కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ సంఘం (సిసిఇఎ)

మెసర్స్ ఎటిసి టెలికం ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ లో మెసర్స్ ఎటిసి ఏశియా ప‌సిఫిక్ పిటిఇ. లిమిటెడ్ ద్వారా 2480.92  కోట్ల రూపాయ‌ల ఎఫ్‌డిఐ కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 25 NOV 2020 3:37PM by PIB Hyderabad

మెసర్స్ ఎటిసి టెలికం ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఈక్విటీ వాటా మూల‌ధ‌నం లో 12.32 శాతాన్ని (పూర్తి స్థాయి లో డైల్యూట్ అయ్యే ప్రాతిపదిక న) పొందడానికి మెసర్స్ ఎటిసి ఏశియా ప‌సిఫిక్ పిటిఇ లిమిటెడ్ దాఖ‌లు చేసిన ఎఫ్‌డిఐ ప్ర‌స్తావన (సంఖ్య 4930) కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఆర్థిక వ్య‌వ‌హారాల మంత్రివ‌ర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం ఆమోదం తెలిపింది.  మెసర్స్ టాటా టెలీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎస్ఎల్‌) తో పాటు టాటా స‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టిఎస్‌పిఎల్) లు వాటి పుట్ ఆప్శన్ ను వినియోగించుకోవడం ఈ ప‌రిణామానికి దారితీసింది.

దీనితో 2480.92 కోట్ల రూపాయ‌ల విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి (ఎఫ్ డిఐ) దేశం లోకి త‌ర‌లిరానుంది.  ఈ ఆమోదం ల‌భించ‌డంతో ఎటిసి టెలికం ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎటిసి ఇండియా) లో మెసర్స్ ఎటిసి ఏశియా పసిఫిక్ పిటిఇ లిమిటెడ్ (ఎటిసి సింగ‌పూర్‌) మొత్తం ఎఫ్ డిఐ  2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం మధ్య కాలం లో 5417.2 కోట్ల రూపాయ‌లుగా లెక్క తేలుతుంది.

వివ‌రాలు:

1)  టెలికం ఆప‌రేట‌ర్ ల‌కు టెలికమ్యూనికేష‌న్ సంబంధిత మౌలిక స‌దుపాయాల సేవ‌ల‌ను అందించే వ్యాపారంలో నిమ‌గ్న‌మైన కంపెనీ యే మెసర్స్ ఎటిసి టెలికం ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్‌.  

2)  కంపెనీ కి 86.36 శాతం వర‌కు ఎఫ్‌డిఐ ని స‌మ‌కూర్చుకొనేందుకు ఆమోదం ఉండ‌గా, తాజా మంజూరు తో అది హెచ్చి 98.68 శాతానికి (పూర్తి స్థాయి లో డైల్యూట్ అయ్యే ప్రాతిపదిక న) చేరుకోగలదు.

3)  2020-21 ఆర్థిక సంవ‌త్స‌రం లో మెసర్స్ ఎటిసి ఏశియా ప‌సిఫిక్ పిటిఇ లిమిటెడ్ ద్వారా మెసర్స్ ఎటిసి టెలికం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి 2480.92 కోట్ల మేరకు ఉండబోతోంది.  ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ డిఐ ప్రస్తావనలు (ప్రస్తావన సంఖ్య‌ 4854 మరియు 4860) ల‌కు ఇచ్చిన మంజూరులను పరిశీలిస్తే మొత్తం కలిపితే  5417.2 కోట్ల రూపాయ‌లు అవుతుంది.

ప్ర‌భావం:

భార‌త‌దేశం లోకి త‌ర‌లివ‌చ్చే విదేశీ మూల‌ధ‌నం ఆర్థిక వృద్ధిని పెంచ‌డంతో పాటు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ద‌న్నుగా ఉండ‌గ‌ల‌దు.

పూర్వ‌రంగం:

టెలికం సేవ‌ల రంగం లో 100 శాతం వ‌ర‌కు ఎఫ్‌డిఐ ని అనుమ‌తించడమైంది.  దీనిలో 49 శాతం ఆటోమేటిక్ రూటు లో, 49 శాతం తరువాత భాగం గ‌వ‌ర్న‌మెంట్ మాధ్యమం లో ఉంటుంది.  అయితే, ఇది- టెలిక‌మ్యూనికేశన్స్ విభాగం (డిఒటి) ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ఆధికారికంగా ప్ర‌క‌టించే లైసెన్స్, భ‌ద్ర‌త‌ ప‌ర‌మైన ష‌ర‌తుల‌ను లైసెన్సు పొంద‌గోరుతున్న సంస్థ‌తో పాటు ఇన్వెస్ట‌ర్ లు కూడా పాటించాలి అనే షరతు కు లోబ‌డి- అమలులో ఉంటుంది.

కంపెనీ టెలిక‌మ్యూనికేశన్స్ విభాగం ద్వారా మంజూరు అయిన వివిధ అనుమ‌తుల ప్ర‌కారం టెలికం ఆప‌రేట‌ర్ లకు పాసివ్ టెలికం ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ సర్వీసుల‌ను అందించే వ్యాపారం లో నిమ‌గ్న‌మై ఉంది.



 

***


(Release ID: 1675730) Visitor Counter : 180