యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

మన పారా అథ్లెట్లు మన బలం - శ్రీ కిరెన్ రిజిజు


పారా స్నేహపూర్వక క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు - దేవేంద్ర ఝఝారియా

Posted On: 03 DEC 2020 8:00PM by PIB Hyderabad

29 వ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా, గురువారం దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో - భారత పారాలింపిక్ కమిటీ (పి.సి.ఐ) అధ్యక్షుడు దీపా మాలిక్ప్రముఖ భారతీయ పారా అథ్లెట్లు దేవేంద్ర ఝఝాారియా, పరుల్ పర్మార్, శతాబ్ది అవస్థీపి.సి.ఐ. సెక్రటరీ జనరల్ శ్రీ గురు శరణ్ సింగ్ తో పాటు  పి.సి.ఐ. ప్రధాన పోషకులు  శ్రీ అవినాష్ రాయ్ ఖన్నా కూడా పాల్గొన్నారు.

పారా అథ్లెట్లు దేశంలోని ప్రతి ఒక్కరికీ బలం మరియు స్ఫూర్తిదాయకమైన వనరుల వంటి వారని శ్రీ రిజిజు పేర్కొన్నారు. వారికి మద్దతు ఇవ్వడానికి క్రీడా మంత్రిత్వ శాఖ అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలియజేశారు.  మన పారా అథ్లెట్లు మరియుదివ్యంగ్ యోధులు మన బలం. వారు మనకు స్ఫూర్తినిస్తారు. మన క్రీడా మంత్రిత్వ శాఖలో, సమర్థులైన క్రీడాకారులకు, భిన్నమైన సామర్థ్యం గల క్రీడాకారులకు మధ్య తేడా లేదు. మనం ఇరువురినీ ఒకే రకమైన గుర్తింపు, నగదు పురస్కారాలు, మొదలైనవాటితో సత్కరిస్తున్నాము.అని కేంద్ర క్రీడల శాఖ మంత్రి చెప్పారు.

తమ తమ ప్రాంతాల్లోని పారాలింపియన్లకు సాధ్యమైనంత ఉన్నతంగా సహకరించాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థిస్తామని కూడా శ్రీ రిజిజు తెలిపారు. "పారాలింపియన్లకు కేంద్రప్రభుత్వం అందిస్తున్న విధంగా ఆర్థిక సహాయం నుండి శిక్షణ వరకు అదేవిధంగా శిక్షణా సౌకర్యాల నుండి సరైన జీవనోపాధి వరకుసాధ్యమైనంత ఉత్తమంగా మద్దతు ఇవ్వడానికి వీలుగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, "దివ్యాంగ" యోధుల కోసం ఒక విధానాన్ని కలిగి ఉండాలని నేను కోరుతున్నాను.  ప్రభుత్వం, పి.సి.ఐ. తో పాటు ప్రతి ఒక్కరూ సమిష్టిగా మన పారా అథ్లెట్లకు మద్దతు ఇచ్చే పనిని కొనసాగించాలి.అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగాపద్మశ్రీ, ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీత దేవేంద్ర ఝఝారియా మాట్లాడుతూ, పారా అథ్లెట్లకు సత్వర సహాయం అందించడంలో ప్రభుత్వం చేసిన కృషికి, కృతజ్ఞతలు తెలిపారు.  "మా సమస్యలను లేదా మాకు అవసరమైన విషయాలను తెలియజేస్తూ, మేము ప్రభుత్వానికి మెయిల్ పంపినప్పుడల్లా, మాకు గంటలోపు సమాధానం వస్తుంది. నేను భారతదేశం అంతటా చాలా శిక్షణా కేంద్రాలను చూస్తున్నాను, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఇప్పటికే ఉన్నందున తరువాతి తరం పారా అథ్లెట్లకు ఎటువంటి సమస్య ఉండదు.  ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను.  మమ్మల్ని వికలాంగులు అని పిలవవద్దని, కానీ దివ్యంగులుఅని అందరినీ కోరిన ప్రభుత్వానికి, ముఖ్యంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికీ మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఇది మనందరికీ ఎంతో ప్రేరణ కలిగించే విషయం.అని ఝఝారియా అన్నారు.

*****



(Release ID: 1678171) Visitor Counter : 126