రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

బ్రహ్మోస్ టెస్ట్ ఫైరింగ్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన భారత నావికాదళం

Posted On: 01 DEC 2020 6:15PM by PIB Hyderabad

యాంటీ షిప్ మోడ్‌ల్‌ సూపర్సోనిక్ క్రూయిస్ క్షిపణి బ్రహ్మోస్‌ను భార‌త నావికా ద‌ళం ఈ రోజు 0900 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. ఈ ప‌రీక్ష‌లో భాగంగా క్షిపణి అత్యంత సంక్లిష్టమైన విన్యాసాలను ప్రదర్శించింది, దీనికి తోడు
లక్ష్యాన్ని తీక్ష‌ణ చొద‌క‌త‌తో నిర్ధారిత ల‌క్ష్యాల‌న్ని చేధించింది. బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, దీనిని రష్యాకు చెందిన ఎన్‌పీఓఎం, డీఆర్‌డీఓ
సంయుక్తంగా క‌లిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ జాయింట్ వెంచర్‌గా దీనిని అభివృద్ధి చేశారు. ఇది బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఏర్పాటు చేశారు. క్షిపణి ఆధునిక-సంక్లిష్ట యుద్ధరంగంలో ఒక ప్రధాన శక్తి గుణకం త‌న‌ను తాను ఏర్పాటు నిరూపించుకుంది. ఇది యాంటీ-షిప్, ల్యాండ్-అటాక్ సామర్ధ్యాలతో బహుళ-పాత్ర మరియు బహుళ-వేదిక సామర్థ్యం దీని ప్ర‌త్యేక‌త‌. భారత సాయుధ దళాల యొక్క మూడు విభాగాల‌లో ఇది మోహరించబడింది. బ్రహ్మోస్ క్షిపణి యొక్క మొట్టమొదటి ప్రయోగం 2001లో జరిగింది. ఇప్పటి వరకు దీనిని వివిధ ర‌కాల నౌకలు, మొబైల్ అటానమస్ లాంచర్లు, ఎస్‌యు-30 ఎంకేఐ విమానాల నుండి అనేక ప్రయోగాలు జరిగాయి. అనంత‌రం దీనిని బహుముఖ క్షిప‌ణి ఆయుధంగా మారింది. నేటి బ్రహ్మోస్ ప‌రీక్ష విజయవంతం కావ‌డంతో భారత నావికాదళ‌పు కార్యదర్శి డీడీఆర్&డీ మ‌రియు డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి బృందం
అభినంద‌న‌లు తెలిపారు. 

***

 


(Release ID: 1677558) Visitor Counter : 156