భారత పోటీ ప్రోత్సాహక సంఘం

రివిగో సర్వీసెస్ కైవసానికి సిసిఐ ఆమోదం

Posted On: 01 DEC 2020 1:10PM by PIB Hyderabad

రివిగో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్ప్రింగ్ కాంటర్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ (ఎస్ సి ఐఎల్) సంస్థ తీసుకోవటానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సిసిఐ) ఆమోదం తెలియజేసింది. కాంపిటిషన్ చట్టం, 2002 లోని సెక్షన్ 31(1) కింద తప్పనిసరిగా మార్చుకునే వెసులుబాటు ఉండే ఆధిక్యపు వాటాల చందా ద్వారా ఈ కొనుగోలుకు అవకాశం కల్పించింది.

ఎస్ సి ఐఎల్  అనేది మారిషస్ చట్టాల కింద ఏర్పాటైన ఒక ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ కంపెనీ. దీనికి భారత్ లో భౌతికంగా ఎలాంటి కార్యాలయామూ లేదు. దీని వాటాదారులు వార్ బర్గ్ పింకస్ ఎల్ ఎల్ సి (వార్ బర్గ్) నిర్వహణలో ఉండే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్

అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్ బర్గ్. అది కొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కు మేనేజర్ గా వ్యవహరిస్తుంది. ప్రైవేట్ ఈక్విటీ ఫంద్స్ యాజమాన్యంలోని పోర్ట్ ఫోలియో కంపెనీలు వివిధ రంగాల్లో చురుగ్గా పనిచేస్తాయి. అందులో విద్యుత్, ఆర్థిక రంగ సేవలు, ఆరోగ్యం, ఫార్మా, సాధారణ బీమా, వినియోగదారు సేవలు, పారిశ్రామిక, వ్యాపార సేవలు, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్లు ఉన్నాయి.

ఇవిగో అనేది ట్రక్కుల పరిశ్రమలో టెక్నాలజీ సంబంధమైన రవాణా కంపెనీ. డ్రైవర్ రిలే అనే సరికొత్త విధానాన్ని ఇది వాడుకుంటుంది. దీనివలన ట్రక్కుల పరిశ్రమ సాధించే సాధారణ సగటు వేగం కంటే ఎక్కువగా మరింత దూరం వెళ్లటానికి వీలు కలుగుతుంది. దీని కార్యకలాపాలలో రిలే ఆధారంగా సరకు రవాణా జరుగుతుంది. సరకు రవాణాను పూర్తి స్థాయి డిజిటల్ సాయంతో నడపటానికి, మొత్తం పారదర్శకమైన విధానాన్ని నిర్వహించటానికి ఇది దోహదం చేస్తుంది. అనేక వాహనాలను నడిపే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సవివరమైన సిసిఐ ఆదేశాలు త్వరలో వెలువడతాయి.

 

****


(Release ID: 1677352) Visitor Counter : 254