యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భజరంగ్ పునియాకు అమెరికాలో నెలపాటు శిక్షణకు 'మిషన్ ఒలింపిక్ సెల్' అనుమతి
Posted On:
28 NOV 2020 6:55PM by PIB Hyderabad
కుస్తీ వీరుడు భజరంగ్ పునియా అమెరికాలో నెల రోజులు శిక్షణ పొందేందుకు అనుమతి లభించింది. గురువారం జరిగిన మిషన్ ఒలింపిక్ సెల్ 50వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు, మిచిగాన్‌లోని క్లిఫ్ కీన్ రెజ్లింగ్ క్లబ్‌లో ఈ శిక్షణ ఉంటుంది. ఇందుకు దాదాపు రూ.14 లక్షలు ఖర్చవుతుంది.
ప్రస్తుతం సోనెపట్‌లోని సాయ్ శిక్షణ శిబిరంలో ఉన్న భజరంగ్ పునియా, తన కోచ్ ఎమ్జారియోస్ బెంటినిడిస్, ఫిజియో ధనంజయ్‌తో కలిసి అమెరికా వెళతారు. అక్కడ అంతర్జాతీయ స్థాయి మల్లయోధులతో కలిసి, ముఖ్య కోచ్ సెర్గీ బెలోగ్లాజోవ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటారు. సెర్గీ బెలోగ్లాజోవ్ రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించారు.
2019 ప్రపంచ పోటీల్లో చోటు దక్కించుకోవడం ద్వారా, టోక్యో ఒలింపిక్స్‌కు భజరంగ్ ఇప్పటికే అర్హత సాధించారు.
***
(Release ID: 1676880)
Visitor Counter : 130