రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'డైరెక్టర్‌ జనరల్‌ బోర్డర్‌ రోడ్స్‌'గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ చౌదరి

Posted On: 02 DEC 2020 6:07PM by PIB Hyderabad

27వ 'డైరెక్టర్‌ జనరల్‌ బోర్డర్‌ రోడ్స్‌'గా ‍(డీజీబీఆర్‌) లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ చౌదరి మంగళవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

    లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌదరిని 1983లో డెహ్రాడూన్‌లోని 'ఇండియన్‌ మిలిటరీ అకాడమీ' నుంచి 'కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌'లోకి తీసుకున్నారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో స్టాఫ్‌ కోర్సు, మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజీలో,  దిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సు సహా సైన్యానికి చెందిన ప్రతిష్టాత్మక కోర్సులన్నింటినీ ఆయన పూర్తి చేశారు. బెంగళూరు ఐఐఎస్‌సీలో ఎంటెక్‌ కూడా చదివారు.

    డీజీబీఆర్‌గా బాధ్యతల స్వీకారానికి ముందు, రక్షణ శాఖ సమీకృత ప్రధాన కార్యాలయంలోని క్యూఎంజీస్‌ బ్రాంచిలో 'ఏడీజీ ఎల్‌డబ్ల్యూ&ఈ'గా విధులు నిర్వర్తించారు.    

    'ఎక్స్‌ యుద్ధ్‌ అభ్యాస్‌'లో భాగంగా అమెరికా ఇంజినీర్‌ బ్రిగేడ్‌తో కలిసి, మొట్టమొదటి, ఏకైక 'ఇంజినీర్‌ బ్రిగేడ్‌ ఎక్సర్‌సైజ్‌'ను లెఫ్టినెంట్‌ జనరల్‌ నిర్వహించారు. 2016లో, 'హ్యూమానిటేరియన్‌ మైన్‌ యాక్షన్‌'పై 18 దేశాలు పాల్గొన్న బహుళజాతి విన్యాసాలైన 'ఎక్స్‌ ఫోర్స్‌ 18'కు 'ఎక్సర్‌సైజ్‌ డైరెక్టర్‌'గా కూడా బాధ్యతలు చేపట్టారు.

    సైన్యంలో వివిధ హోదాల్లో లెఫ్టినెంట్‌ జనరల్‌ చౌదరి సేవలందించారు. కమాండ్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ ఫీల్డ్‌ కాయ్‌, కమాండ్ ఆఫ్‌ యాన్‌ ఇంజినీర్‌ బ్రిగేడ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ సదరన్‌ కమాండ్‌ వంటి హోదాలను చేపట్టారు.

***


(Release ID: 1677862) Visitor Counter : 191