విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎస్‌టిపిఎల్‌కు చెందిన 2x660 మెగావాట్ల బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్్టకు రూ.8520 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న పిఎఫ్‌సి - ఆర్ ఇసి
Posted On:
27 NOV 2020 2:36PM by PIB Hyderabad
భారతదేశంలోని ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి అయిన పవర్ ఫైనాన్్స కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎఫ్‌సి), విద్యుత్ రంగంపై, విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థతో పాటుగా ఆర్ ఇసి లిమిటెడ్ సహా 2x660 మెగావాట్ల బక్సర్ థర్మల్ పవర్ ప్రాజెక్్టకు రూ.8520.46 కోట్ల నిర్ణీతకాలానికి రుణంగా ఇచ్చేందుకు ఎస్‌జెవిఎన్ థర్మల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌టిపిఎల్)తో అవగాహనా పత్రంపై గురువారం న్యూఢిల్లీలో సంతకాలు చేశాయి.
ఎస్‌టిపిఎల్ సంస్థ ఎస్‌జెవిఎన్ లిమిటెడ్ యాజమన్యంలో ఉన్న అనుబంధ సంస్థ. అది ఈ ప్రాజక్టును అమలు చేస్తుంది. 2x660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్్ట 2023-24 నుంచి ప్రారంభమై, బీహార్, ఇతర రాష్ట్రాల భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 9828 మిలియన్ యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
అవగాహనా పత్రంపై సంతకాలను న్యూఢిల్లీలోని పిఎఫ్‌సిలో గురువారం నాడు పిఎఫ్‌సి సిఎండి రవీందర్ సింగ్ ధిల్లాన్, పిఎఫ్‌సి డైరెక్టర్ & డైరెక్టర్ అదనపు ఛార్జీ (ప్రాజెక్టులు పి. కె. సింగ్, ఎస్‌జివిఎన్ సిఎండి ఎన్.ఎల్.శర్మ, ఎస్‌జెవిఎన్ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎ.కె. సింగ్, సమక్షంలో చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌టిపిఎల్ సిఇఒ & సిఎఫ్ ఒ, పిఎఫ్‌సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పిఎఫ్‌సి- ఆర్ిసి సీనియర్ అధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్‌జెవిఎన్‌తో పిఎఫ్‌సికి దీర్ఘకాల అనుబంధం ఉంది. రానున్న థర్మల్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడమన్నది ఈ రెండు సంస్థల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయనుంది.
***
(Release ID: 1676623)
Visitor Counter : 170