సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

కేంద్ర బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌బీసీఎఫ్‌డీసీ &ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ

Posted On: 07 DEC 2020 4:19PM by PIB Hyderabad

ఓబీసీ/ఎస్సీ స్వయం సహాయక సంఘాలు, వ్యక్తుల ఆర్థిక సాధికారతకు ఊతమిచ్చేలా కేంద్రం నుంచి మరో ముందడుగు పడింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'జాతీయ వెనుకబడిన వర్గాల ఆర్థిక & అభివృద్ధి కార్పొరేషన్‌' (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), 'జాతీయ షెడ్యూల్‌ కులాల ఆర్థిక &అభివృద్ధి కార్పొరేషన్‌' (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) కలిసి కేంద్ర బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వడ్డీ మాఫీ పథకమైన 'వికాస్‌ యోజన' అమలు కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

    రూ.4 లక్షల వరకు ఉన్న రుణాలపై ఓబీసీ/ఎస్సీ స్వయం సహాయక సంఘాలకు, రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలపై ఓబీసీ/ఎస్సీ వ్యక్తులకు ఈ పథకం కింద 5 శాతం వడ్డీ రాయితీ నేరుగా ఆయా ఖాతాల్లో జమవుతుంది.
    
    కేంద్ర బ్యాంక్‌ తరపున ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ వి.కె.మహేంద్రు, ఎన్‌బీసీఎఫ్‌డీసీ తరపున జనరల్‌ మేనేజర్ (ప్రాజెక్ట్స్‌) శ్రీమతి అనుపమ సూద్‌, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ తరపున చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ దేవానంద్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని భావిస్తున్నారు.



(Release ID: 1678962) Visitor Counter : 146