యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఆర్చర్ కపిల్‌కు కరోనా పాజిటివ్
- ప్రస్తుతానికి వెలుగులోకి రాని లక్షణాలు
प्रविष्टि तिथि:
30 NOV 2020 12:38PM by PIB Hyderabad
పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న నేషనల్ ఆర్చరీ క్యాంప్‌లో పాలుపంచుకుంటున్న కపిల్‌కు కరోనా వైరస్ సోకింది. ఇక్కడ జరిపిన కరోనా పరీక్షలలో ఆయనకు వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతానికి కపిల్‌కు తీవ్రవైన లక్షణాలు లేవు. కపిల్‌ణ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నారు. కపిల్ 18 రోజుల సెలవులో ఉన్నారు. శాయి అమలులోకి తెచ్చిన ప్రామాణిక ఎస్ఓపీ
ప్రకారం ఆయన తిరిగి శిబిరంలో చేరిన తరువాత పరీక్షించారు. ఈ సమయంలో కపిల్‌కు కరోనా నిర్ధారణయింది. ప్రస్తుతం ఆయన క్వారంటైయిన్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఆయన శిబిరంలోని ఇతరులతో కాంటాక్ట్‌లోకి రాలేదు.
*******
(रिलीज़ आईडी: 1677211)
आगंतुक पटल : 187