పార్లమెంటరీ వ్యవహారాలు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ సంబరాలు
రాజ్యాంగ ప్రాధమిక నిబంధనలు, విలువలు- శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్యన అంతర్గత సమన్వయం
అనే అంశంపై వెబినార్ నిర్వహణ
Posted On:
26 NOV 2020 7:46PM by PIB Hyderabad
రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజును ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద్భంగా గౌరవనీయులైన రాష్ట్రపతి ఆధర్వ్యంలో రాజ్యాంగ ప్రవేశిక పఠన కార్యక్రమం జరిగింది. ఇందులో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రవేశికను చదివిన రత్వాత ప్రాధమిక విధుల నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమంపైన స్వీయ ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా జరిగింది.
ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రాధమిక నిబంధనలు, విలువలు- శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్యన అంతర్గత సమన్వయం అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. ఇందులో మంత్రిత్వశాఖ అధికారులు, సిబ్బందే కాకుండా ఎర్త్ సైన్స్ మంత్రిత్వశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సత్యప్రకాష్ ప్రసంగించారు.
రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన విలువల ప్రాధాన్యత గురించి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ విలువల ప్రాధాన్యతను వివరించారు. భారత రాజకీయ వ్యవస్థలో భాగంగా వున్న మూడు ప్రధాన భాగాల గురించి మాట్లాడారు.
****
(Release ID: 1676411)
Visitor Counter : 130