ఆర్థిక మంత్రిత్వ శాఖ
జిఎస్‌టి అమలులో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు ఆప్షన్-1ని ఎంచుకున్న పంజాబ్
26 రాష్ట్రాలు, శాసనసభలతో కూడిన అన్ని కేంద్రపాలిత ప్రాంతాలూ ఆప్షన్-1ని ఎంచుకున్నాయి
జిఎస్‌టి అమలు లోటును భర్తీ చేసేందుకు రూ.8,359 కోట్లు అందుకోనున్న పంజాబ్
రుణాల ద్వారా అదనంగా రూ. 3,033 కోట్లను సేకరించేందుకు పంజాబ్‌కు అనుమతి జారీ
Posted On:
28 NOV 2020 2:39PM by PIB Hyderabad
జిఎస్‌టి అమలు నేపథ్యంలో ఏర్పడిన ఆదాయ కొరతను భర్తీ చేసేందుకు ఆప్షన్ -1ని ఎంచుకుంటున్నట్టుగా పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. దీనితో ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్న రాష్ట్రాల సంఖ్య 26కు పెరిగింది. శాసన సభ కలిగిన మూడు కేంద్ర ప్రాంతాలూ ( ఢిల్లీ, జమ్ము& కాశ్మీర్, పుదుచ్చేరి) కూడా ఆప్షన్ -1ని ఎంచుకునేందుకు నిర్ణయించుకున్నాయి.
జిఎస్‌టి అమలు కారణంగా కొరత పడ్డ ఆదాయాన్ని భర్తీ చేసేందుకు ఆప్షన్-1ని ఎంచుకున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణ గవాక్షం ద్వారా పొందుతున్నారు. ఈ గవాక్షం అక్టోబర్ 23, 2020 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించిన క్రమంలో భారత ప్రభుత్వం రూ. 24,000 కోట్లను నాలుగు వాయిదాలలో రాష్ట్రాల తరఫున పొంది, అక్టోబర్ 23, నవంబర్ 2, నవంబర్ 9, 23 నవంబర్ 2020 నాటికి ఆప్షన్ -1ని ఎంచుకున్న రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించింది. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం కూడా ఈ గవాక్షం ద్వారా నిధులను అందుకుంటుంది. ఇది తదుపరి రుణ సేకరణ ప్రారంభం నుంచి పొందుతారు.
ఆప్షన్-1 నిబంధనల కింద, జిఎస్‌టి అమలు కారణంగా కొరత పడిన మొత్తాన్ని ప్రత్యేక గవాక్షం నుంచి రుణంగా పొందడమే కాక,ఆత్మ నిర్భర్ భారత్ కింద మే 17, 2020న భారత ప్రభుత్వం అనుమతించిన 2% అదనపు రుణాలలో 0.50% తుది విడత రుణంగా తీసుకునేందుకు రాష్ట్రాలకు బేషరతు అనుమతి ఉంది. ఇది 1.1 లక్ష కోట్ల ప్రత్యేక గవాక్షానికన్నా చాలా ఎక్కువ. పంజాబ్ ప్రభుత్వం నుంచి ఆప్షన్ -1ని ఎంచుకుంటున్నట్టు సమాచారాన్ని అందుకున్న తర్వాత, భారత ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం రూ.3,033 కోట్లను (పంజాబ్ జిఎస్‌డిపిలో 0.5%) అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిని ఇచ్చింది.
మొత్తం 26 రాష్ట్రాలు అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతి మంజూరీ, ఇప్పటి వరకూ 18 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక గవాక్షం ద్వారా సమీకరించి, ఇప్పటి వరకూ విడుదల చేసిన నిధుల వివరాలు జతచేయడం జరిగింది.
జిఎస్‌డిపిలో 0.50 శాతం అదనపు రుణాలు అనుమతి, ప్రత్యేక గవాక్షం ద్వారా సేకరించి 28-11-2020 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ అందించిన మొత్తాల వివరాలు.
Statewise additional borrowing of 0.50 percent of GSDP allowed and amount of funds raised through special window passed on to the States/UTstill 28.11.2020
(Rs. in Crore)
S. No.
|
Name of State / UT
|
Additional borrowing of 0.50 percent allowed to States
|
Amount of fund raised through special window passed on to the States/ UTs
|
1
|
Andhra Pradesh
|
5051
|
672.61
|
2
|
Arunachal Pradesh*
|
143
|
0.00
|
3
|
Assam
|
1869
|
289.54
|
4
|
Bihar
|
3231
|
1136.27
|
5
|
Goa
|
446
|
244.39
|
6
|
Gujarat
|
8704
|
2683.88
|
7
|
Haryana
|
4293
|
1266.68
|
8
|
Himachal Pradesh
|
877
|
499.74
|
9
|
Karnataka
|
9018
|
3611.17
|
10
|
Kerala#
|
4,522
|
0.00
|
11
|
Madhya Pradesh
|
4746
|
1321.98
|
12
|
Maharashtra
|
15394
|
3486.24
|
13
|
Manipur*
|
151
|
0.00
|
14
|
Meghalaya
|
194
|
32.51
|
15
|
Mizoram*
|
132
|
0.00
|
16
|
Nagaland*
|
157
|
0.00
|
17
|
Odisha
|
2858
|
1112.42
|
18
|
Punjab #
|
3033
|
0.00
|
19
|
Rajasthan
|
5462
|
645.06
|
20
|
Sikkim*
|
156
|
0.00
|
21
|
Tamil Nadu
|
9627
|
1816.66
|
22
|
Telangana
|
5017
|
164.41
|
23
|
Tripura
|
297
|
66.04
|
24
|
Uttar Pradesh
|
9703
|
1748.29
|
25
|
Uttarakhand
|
1405
|
674.27
|
26
|
West Bengal #
|
6787
|
0.00
|
|
Total (A):
|
103273
|
21472.16
|
1
|
Delhi
|
Not applicable
|
1706.93
|
2
|
Jammu & Kashmir
|
Not applicable
|
661.21
|
3
|
Puducherry
|
Not applicable
|
159.70
|
|
Total (B):
|
Not applicable
|
2527.84
|
|
Grand Total (A+B)
|
103273
|
24000.00
|
* These States have ‘NIL’ GST compensation gap
# Funds will be released starting after next round of borrowing.
***
(Release ID: 1676734)
Visitor Counter : 160