హోం మంత్రిత్వ శాఖ

'2020 ఐరాస పెట్టుబడి ప్రోత్సాహక పురస్కార' విజేతగా నిలిచిన 'ఇన్వెస్ట్ ఇండియా'ను అభినందించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా

"సులభతర వ్యాపారంతో, భారతదేశాన్ని పెట్టుబడుల ప్రాధాన్యత గమ్యస్థానంగా మార్చడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన అవిశ్రాంత కృషి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి ఈ ఘనత ప్రతిరూపం"

Posted On: 08 DEC 2020 5:40PM by PIB Hyderabad

యూఎన్‌సీటీఏడీ '2020 ఐరాస పెట్టుబడి ప్రోత్సాహక పురస్కారాన్ని' గెలుచుకున్న 'ఇన్వెస్ట్ ఇండియా'ను కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా అభినందించారు. ఈ మేరకు ఒక ట్వీట్‌ చేశారు.

    "యూఎన్‌సీటీఏడీ '2020 ఐరాస పెట్టుబడి ప్రోత్సాహక పురస్కారాన్ని' గెలుగుచున్న 'ఇన్వెస్ట్ ఇండియా'కు శుభాకాంక్షలు. సులభతర వ్యాపారంతో, భారతదేశాన్ని పెట్టుబడుల ప్రాధాన్యత గమ్యస్థానంగా మార్చడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన అవిశ్రాంత కృషి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి ఈ ఘనత ప్రతిరూపం వంటింది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పెట్టుబడి ప్రోత్సాహక ఏజెన్సీలకు (ఐపీఏ), ఐరాస పెట్టుబడి ప్రోత్సాహక పురస్కారం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. జెనీవాలోని యూఎన్‌సీటీఏడీ ప్రధాన కార్యాలయంలో పురస్కార కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఐపీఏలు సాధించిన ఘనతలు, పాటించిన ఉత్తమ విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. వివిధ దేశాల్లోని 180 ఐపీఏల పనితీరును యూఎన్‌సీటీఏడీ ద్వారా మదించి, విజేతను ప్రకటిస్తారు.

    'బిజినెస్‌ ఇమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌', 'ఎక్స్‌క్లూజివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌' వెబినార్లు, సామాజిక మాధ్యమాల ద్వారా చొరవ వంటి ఇన్వెస్ట్‌ ఇండియా చేపట్టిన ఉత్తమ విధానాలను యూఎన్‌సీటీఏడీ ప్రధానంగా పేర్కొంది. కొవిడ్‌ పరిస్థితికి విరుగుడుగా సృష్టించిన స్పందన బృందాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించింది.

***


(Release ID: 1679229) Visitor Counter : 204