కార్యకలాపాలను చేపట్టే సామర్ధ్యం ఉంది. అదేవిధంగా, సౌర శక్తి, పవన శక్తి రంగాలలో కూడా వైవిధ్యభరితమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది.” అని, పేర్కొన్నారు. ఎన్.హెచ్.పి.సి. ప్రారంభమైనప్పటి నుండీ, 2019-20 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేసినందుకు, విద్యుత్ కేంద్రంలోని అధికారులు, ఉద్యోగులందరినీ, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అభినందించారు. భవిష్యత్తు కోసం కూడా తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో - చండీగఢ్ లోని ప్రాంతీయ కార్యాలయం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ రాజేష్ శర్మ, తానక్ పుర్ విద్యుత్తు కేంద్రం, జనరల్ మేనేజర్ (ఇంచార్జ్), శ్రీ సురేష్ కుమార్ శర్మ తో పాటు, ఇతర సీనియర్ అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఎన్.హెచ్.పి.సి. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ ఏ.కే. సింగ్, ప్రస్తుతం ఎన్.హెచ్.పి.సి. యొక్క 94.2 మెగావాట్ల తానక్ పూర్ విద్యుత్తు కేంద్రం తనిఖీ పర్యటనలో ఉన్నారు.
*****
(Release ID: 1679232)
Visitor Counter : 177