హోం మంత్రిత్వ శాఖ

ఈ ఏడాదికి దేశంలో మేటి 10 పోలీస్ స్టేషన్ల‌ ప్రకట‌న‌


Posted On: 03 DEC 2020 10:30AM by PIB Hyderabad

పోలీస్ స్టేషన్ల సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహించడానికి మరియు వాటిలో ఆరోగ్యకరమైన పోటీని తీసుకురావడానికి గాను.. భారత ప్రభుత్వం ప్రతీ ఏటా  దేశ వ్యాప్తంగా ఉత్తమంగా పనిచేస్తున్న‌ పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తూ వ‌స్తోంది.

ఈ ఏడాదికి గాను (2020) దేశంలోని మేటి 10 పోలీస్ స్టేషన్లు: -

 

ర్యాంక్

రాష్ట్రం

జిల్లా

పోలీసు స్టేషన్

1

మణిపూర్

తౌబల్

నాన్‌పోక్‌సేక్‌మాయ్‌

2

తమిళనాడు

సేలం నగరం

ఏడ‌బ్ల్యుపీఎస్‌- సురమంగళం

3

అరుణాచల్ ప్రదేశ్

చాంగ్ లాంగ్

ఖర్సాంగ్

4

ఛత్తీస్‌గఢ్‌

సూరజ్‌పూర్

జిల్మిలి (భాయా థానా)

5

గోవా

దక్షిణ గోవా

సాంగ్యుమ్‌

6

అండమాన్ & నికోబార్ దీవులు

ఉత్తర & మధ్య అండమాన్

కలిఘాట్

7

సిక్కిం

తూర్పు జిల్లా

పాక్యాంగ్

8

ఉత్తర ప్రదేశ్

మొరాదాబాద్

కాంత్

9

దాద్రా & నగర్ హవేలి

దాద్రా & నగర్ హవేలి

క‌న్‌వెల్

10

తెలంగాణ‌

క‌రీంన‌గ‌ర్‌

జమ్మికుంట ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌

 

 

2015లో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో జరిగిన డైర‌క్ట‌ర్‌ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్‌ల‌ స‌మావేశం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేసిన ఆదేశాల మేరకు ప్ర‌తి ఏడాది దేశ వ్యాప్తంగా ఉత్త‌మ పోలీస్ స్టేషన్ల ఎంపిక జ‌రుగుతోంది. పోలీస్ స్టేషన్లను గ్రేడింగ్ చేయడానికి మరియు ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వారి పని తీరును అంచనా వేయడానికి పారామితులను నిర్దేశించాలని ఆ స‌మావేశంలో ప్రధాని ఆదేశించారు. అనేక సవాళ్ల‌తో కూడిన‌ పరిస్థితులలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఉత్తమ పోలీసు స్టేషన్ల కోసం ఈ సంవత్సరం స‌మ‌గ్ర సర్వేను నిర్వహించింది. కరోనా మహమ్మారి విస్త‌రించి ఉన్న సమయంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న పోలీసు స్టేషన్ల సర్వే చాలా కష్టంగా మారింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఈ స‌ర్వేను నిర్వ‌హిచ‌డం జ‌రిగింది. దేశంలో ఉన్న‌ వేలాది పోలీస్ స్టేష‌న్లు, చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి ఈ 10 మేటి పోలీస్ స్టేష‌న్ల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. వనరుల లభ్యత ముఖ్యం అయితే, నేరాలను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి మరియు దేశానికి సేవ చేయడానికి మా పోలీసు సిబ్బంది యొక్క అంకితభావం మరియు నిజాయితీ ముఖ్యమనే విష‌యాన్ని ఇది సూచిస్తుంద‌ని అన్నారు. డేటా విశ్లేషణ, ప్రత్యక్ష పరిశీలన మరియు ప్రజల అభిప్రాయాల ద్వారా దేశంలోని 16,671 పోలీస్ స్టేషన్లలో మేటి 10 పోలీస్ స్టేషన్లను ఎంపిక చేయ‌డ‌మ‌నేది దీని లక్ష్యం.

 

ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసే పోలీసు స్టేషన్ల షార్ట్‌లిస్ట్‌తో ర్యాంకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది:

-స్థిరాస్తి సంబంధిత‌ నేరాలు

-మహిళలపై జ‌రిగే నేరాలు

-బలహీన వర్గాలపై నేరాలు

-తప్పిపోయిన వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తి మరియు గుర్తు తెలియని మృతదేహాలు త‌దిత‌ర‌ విష‌యాల్లో తీసుకుంటున్న‌ చ‌ర్య‌లు..

 

పై అంశాల విష‌యంలో  ఆయా పోలీస్ స్టేష‌న్ల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ ఎంపిక జ‌రిగింది. ఇందులో చివ‌రి పారామితిని ఈ ఏడాది నుంచే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు.

ప్రతి రాష్ట్రం నుండి ప్రారంభంలో ఎంపిక చేయబడిన పోలీసు స్టేషన్ల సంఖ్య ఇలా ఉంది:

-750 కి పైగా పోలీస్ స్టేషన్లు క‌లిగిన‌ ప్రతి రాష్ట్రం నుండి మూడు, ఢిల్లీతో స‌హా ఇత‌ర రాష్ట్రాల‌లో రెండేసి ఎంపిక చేశారు.

- ఒక్కొక్క కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒక్కో పోలీస్ స్టేష‌న్ ఎంపిక చేశారు.

- ర్యాంకింగ్ ప్రక్రియ యొక్క తదుపరి దశకు 75 పోలీసు స్టేషన్లను ఎంపిక చేశారు.

- చివ‌రి ద‌శ‌లో 19 ప‌రామితులను గుర్తించి వాటి ఆధారంగా ఆయా స్టేష‌న్లు అందిస్తున్న ప్ర‌జా సేవ‌ల‌తో పాటుగా పోలీసింగ్‌ను మెరుగుప‌రిచేందుకు గాను

గుర్తించిన టెక్నిక్స్ ఆధారంగా ప‌నితీరును బేరీజు వేయ‌డం జ‌రిగింది. దీనికే

మొత్తం స్కోరింగ్‌లో 80 శాతం వెయిటేజీ ఇవ్వ‌డం జరిగింది. మిగిలిన 20 శాతం పోలీస్ స్టేషన్ యొక్క మౌలిక సదుపాయాలు మరియు సిబ్బంది యొక్క ప్రాప్యత మరియు పౌరుల అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ర్యాంకింగ్‌ల నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. ముఖ్యంగా సమీప నివాస ప్రాంతాల వారి పౌర‌ వర్గాలు, సమీప మార్కెట్లు, పోలీసు స్టేషన్ల నుంచి విడుద‌లైన‌ పౌరుల అభిప్రాయాల్ని

ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు. దాదాపు 4,056 మంది పౌరుల నుంచి అభిప్రాయ సేక‌ర‌ణ సంప్ర‌దింపులు జ‌రిపారు. ప్రతి షార్ట్‌లిస్ట్ చేసిన ప్రదేశంలో సుమారు 60 మంది నుంచి అభిప్రాయ సేక‌ర‌ణ జ‌రిపారు. మహమ్మారి విస్త‌రించి ఉన్న వేళ సర్వేను విజ‌య‌వంతంగా పూర్తి చేయడానికి గాను..దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ సంవత్సరం సర్వేలో పూర్తి సహకారంతో పాల్గొన్నాయి. పోలీస్ స్టేషన్ల వార్షిక ర్యాంకింగ్ మ‌న పోలీసు సిబ్బంది కృషికి గుర్తింపుగా నిలుస్తోంది‌. మ‌న పోలీసు దళాలను ప్రోత్సహిస్తుంది. దీనికి తోడు భవిష్యత్ మార్గదర్శకత్వం కోసం దేశంలో పోలీసింగ్ యొక్క అనేక అంశాలపై అభిప్రాయాన్ని కూడా అందిస్తోంది. ఇది పోలీసు స్టేషన్ల స్థాయిలో భౌతిక మౌలిక సదుపాయాలు, వనరులు, లోపాల యొక్క ముఖ చిత్రాన్ని కూడా అందిస్తోంది. పోలీస్ స్టేషన్ల ర్యాంకింగ్ యొక్క వార్షిక వ్యాయామం మెరుగుదలకు స్థిరమైన మార్గదర్శిగా పని చేస్తుంది.

****

 (Release ID: 1678145) Visitor Counter : 341