గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ జాబితాలో రూ. 200కోట్ల లక్నో కార్పొరేషన్ బాండ్లు
పదేళ్ల వ్యవధితో కూడిన బాండుపై ఇన్వెస్టర్ల ఆసక్తి
రూ. 450కోట్ల మేరకు అందిన బిడ్లు
అమృత్ పథకంకింద మున్సిపల్ బాండ్లు వెలువరించిన 9వ నగరంగా లక్నో
వడ్డీ భారాన్ని తొలగించుకునేందుకు అందనున్న రూ.26కోట్లు
ఆత్మనిర్భర్ భారత్ నగరంగా లక్నో ఎదిగేందుకు అవకాశం
ముంబైలో బెల్ సెరిమనీకి యు.పి. ముఖ్యమంత్రి యోగీ హాజరు
కొన్ని నెలల్లోనే మున్సిపల్ బాండ్ల బాటలోకి
ఘజియాబాద్, వారణాసి, ఆగ్రా, కాన్పూర్ నగరాలు
Posted On:
02 DEC 2020 11:32AM by PIB Hyderabad
లక్నో నగర పాలకసంస్థకు (ఎల్.ఎం.సి.కి) సంబంధించిన రూ. 200కోట్ల మున్సిపల్ బాండ్ల ఇష్యూ,.. ఈ రోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ (బి.ఎస్.ఇ.) జాబితాలో చోటు సంపాదించింది. ఇందుకు సంబంధించి ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్.ఎస్.ఇ.)లో ఈ రోజు జరిగిన బెల్ సెరిమనీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ హాజరయ్యారు. దీనితో దేశంలో మున్సిపల్ బాండ్ల వెలువరించిన 9వ నగరంగా లక్నో రికార్డుకెక్కింది. లక్నో నగర పాలకసంస్థ మున్సిపల్ బాండ్లకు ఇష్యూకు అమృత్ (ఎ.ఎం.ఆర్.యు.టీ.) పథకం కింద కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తగిన ప్రోత్సాహాన్ని అందించింది. లక్నో నగర పాలక సంస్థ తనపై వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు రూ.26కోట్లు బాండ్ల ఇష్యూ ద్వారా సమకూరుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పై తగ్గబోయే 2శాతం వడ్డీ భారానికి సమంగా ఈ ప్రోత్సహక మొత్తం ఉంటుంది. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని, పరిపాలనా వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు, పెరుగుతున్న మౌలిక సదుపాయాల వ్యవస్థకు తగిన మద్దతు అందిస్తూ కార్పొరేషన్ సొంతంగా నిలదొక్కుకునేందుకు ఇది దోహపడుతుంది. ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తితో లక్నో నగరం స్వావలంబన సాధించేందుకు కూడా అవకాశం కలిగిస్తుంది.
ఎల్.ఎం.సి. తన మొదటి బాండ్ల ఇష్యూను 2020నవంబరు 13న ప్రారంభించింది. ఈ రోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టయిన ఈ ఇష్యూపై అదే స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రూ. 100కోట్ల మేర గ్రీన్ షో ఆప్షన్.తో సహా మొత్తం రూ. 100కోట్ల ఈ బాండ్ల ఇష్యూ, అప్పుడే ఇన్వెస్టర్లలో చెప్పుకోదగిన ఆసక్తిని రేకెత్తించింది. మొత్తం రూ. 450కోట్ల మేర బిడ్లను రాబట్టింది. పదేళ్ల బాండుకు ఆకర్షణీయమైన 8.5శాతం కూపన్ రేటుతో ఇది ముగియడం ఒక రికార్డని, కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఇది అసాధారణమని అంటున్నారు. మంచి నాణ్యమైన మున్సిపల్ బాండ్లకు ఇన్వెస్టర్ల డిమాండ్ ఉంటుందని ఈ ఇష్యూ చాటిచెప్పింది.
అమృత్ పథకం మొదలయ్యాక ఇలా ఉత్తరాదినుంచి, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ నుంచి తొలి మున్సిపల్ బాండ్ ఇష్యూ రావడం ఒక చారిత్రాత్మక సందర్భంగా చెబుతున్నారు. ఈ బాండు ఇష్యూపై ఇన్వెస్టర్లు గణనీయమైన ఆసక్తిని వెలిబుచ్చడం, బాండ్ల సంఖ్యను అధిగమించి బాండ్లకోసం దరఖాస్తులు రావడం దేశంలో మెరుగవుతున్న ఆర్థిక పరిస్థితిని సూచిస్తోంది. ఇదివరకు హ్మదాబాద్ నగరపాలక సంస్థ రూ. 100కోట్లమేర మున్సిపల్ బాండ్లను విడుదలతో ప్రారంభించిన ఒరవడిని ఎల్.ఎం.సి. కొనసాగించినట్టయింది. మౌలిక సదుపాయాల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు పూచీ లేకుండానే అహ్మదాబాద్ నగర పాలక సంస్థ 1998 జనవరిలో మున్సిపల్ బాండ్లను విడుదల చేసింది. ఎల్.ఎం.సి. బాండ్ల ఇష్యూకు ఉత్తరప్రదేశ్ పాటుగా, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. దీనితో పట్టణ పరిపాలనలో స్పష్టమైన మార్పునకు, మరింత పారదర్శకమైన స్థానిక పరిపాలనాయంత్రాగానికి ఇది సూచనగా చెబుతున్నారు. ఈ మున్సిపల్ బాండ్ల ఇష్యూను రాష్ట్రంలోని ఇతర స్థానిక స్వపరిపాలనా సంస్థలు కూడా ఆదర్శంగా తీసుకునేలా తగిన ప్రోత్సాహం అందించాలని ఉత్తప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఘజియాబాద్ నగర పాలక సంస్థ, వారణాసి, ఆగ్రా, కాన్పూర్ వంటి మరో పది నగర కార్పొరేషన్లు కూడా మరికొన్ని నెలల్లో మున్సిపల్ బాండ్ల బాటను పట్టవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలోని చిన్న చిన్న పురపాలక సంఘాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే సూచనలు ఉన్నాయి.
లక్నో మున్సిపల్ కార్పొరేషన్ బాండ్ ఇష్యూకు ఇండియా రేటింగ్స్ సంస్థ ‘AA’ రేటింగ్.ను, బ్రిక్.వర్క్ రేటింగ్ సంస్థ ‘AA (CE)’ రేటింగ్ ను ఇచ్చాయి. ఈ బాండ్ల ద్వారా సమకూరే మొత్తాన్ని కేంద్ర పర్యవేక్షణలోని అమృత్ పథకం కింద నీటి సరఫరా పథకంలో, గృహనిర్మాణ పథకంలో పెట్టుబడిగా పెట్టనున్నారు. బాండ్ల ఇష్యూ కాలవ్యవధి పదేళ్లు, దీన్ని సెవెన్ ‘స్ట్రిప్’ బాండ్ ఇష్యూగా రూపొందించారు. పదేళ్ల వ్యవధిలో 4వ సంవత్సరంనుంచి 10వ ఏడాది వరకూ ఏడు వార్షిక సమ మెత్తాల్లో సొమ్మును పెట్టుబడిదార్లకు తిరిగి చెల్లిస్తారు. అసలును, వడ్డీని సకాలంలో చెల్లించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి వెలువడిన ఈ తొలి బాండ్ పట్టణ మౌలిక సదుపాయాలకోసం వనరుగా ఉపయోగపడటం మాత్రమే కాకుండా, మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పట్టణ పరిపాలనా ప్రక్రియలో ఆదర్శ వ్యవస్థగా లక్నో నగర పాలక సంస్థను పూర్తిగా పరివర్తన చెందించేందుకు ఈ ఇష్యూ దోహదపడుతుంది.
****
(Release ID: 1677673)
Visitor Counter : 179