పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ స‌మాజానికి ఇన్నొవేట్ ఫ‌ర్ ఇండియా మంత్రం ఇచ్చిన ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన‌; భార‌త్‌కు పోటీ ప్ర‌యోజ‌నాన్ని సృష్టిచ‌వ‌ల‌సిందిగా కోరారు

Posted On: 05 DEC 2020 12:38PM by PIB Hyderabad

 భార‌త్‌ను ఆత్మ నిర్భ‌ర్ భార‌త్‌ను చేసేందుకు పోటీ ప్ర‌యోజ‌నాన్నిసృష్టించి, భార‌త్ కోసం ఆవిష్క‌రించవ‌ల‌సిందిగా (ఇన్నొవేట్ ఫ‌ర్ ఇండియా - ఐ4ఐ) శాస్త్రీయ స‌మాజాన్ని పెట్రోలియం, స‌హ‌జ‌వాయువు, స్టీల్ శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కోరారు.సైన్స్‌& టెక్నాల‌జీ, ఎర్త్ సైన్సెస్‌, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ‌శాఖ‌లు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న 6వ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్స్ ఫెస్టివ‌ల్ 2020 ప్రారంభానికి ముందు మాట్లాడుతూ, ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ సేవ‌ల‌ను, వ‌స్తువుల‌ను సృష్టించ‌వ‌ల‌సిందిగా ఆయ‌న శాస్త్రీయ స‌మాజానికి పిలుపిచ్చారు. ఈ కార్య‌క్ర‌మ ఇతివృత్తం - స్వ‌యం స‌మృద్ధ భార‌తం - ప్ర‌పంచ సంక్షేమం.
ఏ స‌మాజ అభివృద్ధిలో శాస్త్రీయ‌, ఆవిష్క‌ర‌ణ‌ల పాత్ర‌ను నొక్కి చెపుతూ, మ‌న వ్య‌వ‌స్థ‌ల‌న బ‌లోపేతంతో పాటుగా వైజ్ఞానిక జ్ఞానంలో పారిశ్రామిక సామ‌ర్థ్యం, అన్ని రంగాల‌లో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను మ‌నం ఎలా అభివృద్ధి చేసుకోవాలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి మ‌రొక‌సారి రుజువు చేసింద‌ని మంత్రి ప్ర‌ధాన్ చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆత్మ నిర్భ‌ర్ దార్శ‌నిక‌త‌ను రూపురేఖ‌ల‌ను వివ‌రిస్తూ, ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ అనే భార‌త‌దేశం అవ‌స‌ర‌మైన అవ‌స‌రాల‌ను నెర‌వేర్చ‌డ‌మే కాక అంత‌ర్జాతీయ స‌మాజానికి క‌ర‌దీపిక కూడాన‌ని, వాస్త‌వ స్ఫూర్తితో కూడిన వ‌సుధైక కుటుబ‌మ‌ని ఆయ‌న చెప్పారు.
ఆర్థికాభివృద్ధికి, సామాజిక ల‌బ్ధికి శాస్త్ర సాంకేతిక‌త‌ల‌ను త‌గిన‌ట్టుగా ఉప‌యోగించ‌కుండా స్వావ‌లంబ‌న సాధించాల‌న్న భార‌త్ కృషి స‌ఫ‌లం కాద‌ని మంత్రి ప్ర‌ధాన్ చెప్పారు. ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రిశోధ‌న‌, అభివృద్ధి వాతావ‌ర‌ణం ద్వారా మ‌నం అత్యాధునిక ఉత్ప‌త్తుల‌ను, సేవ‌ల‌ను అబివృద్ధి చేయ‌డ‌మే కాక‌, ఉనికిలో ఉన్న వ్య‌వ‌స్థ‌ల‌ను, ప్ర‌క్రియ‌ల‌ను మ‌రింత స‌మ‌ర్ధ‌వంతం చేయగ‌లం. భార‌త దేశ‌పు గొప్ప పురాత‌న వార‌స‌త్వాన్ని, ఆధునిక శాస్త్రీయ భావ‌న‌ల‌తో, గ‌ణితంతో న‌వ్య శాస్త్రీయ ప‌రిశోధ‌న ప‌ద్ధ‌తుల ద్వారా స‌మ‌గ్రం చేసి, ఈ ప‌ద్ధ‌తుల వెనుక ఉన్న అనేక ర‌హ‌స్యాల‌ను ఆవిష్కృతం చేసి, వాటిని శాస్త్రీయంగా స్థిర‌ప‌ర‌చాల‌న్నారు.
అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌, వ్య‌వ‌సాయం, ఫార్మా వంటి వివిధ రంగాల‌లో భార‌త్ వేగాన్ని పెంచిన శాస్త్రీయ స‌మాజం కృషిని కొనియాడుతూ, వాస్త‌వ పారిశ్రామిక‌, సామాజిక స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించే దిశ‌గా ప‌ని చేయ‌వ‌ల‌సిందిగా ప్ర‌ధాన విజ్ఞ‌ప్తి చేశారు. 

***



(Release ID: 1678631) Visitor Counter : 126