వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

చిరు ధాన్యాలు మరియు వాటి ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఐఐఎంఆర్ తో కలిసి వ్యూహ ప్రణాళికను తయారుచేస్తున్ అపెడా(ఏపిఇడిఏ)


Posted On: 03 DEC 2020 3:09PM by PIB Hyderabad

చిరు ధాన్యాలు మరియు వాటి ఉత్పత్తుల ఎగుమతికి పెరుగుతున్న ఆదరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వాటి అభివృద్ధికి  అపెడా మరియు భారతీయ చిరు ధాన్యాల  పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) మరు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్), సిఎఫ్టిఆర్ఐ మరియు రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్పిఓలు) వంటి ఇతర భాగస్వాములతో కలసి రాన్నున్న 5 సంవత్సరాల్లో చిరు ధాన్యాలు మరియు వాటి ఉత్పత్తులను ప్రోత్సహించుటకు ప్రణాళికలు తయారు చేస్తోంది. ఈ సందర్భంగా అపెడా మరియు ఐఐఎంఆర్తో 2 డిసెంబర్ 2020న అపెడా అధ్యక్షుల అధ్యక్షతన ఒక సమావేశం నిర్వహించబడింది. ఇందులో రాన్నున్న ఐదేళ్ళు 2021-26 వరకు చిరు ధాన్యాలు మరియు వాటి ఉత్పత్తుల  ఎగుమతులను పెంచడానికి అవసరమైన ప్రోత్సాహక ప్రణాళికను అపెడా తయారు చేస్తోంది.  ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక నియమిత సమయం లక్ష్యంగా  భాగస్వాములందరనీ తయారుకావలసిందిగా కోరుతోంది. తదనంతరం చిరు ధాన్యాల క్లస్టర్లను గుర్తించడానికి, చిరు ధాన్యాలు పండించే రైతులకు తగిన వేదికను కల్పించడానికి, ఎఫ్పిఓలు, నిపుణులు, సంఘాలు మరియు ఇతర భాగస్వాములను, అంతర్జాతీయంగా క్రొత్త మార్కెట్టును గుర్తించి భారతీయ చిరు ధాన్యాలను ప్రోత్సహించేందుకు తగిన ప్రయత్నం చేయబడుతుంది.

జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామెలు, ఊదలు,వరిగలు, అరికలు వంటి చిన్న చిన్న విత్తనాలు గల ధాన్యాలను చిరు ధాన్యాలు అంటారు. ఇవి అత్యంత పోషక విలువలు కలిగినవి. ఇతర దేశాల్లో వీటికి పెరుగుతున్న ఆదరణను గుర్తించిన ప్రభుత్వం మన దేశంలో మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలో వీటిని ప్రోత్సహించాలని  నిర్ణయించింది.

 

***************



(Release ID: 1678121) Visitor Counter : 184