మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
హేమవతీ నందన్ గడ్వాల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యామంత్రి వర్చువల్ ప్రసంగం
Posted On:
01 DEC 2020 8:00PM by PIB Hyderabad
ఈరోజు జరిగిన హేమవతీ నందన్ గడ్వాల్ విశ్వవిద్యాలయపు 8వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విద్యాశాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియల్ నిశాంక్ వర్చువల్ పద్ధతిలో హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. యూనివర్సిటీ చాన్స్ లర్ హోదాలో డాక్టర్ యోగేంద్ర నారాయణ్ అధ్యక్షత వహించారు. యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ డిపి సింగ్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో ప్రధాన అంశం “ 2020 ఆన్లైన్ చదువులు, కోలుకొని యథాస్థితికి రావటం”. బోధన, అభ్యసనం, నైపుణ్యాభివృద్ధి అనే అంశాలపట్ల విశ్వవిద్యాలయపు కృషికి ఇది నిదర్శనం.
ఈ ఏడాది 155 మంది విద్యార్థులు ఆన్ లైన్ స్నాతకోత్సవానికి రిజిస్టర్ చేసుకున్నారు. 72 మందికి పిహెచ్ డి, 59 బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పోఖ్రియల్ మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయం తనన్ 47వ ఏట ప్రవేశిస్తున్నదని, ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కుంటూనే 2009 లో కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రతిపత్తి పొందిందని చెప్పారు.
ఈ యూనివర్సిటీలో నీతి ఆయోగ్ సంస్థ ఇండియన్ హిమాలయన్ సెంట్రల్ యూనివర్సిటీ కన్సార్షియంను ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. ఇది హిమాలయ పర్వత ప్రాంత మహిళాకార్మికుల ఆర్థిక ప్రభావాన్ని అంచనావేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కన్సార్షియం హిమాలయ రాష్ట్రాల వ్యవసాయ పర్యావరణ నేపథ్యంలో మార్కెటింగ్ మీద, పర్వత ప్రాంతాల్లో పర్యావరణ అనుకూల పర్యాటకరంగం మీద, పర్వత ప్రాంతాలనుంచి వలసలను నిరోధించగలిగే ఉపాధి కల్పన మీద దృష్టి సారించాలని సూచించారు.
ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థికావటం, స్నాతకోత్సవానికి ఇక్కడికే ముఖ్య అతిథిగా రావటం తన అదృష్టమని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ యూనివర్సిటీతో తనకెన్నో మరపురాని జ్ఞాపకాలున్నాయని, విద్యార్థి నుంచి ముఖ్య అతిథి దాకా ఎన్నో కష్టాలు, సవాళ్ళు ఉన్నాయన్నారు.
ఈ యూనివర్సిటీ దేశంలోనే అత్యంత అందమైన యూనివర్సిటీలలో ఒకటని చెబుతూ, ఇక్కడ సైన్స్, పర్యావరణం, ఆధ్యాత్మికత లాంటి భిన్నమైన అంశాల అధ్యయనానికి అవకాశముందన్నారు. మొత్తం దేశానికే తలమానికంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా రాణించగల సత్తా ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, ప్రతి విద్యార్థి జీవితంలో ఇదొక మరపురాని ఘట్టంగా నిలిచిపోతుందని ఆకాంక్షించారు.
మనం వ్యక్తిత్వ నిర్మాణం నుంచి జాతి నిర్మాణం వైపు అడుగులేయాలని మంత్రి సూచించారు. “ముందుగా దేశం, వ్యక్తిత్వం అవశ్యం” అనే మంత్రానికి కట్టుబడి ఉండాలని హితవు పలికారు. నూతన విద్యావిధానం గురించి మాట్లాడుతూ, దీని ఆధారంగా వృత్తి నిపుణులు తయారవటమే కాకుండా భారతీయ విలువలతో కూడిన విశ్వ మానవుడు తయారవుతాడని, అంతర్జాతీయ దృక్కోణం అలవరచుకుంటాడని దేశమే ప్రధానమనే భావన అర్థం చేసుకుంటూ వసుధైక కుటుంబకమ్ అనే సూత్రాన్ని అనుసరిస్తాడని అన్నారు.
హిమాలయ ప్రాంత విశ్వవిద్యాలయాలు పర్వత ప్రాంత వ్యవసాయం, ఉద్యానవన సాగు, మూలికల ఉత్పత్తి, పుష్ప ఉత్పత్తి, పర్యావరణ అనుకూల పర్యాటకం, సేంద్రియ సాగు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం లాంటి అంశాలమీద ఒఅరిశోధన సాగేలా చూదాలని వైస్ చాన్స్ లర్లకు సూచించారు. దీనివలన హిమాలయ ప్రాంత ప్రజల జీవనోపాథి వనరులు మెరుగుపడతాయన్నారు.
ఈ కార్యక్రమానికి విశేష అతిథిగా హాజరైన యూనివర్సిటీల గ్రాంట్ల సంఘం చైర్మన్ డాక్టర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్నవారిని, విద్యార్థులను, వారిన్ తల్లిదండ్రులను అభినందించారు. తాను చదువుకున్న రోజులను గుర్త్తు చేసుకుంటూ, అధ్యయనానికి అద్భుతమైన ప్రదేశం విశ్వవిద్యాలయమేనన్నారు. పట్టా అందుకునే విద్యార్థులందరికీ స్నాతకోత్సవం ఒక మరపురాని అనుభూతిగా అభివర్ణించారు. దీని తరువాత తాము సంపాదించుకున్న జ్ఞానాన్ని తమ సమాజ హితం కోసం వాడాలన్నారు. విద్యార్థులకు ఉజ్జ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ విశ్వవిద్యాలయం చాన్స్ లర్ డాక్టర్ యోగేంద్రనారాయణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు, కేంద్ర విద్యాశాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియల్ నిశాంక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ అన్నపూర్ణ నౌతియాల్ ప్రసంగిస్తూ, కోవిడ్ 19 సంక్షోభం ఉన్నప్పటికీ, ఈ ఏడాది విద్యాస్ఫూర్తి కొనసాగటానికి వీలుగా ఆన్ లైన్ పద్ధతిలోనే స్నాతకోత్సవం జరపాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం సహకరించిన విశ్వవిద్యాలయ మిత్రులకు, అతిథులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
విశ్వవిద్యాలయం గురించి పరిచయ వాక్యాలు చెప్పటంతోబాటు వైస్ చాన్స్ లర్ ఇది సాధించిన విశేషాలను వివరించి చెప్పారు. భౌగోళికంగా అనేక తేడాలు, వనరుల కొరత ఉన్నప్పటికీ, కోవిడ్ వల్ల వచ్చిన అన్ని లోపాలను విశ్వవిద్యాలయం అధిగమించి సవాళ్ళను అవకాశాలుగా తీర్చదిద్దుకున్నదన్నారు. ఇప్పుడు మూడు యూనివర్సిటీ కాంపస్ లలో ఉన్న 11 స్కూళ్లలో ఉన్న 79 డిపార్ట్ మెంట్ లు ఇప్పుడు జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయటానికి వేగంగా సిద్ధమవుతున్నాయని చెప్పారు,
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆర్ సి రమోలా, ఆఫ్ లైన్ కన్వీనర్ ప్రొఫెసర్ వైపి రెహమనీ, మీడియా కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం ఎం సెమ్వాల్, ప్రొఫెసర్ ఆర్ సి భట్, దాక్ రానా, రాజేంద్ర ప్రసాద్, ప్రొఫెసర్ పి ఎస్ నేగి, ప్రొఫెసర్ ఇందూ ఖండురి డాక్టర్ ప్రీతమ్ సింగ్ నేగి, డాక్టర్ నరేశ్ రాణా, డాక్టర్ నరేశ్ కుమార్, ప్రొఫెసర్ అరుణ్ బహుగుణ, శ్వేతా వర్మ, ప్రదీప్ మల్, హిమశిఖ గుసైన్ కూడా హాజరయ్యారు
***
(Release ID: 1677594)
Visitor Counter : 142