సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
వలస కార్మికులకు మొదటి ఆదాయాన్ని అందిస్తున్న కెవిఐసి హనీ మిషన్; రానున్న నెలల్లో మరింత అధిక దిగుబడి రానుంది
Posted On:
30 NOV 2020 3:59PM by PIB Hyderabad
కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) ప్రారంభించిన స్వయం సంమృద్ధి చర్యలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి. ఆగస్టు నెలలో ఉత్తర ప్రదేశ్‌లోని కెవిఐసికు చెందిన హనీ మిషన్‌తో కలిసి పనిచేస్తున్న బాధిత వలస కార్మికులు తమ మొదటి తేనె పంటను పొందారు. డిసెంబర్ మార్చి నెలల్లో వచ్చే బంపర్ దిగుబడి కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.
మొదట పశ్చిమ యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో ఐదుగురు వలస కార్మికులు ఈ ఏడాది ఆగస్టు 25 న వారికి పంపిణీ చేసిన 50 తేనెటీగ పెట్టెల నుండి 253 కిలోల తేనెను సేకరించారు. కిలో ముడి తేనె సగటున 200 రూపాయలకు అమ్ముడవుతుందని అంచనా. ఆ రేటు ప్రకారం వలస కార్మికులకు దాదాపు 50 వేల రూపాయలు లభిస్తుందని అంచనా. అంటే ఈ ప్రతి లబ్ధిదారునికి సగటున రూ.10,000 ఆదాయం. ఈ ప్రాంతంలో కెవిఐసి శిక్షణ పొందిన తరువాత 70 మంది వలస కార్మికులకు మొత్తం 700 తేనెటీగ పెట్టెలను పంపిణీ చేశారు. మిగిలిన తేనెటీగ పెట్టెల నుండి తేనె వెలికితీత రాబోయే రోజుల్లో కొనసాగుతుంది.
ఈ పెట్టెల నుండి తేనె ఉత్పత్తి డిసెంబర్ నుండి మార్చి వరకు కనీసం 5 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే యూకలిప్టస్ మరియు ఆవపిండి పంట సీజన్లో పూర్తిగా వికస్తాయి. ఈ తేనెటీగ పెట్టెలు సీజన్‌లో గరిష్టంగా దాదాపు 25 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తాయి. అలాగే తేనెటీగల పెంపకందారులు తమ పెట్టెలను సమీప రాష్ట్రాలైన హర్యానా, రాజస్థాన్ మరియు తూర్పు ఉత్తర ప్రదేశ్‌లకు తరలిస్తారు. అక్కడ తేనెటీగలు పుప్పొడి మరియు తేనెను సమృద్ధిగా తీసుకోవడం వల్ల అధిక ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.
కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ వలస కార్మికులు తమ మాలాలకు చేరుకోవడంతో పాటు స్వయం ఉపాధిలో నిమగ్నమవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. "ఇతర నగరాల నుండి తమ స్వస్థలాలకు తిరిగి వచ్చిన ఈ బాధిత కార్మికులను ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా హనీ మిషన్‌తో అనుసంధానం చేశారు. తద్వారా కేవలం మూడు నెలల్లో కార్మికులు సొంతంగా జీవనోపాధి పొందడం ప్రారంభించడం చాలా బాగుంది. తేనె ఉత్పత్తి ద్వారా వారి ఆదాయం రాబోయే నెలల్లో చాలా రెట్లు పెరుగుతుంది"అని సక్సేనా అన్నారు.
తమకు మద్దతు అందించినందుకు గాను లబ్ధిదారులు కెవిఐసి కృతజ్ఞతలు తెలిపారు. " ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్ళకుండా తేనెటీగల పెంపకం మాకు జీవనోపాధిని సంపాదించడానికి వీలు కల్పించింది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో స్థానికంగానే ఉపాధి కల్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు. మేము ఐదుగురు కార్మికులం 50 తేనెటీగ పెట్టెల ద్వారా కేవలం 3 నెలల్లోనే 253 కిలోల తేనెను సేకరించాము" అని సహారాన్‌పూర్ జిల్లాలోని కెవిఐసి బీకీపర్ అమిత్ కుమార్ అన్నారు.
ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి పిలుపుకు స్పందించిన కెవిఐసి..ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లోని వందలాది మంది వలస కార్మికులను హనీ మిషన్, కుమ్‌హర్ శశక్తికరన్ యోజన మరియు ప్రాజెక్ట్ డిగ్నిటిఇఎ వంటి పథకాలతో వారిని భాగస్వాములను చేసింది. అవసరమైన వస్తు సామగ్రిని పంపిణీ చేయడమే కాకుండా కొత్త తేనెటీగల పెంపకందారులకు సాంకేతిక శిక్షణ మరియు పర్యవేక్షణను కెవిఐసి అందించింది.
***
(Release ID: 1677198)
Visitor Counter : 226